23, జూన్ 2010, బుధవారం

సమస్యాపూరణం - 18

కవి మిత్రులారా!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కోకిలమ్మకుఁ బుట్టెను కాకి యొకటి.

14 కామెంట్‌లు:

  1. కంది శంకరయ్యగారూ, ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో పద్యకవుల సందడి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. మీ కృషికి అభివందనాలు. మిమ్మలనందరినీ చూసాక కొద్దిగా ధైర్యం చేసి నాకూ వ్రాయాలనిపించి వ్రాస్తున్నాను. దయచేసి తప్పులుంటే తెలియ చేయ ప్రార్థన

    [స్వాతంత్ర్య భారతావనిలో నిస్సిగ్గుగా ఉదయించే ప్రతి అసాంఘిక, అప్రజాస్వామ్య పోకడల దృష్టిలో వుంచుకొని]

    ఎన్ని పుస్తెలు తెగకున్న నెగిరె తెల్ల
    పావురము విను వీధుల ! పాపమేమి?
    వాసికెక్కిన స్వాతంత్ర్య బరతజాతి
    కోకిలమ్మకు బుట్టెను కాకి యొకటి.

    రిప్లయితొలగించండి
  2. పారద్రోలగా పరజాతి పాలనమ్ము
    ప్రాణముల ధారపోసింది భరత జాతి
    నేటి పాలకుల్ పీడించు నేతలైరి
    కోకిలమ్మకు బుట్టెను కాకి యొకటి

    రిప్లయితొలగించండి
  3. భాస్కర రామిరెడ్జి గారూ,
    బ కు కొంచెం వత్తివ్వండి సార్

    రిప్లయితొలగించండి
  4. @ భాస్కర రామి రెడ్డి -
    @ హరి దోర్నాల -
    ఇద్దరి పూరణలు బాగున్నాయి. అదేమిటో ఇద్దరి పద్యాలలో భావసారూప్యత ఉంది. చిత్రం!

    రిప్లయితొలగించండి
  5. తే.గీ.
    తెరను మెప్పించిన నటులు తరలి పోయె
    వంశ ఘనతను వాగెడి వారసుండు
    వచ్చె, టాలెంటు లేనట్టి వానిఁజూడ
    కోకిలమ్మకుఁ బుట్టెను కాకి యొకటి!!

    రిప్లయితొలగించండి
  6. నరసింహ గారూ అచ్చుతప్పును చూపినందుకు ధన్యవాదాలు.

    ఎన్ని పుస్తెలు తెగకున్న నెగిరె తెల్ల
    పావురము విను వీధుల ! పాపమేమొ?
    వాసికెక్కిన స్వాతంత్ర్య భరతజాతి
    కోకిలమ్మకు బుట్టెను కాకి యొకటి.

    రిప్లయితొలగించండి
  7. కాకి తనయింట పొదుగును కోకిలలను
    పేద కష్టించి ధనికుని పెద్ద సేయు
    కోకిలమ్మకు బుట్టెను కాకి యొకటి
    యన్న వింటిమే యెపుడైన? అన్న లార!

    రిప్లయితొలగించండి
  8. శుకపికావళి కూజిత సుమగుళుచ్ఛ
    మధుహసిత మాధురీ సుకుమార మొప్పు
    సురభిని నిదాఘమే రీతి పరగి తొడరు?
    కోకిలమ్మకు బుట్టెను కాకి యొకటి

    గ్రీష్మం వసంతానికి ఎలా పుట్టింది(అనుసరించింది)? కోకిలమ్మకు కాకి పుట్టినట్టు - భావం సరిగ్గా ప్రతిబింబించలేదు, కానీ నా భావం ఇదివరకే భారారె గారు చక్కగా వ్రాశారు.

    గుళుచ్ఛ = గుత్తి
    సురభి = వసంతం
    నిదాఘం = వేసవి
    తొడరు = అనుసరించు

    రిప్లయితొలగించండి
  9. వ్యాస వాల్మీకి వెలసిన భారతమున
    యార్లగడ్డలు నేడిట్లు వేర్లు తొడిగె
    కోకిలమ్మకుఁ బుట్టెను కాకి యొకటి
    జీవి వికటించె, మేధకు చేవ జచ్చె

    రిప్లయితొలగించండి
  10. జిగురు సత్యనారాయణ గారూ,
    నిజమే. వారసత్వంగా నటులైన కొందరు కోకిలకు పుట్టిన కాకులే. మంచి పూరణ. ధన్యవాదాలు.

    హరి దోర్నాల గారూ,
    ప్రశ్నార్థకంగా చక్కగా పూరించారు. బాగుంది.

    రవి గారూ,
    నిన్ననే మీ పదగుంఫనానికి విస్తుపోయి ఇమెయిల్ పంపాను. చూసారా?

    చదువరి గారూ,
    వాస్తవాన్ని ప్రస్తావిస్తూ చక్కని పూరణ పంపించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శంకరయ్య గారు, మీ ఈ మెయిలు నాకు ఎంచేతో చేరలేదండి.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !

    01)
    ________________________________

    గాంధి నెహ్రుల గన్నట్టి - కనక గర్భ !
    నేటి భారతావని జూడ - నిజము గాను
    లంచ గొండులె పాలించు - రాజ్య మయ్యె!
    కోకిలమ్మకుఁ బుట్టెను - కాకి యొకటి !
    ________________________________

    రిప్లయితొలగించండి