8, డిసెంబర్ 2010, బుధవారం

ప్రహేళిక - 31

ఈ ఘట్టం ఏది?
సీ.
త్రిపురాంతకుండైన దేవుని పేరేది?
పంజరమ్మున నుండు పక్షి యేది?
యమలోకమున బాధ లందువా రెవ్వరు?
దేవభాషను పూల తీగె యేది?
చూడ జటాయువు సోదరుం డెవ్వఁడు?
మెడలోని నగ కేది మేలు పేరు?
గాయమై కాయమ్ము కార్చు ద్రవ మ్మేది?
చంద్రబింబమ్ముఁ బోల్చఁ దగు నేది?
తే.గీ.
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
ధర్మజు నధిక్షేపించి తప్పుఁ జేసి
నట్టి ఖలుని కృష్ణుఁడు చంపు ఘట్ట మగును.
ఆ ఘట్ట మేదో చెప్పండి.

4 కామెంట్‌లు:

  1. శివుడు,శుకము, పాపులు,లతిక,సంపాతి, హారము,రక్తము,ముఖము
    శిశుపాల సంహారము

    రిప్లయితొలగించండి
  2. నేనూ అవే సమాధానాలు వ్రాస్తే కాపీ కొట్టినట్లవుతుంది ,
    కాని అంతకంటే వేరుగా వ్రాయలేను మరి .
    ఎంచేయాలో గురువుగారే చెప్పాలి.

    రిప్లయితొలగించండి