28, సెప్టెంబర్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 35

అష్ట దిక్పాలక స్తుతి - 8 ( ఈశానుడు )
సీ.
హిమశైల శిఖరోన్నత మహా వృషభ వాహ
నాధిరోహణుఁడు విశ్వాధినేత
నిరతార్ధగాత్ర సన్నిహిత పర్వతరాజ
పుత్రీ ద్వితీయానుభూతిరతుడు
కైలాస పర్వతాగ్ర నివాస పరితోషి
వర వీర గణ వార పరివృతుండు
సర్వ భూతవ్రాత సర్వ విద్యాజాత
నిర్ణేత మహిత దృక్కర్ణభూషుఁ
తే.గీ.
డిష్ట సఖుఁడు కుబేరుని కిందుధరుఁడు
గగన కేశుఁ డతిస్వచ్ఛ కాంతితనుఁడు
ఈశ్వరుండు మహానటుం డెల్లవేళ
సర్వ సౌఖ్యంబు లిడి మమ్ము సాఁకుఁ గాత.
( ఆజ్ఞాత కవి )

2 కామెంట్‌లు:

  1. అద్భుతంగా ఉంది మాష్టారూ. "ఈశ్వరుండు మహానటు౦డు" బాగుంది. అజ్ఞాతకవి అంటున్నా, శైలిని బట్టి అష్టదిక్పాలక స్తుతి లోని పద్యాలన్నీ ఒక కవియే వ్రాశారానిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ,
    మీరన్నది నిజమే. ఆ పద్యాలన్నింటిని వ్రాసిన కవి ఒకడే.

    రిప్లయితొలగించండి