శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్య సింహాసనమ్ ||

శుక్రవారం 20 జనవరి 2012

చమత్కార పద్యాలు - 178

4 వ్యాఖ్యలు
ప్రహేళిక

ఉచ్ఛిష్టం శివనిర్మాల్యం
వమనం శవకర్పటమ్ |
కాకవిష్ఠాసముత్పన్నః
పంచైతేऽతిపవిత్రకాః ||

భావం
ఎంగిలి, శివుని నిర్మాల్యం, వాంతి, పీనుగుమీది బట్ట, కాకిరెట్టలో పుట్టినట్టిది - 
ఈ ఐదూ అత్యంత ప్రవిత్రమైనవి. 
 
ఇందలి విశేషార్థాన్ని చెప్పగలరా?

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

4 వ్యాఖ్యలు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కాకి రెట్టలో మఱ్ఱి విత్తనం లేదా రావి చెట్టు ఉంటుండని అంటారు . అనగా మఱ్ఱి చెట్టు. లేక [ రావి చెట్టు } పవిత్ర మనది కదా !

మిస్సన్న చెప్పారు...

కొంతవరకూ ప్రయత్నిస్తాను.

జలం, మారేడు దళం, తేనె, పట్టు దారం, రావి చెట్టు

(చేపల ఎంగిలి, శివ నిర్మాల్యం, తేనెటీగల వమనం, పట్టు పురుగుల గూళ్ళు, రావి చెట్టు)

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

మిస్సన్న గారూ !ఏం చెప్పారండి ....కొంత వరకు ఏమిటి ..అంతా అంతే ననుకుంటాను... ఇంకేముంటుంది.మాస్టారు గారూ !అంతేనంటారా?

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీరు ఊహించింది సరియైనదే. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
‘తేనె, రావిచెట్టు’ ఈ రెండూ కరెక్ట్! అభినందనలు.
*
సమాధానం .....
ఉచ్ఛిష్టమ్ = లేగ ఎంగిలి కలిగిన పాలు,
శివనిర్మాల్యమ్ = శివుని జడలనుండి ప్రవహించిన గంగ,
వమనమ్ = తేనెటీగల వాంతి రూపమైన తేనె,
శవకర్పటమ్ = ఒకరకమైన పురుగులనుండి సిద్ధమైన పట్టుబట్ట,
కాక విష్ఠాసముత్పన్నమ్ = కాకి రెట్టవలన పుట్టిన రావిచెట్టు
అత్యంతం పవిత్రమైనవి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి