25, ఆగస్టు 2010, బుధవారం

సమస్యా పూరణం - 76

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
అమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే.

వారాంతపు సమస్యా పూరణం - 6
తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

15 కామెంట్‌లు:

  1. పద్యం చందస్సు ఏమిటో కూడా ఇస్తే సులభంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. తమ్ములు, యన్నలు, చెళ్ళెలు
    కమ్మగ పిన్నమ్మ యనగ, కాంచిన వాడై
    రమ్మని పిలవగ తా చిన్-
    నమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే !!

    (కేంద్ర మంత్రి దగ్గుపాటి పురుంధరేశ్వరిని గూర్చి)

    రిప్లయితొలగించండి
  3. కందం:
    బొమ్మను కొని యొక బాలిక
    అమ్మా, రమ్మనుచు పిలిచె; నాలిన్ పతియే-
    పొమ్మన, నావిడ 'అరెరే
    గమ్మున యుండక నీకీ గోలెందుక'నెన్!

    రిప్లయితొలగించండి
  4. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    సాధారణంగా అవధానాలలో సమస్యగా పద్యపాదాన్ని ఇవ్వడమే కాని దాని చందస్సు చెప్పరు. ఇచ్చిన సమస్య ఏ ఛందస్సులో ఉందో తెలిసికొని పూరంచడం అవధాని పని. పద్యాలు వ్రాయడం అభ్యాసమయ్యాక పద్య పాదాన్ని చూడగానే, వినగానే అది ఏ చందస్సులో ఉందో తెలిసిపోతుంది.

    రిప్లయితొలగించండి
  5. నచికేత్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    నారాయణ గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు. కాకుంటే చివరి పాదంలో యతి తప్పింది. అదే పాదంలో మూడవ గణం తప్పనిసరిగా జగణం కాని, నలం కాని అయి ఉండాలి కదా. మీరు గగం వేసారు. వీలైతే సవరించండి.

    రిప్లయితొలగించండి
  6. నా పూరణ .............

    నెమ్మన ముప్పొంగగ రం
    గమ్మను పెండ్లాడినాఁడు హరి యనువాఁడా
    యమ్మకుఁ బని చెప్పఁగ "రం
    గమ్మా! ర" మ్మనుచు పిలిచె నాలిన్ పతియే.

    రిప్లయితొలగించండి
  7. ఇమ్ముగ ప్రియసఖిని గాంచి
    నెమ్మనమున జేరెనంత నెయ్యపు కిన్కన్
    కొమ్మరొ నీ విభునిటు కను
    మమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే

    రిప్లయితొలగించండి
  8. నమస్కారములు శంకరయ్య గారు మీరందరు ఇప్పుడిప్పుడే విశ్రాంతి తీసుకుంటున్నారు నేను 4,5,ఏళ్ళుగా విశ్రాంతి లొ ఉన్నాను మరి ఇప్పుడు చెప్పండి నన్నేమని పిలవాలొ ? మీ అందరి ఆదరాభి మానములకు ధన్య వాదములు + కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అయితే మొదటి పాదంలో మూడవ గణంగా జగణం వేసారు. కందంలో 1వ, 3వ పాదాలలో బేసిగణంగా జగణాన్ని వాడరాదు కదా!
    మీ మొదటి పాదాన్ని "ఇమ్ముగఁ దన ప్రియసఖిఁ గని" అని సవరిస్తే ఎలా ఉంటుంది?
    అన్నట్టు నన్నూ చింతా వారితో పాటు తమ్ముడిగా భావించి వాత్సల్యాన్ని వర్షించండి. చిన్నప్పుడు నాలో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచి, నా భవిష్యత్తుకు బంగారు బాట చూపింది మా అక్కయ్యే.

    రిప్లయితొలగించండి
  10. కందంలో కష్టాలు తెలిసి వస్తున్నాయి శంకరయ్యగారూ- లోపాన్ని సవరించేందుకు ప్రయత్నిస్తున్నాను చూడండి- ఇది ఎలా ఉన్నదో-
    బొమ్మను గొని యొక బాలిక
    అమ్మా రమ్మనుచు పిలిచె; నాలిన్ పతియే
    పొమ్మన, నావిడ హే దై-
    వమ, నేనెటు పోవలెనని రుసరుసలాడెన్.

    రిప్లయితొలగించండి
  11. :( అయ్యయ్యో, లెక్క మళ్ళీ తప్పింది! ఇంకోసారి ప్రయత్నిస్తాను..:(

    రిప్లయితొలగించండి
  12. ఇది ఎలా ఉందో చూడండి:
    బొమ్మను గొని యొక బాలిక
    అమ్మా రమ్మనుచు పిలిచె; నాలిన్ పతియే
    పొమ్మన, నావిడ హేదై-
    వమ నేనెటుపోవలెనని విలవిలలాడెన్
    ('వలవల వగచెన్' అంటే మరీ బాగుండదేమో!? :)
    కొత్తగా నేర్చుకున్న పాఠం: పద్యం దారి తప్పినప్పుడు దాన్ని సవరించటం కంటే కొత్తది రాయటం సులువు. )

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్య గారు,
    నమస్తే. ఈ మధ్య ఆఫీస్ లో పని ఎక్కువగా ఉంటోంది. వీలైనప్పుడు దాదాపు ప్రతి రోజు మీ బ్లాగును చూస్తూనే ఉన్నాను కాని వ్యాఖ్యలు రాయడం కుదరటం లేదు. మీ బ్లాగు వల్ల ప్రతి రోజు మంచి పద్యాలు చదివే అదృష్టం కలుగుతోంది. మీ నిరంతర కృషికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. నారాయణ గారూ,
    మళ్ళీ పప్పులో కాలు వేసారు. చివరి పాదంలో కూడా ప్రాసాక్షరం ద్విత్త్వమై ఉండాలి. యతి కూడ తప్పింది. దానిని ఇలా సవరించాను.
    బొమ్మను గొని యొక బాలిక
    అమ్మా రమ్మనుచు పిలిచె; నాలిన్ పతియే
    పొమ్మన, నావిడ హే దై
    వమ్మా యెటు పోవలెనని వగచుచు పలికెన్.

    రిప్లయితొలగించండి
  15. కమ్మని వినాయక చవితి
    గమ్మున వచ్చెను వడివడి గంపల తోడన్
    తెమ్మిక పత్రిని ఓ! గౌ
    రమ్మా! రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే

    రిప్లయితొలగించండి