2, జూన్ 2010, బుధవారం

సమస్యాపూరణం -1

కవి మిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
మందు త్రాగి పొందె మరణ మతఁడు.

7 కామెంట్‌లు:

  1. సందు గొందు వెలసె సారాయి కొట్లేన్నొ
    పట్ణమందు ఆన్ని పల్లెలందు,
    ఉండబట్టలేక ఉన్నదంతయు ఊడ్చి
    మందు త్రాగి పొందె మరణమతడు.

    - సుమిత్ర

    రిప్లయితొలగించండి
  2. సుమిత్ర గారూ, మంచి ధారాశుద్ధితో నిర్దోషంగా సమస్యను పూరించారు. అభినందనలు. ఇలాగే నేను ఇకనుండి నిర్విరామంగా ఇచ్చే సమస్యలను పూరిస్తూ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    ___________________________________

    అహరహము శ్రమించి - అప్పులెన్నో జేసి
    చేను మీద పెట్టి - చెడిన రైతు
    మొగము జూప లేక - పొలమందు పురుగుల
    మందు త్రాగి పొందె - మరణ మతఁడు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  4. మందు మాను మనుచు మందుని,ఈ లోక
    మందు భార మనుచు మందలించ;
    మందు,విషము కలిపి మంది జూడగ గ్రామ
    మందు,త్రాగి పొందె మరణ మతడు.

    రిప్లయితొలగించండి
  5. "రామజోగి మందు కొనరే పామరులార " నాదనామ క్రియ రాగం = ఆదితాళము " పాటను
    విని రామజోగి పురుగు మందుల అంగడికి పోయి పురుగుల మందు కొని సేవించె నొకండు
    ======*======
    "రామజోగి మందు పామరులార,భు
    జింప రయ్య మీరు పెంపెలరగ
    ప్రేమ నొందు ననగ ,ప్రీతితో వెడలి తా
    మందు త్రాగి పొందె మరణ మతడు "

    రిప్లయితొలగించండి
  6. పెద్ద రోగమొకటి పేదవానికి వచ్చె
    ధనము లేక నగరమునకుఁ జనక
    నయమగునని చెప్పి పాటు వైద్యు డిడిన
    ముందుఁ ద్రాగి పొందె మరణ మతఁడు.

    రిప్లయితొలగించండి
  7. ఆ. వె.
    పెక్కు రోగములను పెంచుక నొకరోగి
    బాధపడుచునుండె బ్రతకలేక
    యెవరులేని వేళ నెందుకో యెలుకల
    మందు త్రాగి పొందె మరణమతడు!!

    రిప్లయితొలగించండి