18, అక్టోబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 126

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పంచ పాండవులనఁ బదుగురు కద!

7 కామెంట్‌లు:

  1. ఐదుగురకు చాలు నైదు గ్రామములని
    పంచ పాండవులన, బదుగురు కద-
    నమును కోరు చుండ్రి నా తమ్ము లిప్పుడు
    కల్ల సంధి యనెను కౌరవుండు

    రిప్లయితొలగించండి
  2. భీష్ముడు దుర్యోధనుడుతో:

    ఎంచ నొకటి రెండు యేపారి వారుండ
    మించగలము ననుట వంచనేను
    పొంచియున్న బులుల బుడకతో గెలకంగ
    పంచ పాండవులనఁ బదుగురు కద

    రిప్లయితొలగించండి
  3. ధర్మ రాజు గలిగె తమ్ముల నలుగుర
    గాలి కొడుకునకును గలరు మువురు
    నరుని కిరువురు మరి నకులుని కొక్కరే
    పంచ పాండ వులన పదుగురు కద !

    రిప్లయితొలగించండి
  4. ప్రతిభ ఎంత గలదొ పౌరాణి కములందు
    పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడిగె
    చెప్పు వారి గనక చెప్పెను పంతులే
    పంచ పాండ వులన పదుగురు కద !

    రిప్లయితొలగించండి
  5. యెంచి చూచి నంత యెంతైన వింతయిది .
    పంచ మనగ కోళ్ళు పదులు గావు
    మూడు వ్రేళ్ళు తీయ రెండుమ్రింగ గనొకటి
    పంచ పాండవులన పదుగురు కద

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    నేదునూరి రాజేవరి గారూ,
    అందరి పూరణలు ఒకరిని మించి ఒకరివి బాగున్నాయి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. ప్రతిభ ఎంత గలదొ పౌరాణికము లందు

    పదిలొ కెళ్ళి డీవొ ప్రశ్న లడుగ

    చెప్పు వారి గనక చెప్పెను పంతులే

    పంచ పాండ వులన పదుగురు కదా !

    ( పది లొ =పదవ తరగతి ,డీవొ = D E O

    నిన్న నే వ్రాసి పోస్ట్ చేసాను ఎందు వల్లనో పోస్ట్ కాలేదు

    సరదాగా వ్రాసినది ఎవరినీ నొప్పించాలని కాదు

    విద్యార్ధులకు ఉపాధ్యాయులకు క్షమాపణలతో}

    రిప్లయితొలగించండి