26, డిసెంబర్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 159

ఏక వ్యంజన శ్లోకం

దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః |
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః
||

దీనికి ప్రతిపదార్థాలకోసం ప్రయత్నించాను. కాని సాధ్యం కాలేదు.

భావం 
శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.
(గూగుల్ లో దొరికిన ఆంగ్లభావానికి నా అనువాదం)

2 కామెంట్‌లు:

  1. శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు.

    పై శ్లోకమునకు అర్ధము ;
    దాదదః =శ్రీ కృష్ణుడు ,దుద్దరుత=వరముల నన్నిటిని,దాదీ=ఇచ్చువాడు,
    దాదదః=పాపములను దహించు వాడు,దదోః=దుష్టులను ,దూదదీ = శి క్షిం చు వా డు
    దుద్దాదం = మం చి వారిని ,దుద్దే = కాపాడుట యందు ,దదదే = దీక్ష గలవాడు
    దదోదదః = ధర్మాధర్మములను ,దాదా = మిక్కిలిగా ,ద ద = ధరించువాడు
    అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడు .
    ------
    తప్పు అయితే క్షంతవ్యుడను .

    రిప్లయితొలగించండి
  2. గురువులకు , నమస్కారములు
    చక్కని చమత్కార పద్యమునకు ఇద్దరు , మంచి అనువాదము నిచ్చారు .ఇద్దరికీ ధన్య వాదములు

    రిప్లయితొలగించండి