24, డిసెంబర్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 155

చాటు శ్లోకం


వినాయకపతే శ్శత్రుః
తస్య నామ షడక్షరమ్ |
పూర్వార్ధం తవ రాజేంద్ర
ఉత్తరార్ధం తు వైరిణామ్ ||

భావం -
"ఓ రాజేంద్రా! వినాయకపతికి శత్రువైనవాని ఆరక్షరాల పేరులోని మొదటిసగం నీకు, రెండవసగం నీ శత్రువులకు కలుగుగాక!" అని కవి ఒక రాజును దీవించాడు.


వివరణ - 
వి = పక్షులకు
నాయక = రాజైన గరుత్మంతునికి
పతేః = ప్రభువైన విష్ణువుకు (నృసింహరూపునకు)
శత్రుః = వైరి అయినవా డెవడో
తస్య = అతని
షడక్షరం = ఆరు అక్షరాలు కలిగిన
నామ = పేరు (హిరణ్యకశిప) లోని
పూర్వ + అర్ధం = మొదటిసగం (హిరణ్యం = బంగారం)
తవ = నీకు,
ఉత్తర + అర్ధం = తరువాతి సగం (కశిపువు = తల్పం)
వైరిణాం = శత్రువులకు (కలుగుగాక!)


___ శత్రువులకు తల్పం అంటే దీర్ఘనిద్ర (మరణం) కలుగాలని భావం.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

1 కామెంట్‌:

  1. శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు.
    పూర్వార్ధము విష్ణువునకు ఉత్తరార్ధము హిరణ్య కశిపునకు
    అన్వయము చాల బాగుంది .

    రిప్లయితొలగించండి