28, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 79

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
రావణుఁడు సీత మగఁడయి రక్ష సేయు.

వారాంతపు సమస్యా పూరణం - 6

తల్లిని చంపియున్ సుతుఁడు తండ్రి పదంబుల వ్రాలె భక్తితోన్.

2 కామెంట్‌లు:

  1. రావణుడు సీత మగడయి రక్ష సేయు-
    ననుకొనిన దనుజులును రావణునిపుడు గ-
    ని యితడిక ఓడును;నిజమని తలచిరట
    తెరలి భీతిలు దైత్యుని తీరు జూచి.

    (యతి ప్రాసలెక్కడా తప్పినట్లు లేదు; కానీ 'తేటగీతి ఇలా తయారైందేమి?' అనిపిస్తున్నది- మీ వ్యాఖ్యలకోసం ఎదురుచూస్తున్నాను)

    రిప్లయితొలగించండి
  2. నారాయణ గారూ,
    కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.
    మీ పద్యంలో ఎలాంటి గణ యతి దోషాలు లేవు.
    న, ణ ప్రాసయతిని కొందరు పాటిస్తారు.

    రిప్లయితొలగించండి