9, జనవరి 2012, సోమవారం

చమత్కార పద్యాలు - 171

                                   ప్రహేళిక

విజితాత్మభవద్వేషి
గురుకరహతో జనః |
హిమాపహామిత్రధరైః
వ్యాప్తం వ్యోమాభినందతి ||

అర్థాలు
వి = పక్షిచేత
జిత = ఓడింపబడినవాని
ఆత్మభవ = కుమారుని
ద్వేషి = ద్వేషించేవాని
గురు = తండ్రి యొక్క
కర = కరములతో
హతః = దెబ్బతిన్న/బాధపడిన
జనః = జనం
హిమ + అపహ = మంచును తొలగించేవాని
అమిత్ర = శత్రువైనదానిని
ధరైః = ధరించినవాని చేత
వ్యాప్తం = ఆవృతమైన
వ్యోమం = ఆకాశాన్ని
అభినందతి = అభినందించును. 


పై చిత్రం ఆధారంగా వివరించవలసిందిగా మిత్రులకు మనవి. 

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

9 కామెంట్‌లు:

  1. గరుత్మంతునిచే ఓడింపబడిన ఇంద్రుని కుమారుడు అర్జునిని ద్వేషించే కర్ణుని తండ్రి సూర్యుని కిరణములచే బాధ పడిన జనులు హిమమును తొలగించే సూర్యుని శత్రువయిన రాత్రిని ధరించిన చంద్రునిచే ఆవరింప బడిన ఆకాశమును అభినందింతురు.

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ప్రశంసనీయమైన ప్రయత్నం. అభినందనలు.
    ‘తొలగించే (సూర్యుని) శత్రువయిన (రాత్రిని) ధరించిన (చంద్రుని)చే’
    బ్రాకెట్లలో ఉన్నవాటిని గురించి పునరాలోచించండి.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారూ నమస్సులు రెండవ భాగమునకు మరో ప్రయత్నము.

    జనులు మంచును తొలగించే ఉష్ణమునకు( అగ్ని ) శత్రువైన జలమును ధరించిన మేఘములతో ఆవృతమైన ఆకాశాన్ని అభినందింతురు.

    రిప్లయితొలగించండి
  4. నరసింహ మూర్తి గారూ,
    ఇప్పుడు సరైనదారిలో పడ్డారు. మీ సమాధానం 100% కరెక్ట్ అయింది. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారూ ధన్యవాదములు. మేఘాల మధ్యలో చందమామని దాచి పెట్టారేమో నని భ్రమ చెందాను,నిద్ర మత్తులో !
    అజ్ఞాత గారూ ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  6. సోదరులు గన్నవరపు వారి వర్ణన అద్భుతం .అసలు గురువుగారి ప్రహేళికే బహు రమ్యం గా ఉం దను కుంటే ?.....?...?......ఒహో .....! గురువును మించిన శిష్యులు. ఇద్దరికీ అభినందన మందారాలు.

    రిప్లయితొలగించండి