10, ఆగస్టు 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 13

చిక్కు ప్రశ్నల పద్యం
మంగిపూడి వేంకట శర్మ గారు 1911 లో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో "చమత్కార చంద్రిక" పేర కొన్ని చిత్ర పద్యాలను ప్రకటించారు. వాటిలో ఒకటి ఇది ...
తే.గీ.
ఇంటికిని వింటికినిఁ బ్రాణ మేది చెపుము?
కంట మింటను మనమేది కాంచగలము?
పువ్వు నవ్వు దేనిని గూడి పొలుపు గాంచు?
నొకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు.

సమాధానాలు -
ఇంటికిని, వింటికినిఁ బ్రాణ మేది? ( నారి )
కంట, మింటను మనమేది కాంచగలము? ( తారలు )
పువ్వు, నవ్వు దేనిని గూడి పొలుపు గాంచు? ( వలపు )
( ప్రొ. జి. లలిత గారికి కృతజ్ఞతలతో )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి