శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్య సింహాసనమ్ ||

సోమవారం 23 జనవరి 2012

ప్రహేళిక - 51

5 వ్యాఖ్యలు
నామగోపన పద్యం

తే.గీ.
"కంజదళనేత్ర! మాధవ! కంసభేది!
శంఖచక్రగదాధర! సాధులోక
రక్షకా! చేతు నీదు ప్రార్థనము లయ్య!"
యనిన గుప్తనామం బేదొ యరయుఁ డిపుడు.


పై పద్యంలో దాగిన పేరేదో చెప్పండి.

5 వ్యాఖ్యలు:

కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...

ప్రతి పాదంలోని మొదటి చివరి అక్షరాలను కలిపి చదివితే ఆ గుప్త నామమేమిటో తెలిసి పోతుంది "కందిశంకరయ్య"గారూ!

కంది శంకరయ్య చెప్పారు...

కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
అభినందనలు.
ఇంక మిగిలినవారికి చెప్పడానికి ఏం మిగిలింది?

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

కవివర చెప్పెద వినుమా
వివరముగా గుప్త నామ విధమును చూడన్
కవి కంది శంకరార్యులు
శివ నాగాభరణ బ్లాగు సృష్టికి కర్తౌ.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఏముంది ? గురువు గారి పేరే !

గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు...

గురువుగారూ మాధవునిలో శంకరుని చమత్కారముగా దాచారు. దాగుడుమూత లాడినా శ్రీ కోడేహళ్ళి మురళీమోహన్ గారికి దొరికి పోయారె !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి