14, జనవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 197 (బ్రహ్మచారికి నెనమండ్రు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!

26 కామెంట్‌లు:

  1. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, జనవరి 14, 2011 10:03:00 AM

    గురువు గారికీ, శంకరాభరణం సాహితీ మిత్రులందరికీ 'భోగి పండుగ శుభాకాంక్షలు'
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  2. శ్రీ శంకరయ్య గారికి, మిత్రు లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .

    పాడి పంట లిమ్ము! ఫల పుష్పములనిమ్ము!
    గిరులనిమ్ము !పాఱు ఝరుల నిమ్ము!
    సంబరాలు తెమ్ము !సంక్రాంతి మహలక్ష్మి !
    స్వాగ తింతు నిన్ను సాదరముగ !!!

    కాఫి, సిగరెట్టు, విడియమ్ము,కార్డు లాట,
    రేసు గుర్రాలు ,బ్రాకెట్టు రేయిపగలు
    మోహ తాపమ్ము,పానమ్ము మోదమౌట
    బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర!!

    రిప్లయితొలగించండి
  3. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
    ధన్యవాదాలు. మీకు కూడ నా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  4. మంద పీతాంబర్ గారూ,
    ముందుగా మీ సంక్రాంతి స్వాగత పద్యానికి ధన్యవాదాలు.
    అష్ట వ్యసనాలను బ్రహ్మచారికి భార్యలుగా చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. బట్ట తల వచ్చె వరునకు వయసు మీరె
    పిలిచి పిల్లనివ్వరు నేడు కలిమి లేక
    బ్రహ్మచారికి, ఎనమండ్రు భార్య లౌర
    ఎట్టు సాధ్యమౌ? శ్రీ కృష్ణ! గుట్టుఁజెప్పు!

    రిప్లయితొలగించండి
  6. బ్రహ్మ విద్యలను పఠించి, పరమ పదము
    బ్రహ్మమని తలచిన వాడు బ్రహ్మచారి.
    అరయ యదువంశ భూషణుడట్టివాడు
    బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!

    రిప్లయితొలగించండి
  7. జిగురు సత్యనారాయణ గారూ,
    అద్భుతంగా ఉన్నాయి మీ పూరణలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు.
    మరియు సంక్రాంతి శుభా కాంక్షలు.
    మిత్రులందరి పూరణలూ
    ముచ్చట గొలుపు చున్నవి.

    రిప్లయితొలగించండి
  9. వటుడు మోపిన పాదము భక్తిఁ గడిగి
    దిశల ప్రభువులు పూజల దిక్కు లిడిరి
    పవన మానము పర్వగ వామనుండు
    బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర !

    రిప్లయితొలగించండి
  10. 01)
    __________________________________

    భాను రావను , పేరున్న - బ్రహ్మచారి !
    వాసి గాంచిన , శ్రీకృష్ణ - పాత్ర ధారి !
    అష్ట భార్యల , పెండ్లాడె - నిష్ట పడుచు !
    బ్రహ్మచారికి నెనమండ్రు - భార్య లౌర!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  11. 02)
    ____________________________________

    అవతారిక :

    దనుజ సంతతి , తగ్గింప - ధరణి యందు
    కమల సంభవు, కైవార - కారణమున
    బ్రహ్మ నాభుడు ప్రభవించె ! - భాగ్య మొదువ
    అదితి , కశ్యప మౌనీంద్రు - కాత్మజుడయి !

    పూరణ :

    చషక , బుడ్డి, కుశా , జిన - సంయుతుండు
    జన్నిదము, ముంజి , కౌపీన - ఛత్ర ధారి
    బాలకుడు , బలి మఖవాటి - వామనుండు !
    బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
    ____________________________________

    రిప్లయితొలగించండి
  12. ప్రభవ విభవలు యరువది పిల్ల లనగ
    బ్రహ్మ చారను పేరది భావ్య మౌనె ?
    దివ్య లోకాల దిరిగెడు దేవ మునికి
    బ్రహ్మ చారికి నెనమడ్రు భర్య లౌర !

    రిప్లయితొలగించండి
  13. (01) ఇలాగైతే బావుంటుందేమో!!!
    __________________________________

    భాను రావను , పేరున్న - బ్రహ్మచారి !
    వాసి గాంచిన , శ్రీకృష్ణ - పాత్ర ధారి !
    చేకొనె!నటన ,నెనిమిది - చేడియలను!
    బ్రహ్మచారికి నెనమండ్రు - భార్య లౌర!
    ___________________________________

    రిప్లయితొలగించండి
  14. విశ్వసంసారి, విశ్వాత్మ, విశ్వ విభుడు,
    అతని జనకు, డనంతు, డస్ఖలితుడయిన
    బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!
    మాయ కావలి వేల్పుని మాయ గాక?

    రిప్లయితొలగించండి
  15. సమస్యను
    సుంత
    సవరించిన
    03)
    _______________________________________
    ధరలు పయనించు పైపైకి - తార పథము !
    తినుట కేమియు నోచరు - దీన జనులు !
    వలదు వలదిట్టి సమయాన - భార్య యొంటి !
    బ్రహ్మచారికి నెనమండ్రు - భార్య లేల ???
    _______________________________________

    రిప్లయితొలగించండి
  16. కలహములు వెట్టి సతులకు కాంతునకును
    వేడ్క జూడంగ తలబోసె వేల్పు మౌని!
    బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర
    మాధవుని లీల లెరిగింప మాయ తొలగె.

    రిప్లయితొలగించండి
  17. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    పద్యం నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.

    వసంత్ కిశోర్ గారూ,
    భాను రావు, వామనుల పూరణలు బాగున్నాయి.
    సమస్యను కొద్దిగా మార్చి చేసిన పూరణ కూడ బాగుంది. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    "చారి + అను = చారియను" అని యడాగమం వస్తుంది. అక్కడ సంధి లేదు.
    "బ్రహ్మచారి యనెడు పేరు భావ్య మగునె" అంటే సరి.

    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.
    "మాయ కావలి వేల్పుని మాయ"ను చూపించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. వీధు లందున నడిపించి విశ్వ విభుని
    అమ్మ జూపగ నెంచగ నా మహర్షి ;
    మొరలు బెట్టుచు వలదని మ్రొక్కు లిడిరి
    బ్రహ్మ చారికి, ఎనమండ్రు భార్య లౌర !

    రిప్లయితొలగించండి
  19. హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిసందేహంగా మీది అద్భుతమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ధన్యవాదములు.
    కిషోర్ జీ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి