శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్య సింహాసనమ్ ||

బుధవారం 25 జనవరి 2012

చమత్కార పద్యాలు - 182

3 వ్యాఖ్యలు
ప్రహేళిక

సువర్ణాలంకృతా నారీ
హేమాలంకృతి వర్జితా |
సా నారీ విధవా జాతా
గృహే రోదితి తత్పతిః ||

సువర్ణాలంకృతురాలైన ఒక స్త్రీ బంగారు నగలు లేనిది. 
ఆమె విధవ. కాని ఆమె భర్త ఇంట్లో ఏడుస్తున్నాడు. 

దీని భావం వివరించగలరా?
(‘సువర్ణాలంకృత, విధవాజాతా’ శబ్దాల అర్థవైవిధ్యాన్ని పరిగణించండి)

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)
 


3 వ్యాఖ్యలు:

కంది శంకరయ్య చెప్పారు...

ప్రహేళిక సమాధానం .....

హేమాలంకృత వర్జితా = బంగారు ఆభరణాలు లేకున్నా
సువర్ణాలంకృతా = మంచి రంగుతో తళతళ ప్రకాశించే శరీరం గలది.
సా నారీ = ఆ స్త్రీ
విధవా జాతా = అనేక విటులు గలది. (అందువల్ల)
తత్పతిః = ఆమె భర్త
గృహే రోదితి = ఇంట్లో ఏడుస్తున్నాడు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

. నేను " బంగారు రంగు గలిగిన శరీరము కలది " అని కొంచం రాద్దామనుకుని మానేసాను. చాలా బాగుంది. మంచి ప్రహేళిక

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

రాజేశ్వరి గారు చెప్పినట్లు నాకూ అంతవరకే అర్థ మైనదండీ ... వి ధవా (అనేక విటులు గలది) మాటలోనే పూర్తి అర్థం దాగుంది.ధన్యవాదములు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి