4, నవంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 143

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
ధూమశకట మెక్కి రాముఁ డేగె.

10 కామెంట్‌లు:

  1. మాష్టారూ చూసి తప్పొప్పులు చెప్పండి

    కులతిలకుడు మేలుగొలుప,గప్తిగలుగ
    కటిక నేల దగిలి గతదినమ్మె;
    గృహిణి,తమ్ములగొని, గుహునిసాయమున ని
    ర్ధూమ శకట మెక్కి రాముడేగె

    రిప్లయితొలగించండి
  2. ధరణి సుతకుఁ గలిగె దండకారణ్యముఁ
    గన్నులారఁ జూడ గాంచు కోర్కె
    మమత దెచ్చె బండి మానినితోఁ గూడి
    ధూమశకట మెక్కి రాముఁడేగె

    రిప్లయితొలగించండి
  3. ఊకదంపుడు గారూ,
    పద్యం చాలా బాగుంది. గుహుని నావను నిర్ధూమశకటంగా మార్చిన మీ నైపుణ్యానికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఆఖరుకు రైల్వే మంత్రిని రామాయణంలోకి లాగారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. హవిసు లంద వచ్చె నగ్నిహోత్రుడు హోమ
    ధూమ శకట మెక్కి, రాము డేగె
    రక్కసులను జంపి రక్షింప జన్నము
    గాధి సుతుని వెంట కానలకును.

    రిప్లయితొలగించండి
  6. రామగిరి నివాసి రమణు(డా యక్షుడు
    ధూమశకట మెక్కి రాముఁ డేగె,
    ఊహల యలకపురి కాహితప్రేయసి
    గనుగొన, యెడబాట దెన్నతరమ !

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ నమస్కారములు.
    (19)60లలో దండకారణ్యంలోంచి ఇనుము ఖనిజాన్ని జపానుకి విశాఖపట్నం నౌకాశ్రయము గుండా ఎగుమతి చేయడానికి రైలు మార్గము నిర్మించారు.అరుకులోయను,బొర్రా గృహలను సందర్శించడానికి ఈ మార్గము బాగుంటొంది. అందుకే మమత గారిని గృహుడు స్థానంలో నిలిపాను. ఆవిడ పుణ్యం.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో (ప్రాస)యతి తప్పింది.
    "గనుగొన యెడబాటు కష్టమె కద!" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  9. మాష్టారూ, దిత్వాక్షరము రాకూడదనే నియమం మరచాను. మేఘదూతంలోని యక్షుని పరస్థితి తలుచుకొంటూ. సవరణకి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి