23, జనవరి 2012, సోమవారం

సమస్యాపూరణం - 600 (కోటికి పడగెత్తికూడ)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

39 కామెంట్‌లు:

  1. కోటీశ్వరుడౌ కోటయ
    ఏటికి పోటొచ్చి పొంగ నెక్కెను మేడన్
    అటు వచ్చు వారు లేకను
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

    రిప్లయితొలగించండి
  2. కోటీశ్వ రుడను నేనని
    తాటించ గజగతి నంత దాచిన ధనమున్ !
    వాటము గవరద మునిగిన
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్ !

    రిప్లయితొలగించండి
  3. ఏటికిరా వ్యామోహము ?
    కాటికి వెళ్లక కుదురున? కర్మ వశమునన్
    మేటి హరిశ్చంద్ర నృపుడు
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________

    పోటీ పడి లూటీలే
    గాటముగా జేసినట్టి - గాలి జనార్ధన్
    వాటముగా చెఱనే బడి
    కోటికి పడగెత్తికూడ - కూటికి వగచెన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిసోమవారం, జనవరి 23, 2012 8:55:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    కాటకమేర్పడినప్పుడు
    మూటల సఒపదలు మూల మూల్గిన నేమౌ
    చాటడు బియ్యము దొరకక
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  6. హరిశ్చంద్రుడు :

    02)
    ____________________________

    కోటీరము మునికిచ్చెను
    మాటను తా నిలుపు కొనగ - మాన ధనుండే !
    కాటికి కాపరి యౌటను
    కోటికి పడగెత్తికూడ - కూటికి వగచెన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  7. పోటెత్తినట్టి రీతిన
    ధాటిగ వచ్చెను సునామి, ధైర్యము సడలెన్,
    వేటున పోయెను సంపద
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.

    రిప్లయితొలగించండి
  8. పిసినారి ముసలి :

    03)
    ____________________________

    కోటిని తా మార్చెనుగా
    హాటకముగ , ముద్ద నంత - హలనే దాచెన్ !
    పాటచ్చరుడే దొంగిల
    కోటికి పడగెత్తికూడ - కూటికి వగచెన్ !
    ____________________________
    హల = భూమి
    పాటచ్చరుడు = దొంగ

    రిప్లయితొలగించండి
  9. గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి, కవులందరికి ధన్యవాదములు,
    యతిస్థానము తెలియక ప్రాసనియమము తప్పినది క్షమించగలరు.
    ------
    కోటీశ్వరుడగు కృష్ణుడు
    కాటుక కనులవెలయాలి కవ్వింపులకున్
    దీటుగ నోటుల విసరగ
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్ |

    రిప్లయితొలగించండి
  10. గురువు గారికి, శ్రీ పండిత నేమాని గారికి, కవులందరికి ధన్యవాదములు,
    యతిస్థానము తెలియక ప్రాసనియమము తప్పినది క్షమించగలరు.
    ------
    కోటీశ్వరుడగు కృష్ణుడు
    కాటుక కనులవెలయాలి కవ్వింపులకున్
    దీటుగ నోటుల విసరగ
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్ |

    రిప్లయితొలగించండి
  11. గూటికి కూడుకి నోచిన
    వాటముగా పొలము దున్ను వాడే నయమౌ
    ఓటమి పాలై రాజా
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్ !

    రిప్లయితొలగించండి
  12. వాటముగఁ బెరిగె రక్తపు
    పోటు, నిషేధమ్ము భక్ష్యములు, మధుమేహం
    బాటంకము గల్గించఁగ
    కోటిగి పడగెత్తికూడ కూటకి వగచెన్.

    రిప్లయితొలగించండి
  13. పరీక్షిత మహారాజు కి కావలసిన మంచి నీళ్ళు కూడా దొరక లేదు.

    హాటక మొక బూటకమే
    నోటికి దిగ బోదు దాని నొసటను గొట్టా !
    వేటకు జని నరపాలుడు
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్ !

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి అన్నారు...

    కోటీశ్వరుడౌ కోటయ
    ఏటికి పోటొచ్చి పొంగ నెక్కెను మేడన్
    లేటయిన లంచి రాదే
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

    హనుమఛ్ఛాస్త్రి గారికి అన్య దేశ్యములపై మరీ ఛాదస్తము లేదు గాబట్టి యిలా సవరించాను. ఆయన పాపము పనికి వెళ్ళి ఉంటారీ పాటికి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మసోమవారం, జనవరి 23, 2012 10:44:00 AM

    కవిమిత్రులకు నమస్కారం

    నేటి సమస్య నిజంగానే నాకు సమస్య అయి కూర్చుంది.

    ఆస్తిపోగొట్టుకున్నవాడు కోటీశ్వరునిగా పరిగణించబడతాడా??
    ధనం చేతనుండి లేదా చెంతనుండి కూడా తిండికి ఇబ్బంది పడ్డాడనికదా సమస్య భావం. మరి ధనం పోగొట్టుకున్న లేదా ధనం చెంతలేని వానిని పూరణకోసం కోటీశ్వరునిగా చెప్పవచ్చునా??. పెద్దలు కాస్త చర్చించండి.

    పోటెక్కె నెత్తురని మితి
    దాటెను మధుమేహమంచు ధరణీశుకు ము
    ప్పూటలు పత్యము పెట్టగ
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  16. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మసోమవారం, జనవరి 23, 2012 10:51:00 AM

    శంకరార్యులకు కలిగిన ఆలోచనే నాకుకూడా కలగడం గమ్మత్తుగా ఉంది.

    రిప్లయితొలగించండి
  17. నోటం బట్టెను కప్పను
    వాటముగా మ్రింగె దాని పట్టగ జారెన్
    సూటిగ మరొకటి పామిం-
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్.

    (పెద్దలు ' ఇంకోటికి' ఒప్పుకోరేమో అని సందేహం)

    రిప్లయితొలగించండి
  18. పోటెత్తిన నదిని మునిగి
    పాటులు పడి యొడ్డు చేరె ప్రాణమ్ములతో
    చేటయిన వేళ ధనికుడు
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.

    రిప్లయితొలగించండి
  19. నా పూరణ చూడండి.కోటీశ్వరుడైనా ఒకో సారి దురదృష్టం వలన ఏదో ప్రమాదంలో చిక్కుకొని తాత్కాలికంగా డబ్బు దగ్గర లేక నానా అవస్థలూ పడవచ్చును .ఐనా అతడు కోటీశ్వరుడే కదా .

    రిప్లయితొలగించండి
  20. నాటకమాడుచు నొక్కడు
    పూటకు గతిలేనివాని పుత్రుని వోలెన్
    మూటలు మోయుచు నయ్యెడ
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.

    సినిమాలు, నాటకాల్లో కోట్లు సంపాదించి కూడా బీదవాని పాత్ర ధరించి, నాటకంలో భాగంగా కూటికి వగచుట.

    రిప్లయితొలగించండి
  21. పాటించి తినడు,పెట్టడు
    బోటికి బిడ్డలకు,బెట్టబోడితరుల కిం
    కేటికి లోభికి సంపద
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచున్

    రిప్లయితొలగించండి
  22. తోటలు, పొలముల నెన్నో
    కోటలు గట్టెద ననుచును గొప్పగ దానీ
    మాటలు చెప్పుచు నూహల
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్.

    రిప్లయితొలగించండి
  23. ఈనాటి సమస్య ఒక మోస్తరుగా నున్నది. వచ్చిన పూరణలు బాగుగానే యున్నవి. అందరకి అభినందనలు. సర్వే జనాస్సుఖినో భవంతు.

    కోటీశ్వరులై మనవలె
    కూటికి లోపమ్ము లేక గూళ్ళందున ము
    మ్మాటికి తృప్తిని గనుచును
    సూటిగ జనులెల్ల శాంతి సుఖములు గనుచున్

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. నా పద్యము చివరలో "శాంతి సుఖముల తోడన్" అంటే సరిపోతుంది. పునరుక్తి దోషము పోతుంది.

    రిప్లయితొలగించండి
  25. కాటేయని వెలుచ గైకొని
    వాటేసితి ముని గళమున ప్రారబ్ధమునన్ !
    కాటేసె విధి బలీయము
    కోటికి పడగెత్తి కూడా కూటికి వగచేన్ !
    ----------------------------------------------
    కాటుక కన్నుల చిన్నది
    వేటాడెను వరుని కొఱకు వేడుక మీరన్ !
    మాటల మోసము దెలియక
    కోటికి పడగెత్తి కూడా కూటికి వగచెన్ !

    రిప్లయితొలగించండి
  26. లోటెరుగని లోగిలిలో
    పూటకు పూటకును రుచులు పోటెత్తుచు బో
    నేటికి మధుమేహముతో
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  27. దీటైన ప్రతిభ గల్గిన
    మేటి కళాకారు డయ్యు మెచ్చక జనముల్
    మాటున బడి మహిత కళా
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  28. మాటయు మంతీ రాగా
    ధాటిగ పాఠమును జెప్ప దారయు పూనెన్
    నేటికి రోటీ లనగా
    కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్ !

    ఇక్కడ పాఠమంటే గుణపాఠ మని గ్రహింప వలెను.

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యుల స్ఫూర్తితో

    మధుమేహబాధితుడు :

    04)
    ____________________________

    పోటును ,మేహము పెరిగెను
    వంటలలో ఘాటు, తీపి - వలదన వైద్యుల్
    లోటే యెరుగని , నేటికి
    కోటికి పడగెత్తి కూడ - కూటికి వగచెన్ !
    ____________________________
    మేహము = మధుమేహము

    రిప్లయితొలగించండి
  30. మూర్తిగారి స్ఫూర్తితో :
    పరీక్షిత్తు :

    05)
    ____________________________

    కోటను విడి యటవికి జని
    వేటాడుచు బాట తప్పి - వేసట యగుటన్ !
    మాటాడని ముని వాకిట
    కోటికి పడగెత్తి కూడ - కూటికి వగచెన్ !
    ____________________________

    రిప్లయితొలగించండి
  31. డి.నిరంజన్ కుమార్మంగళవారం, జనవరి 24, 2012 8:34:00 AM

    చీటికి మాటికి మాటిం
    కేటికి నా మాటవినుము కిచిడీ బెట్టన్
    నోటుకు చిల్లర తెమ్మన
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  32. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పోటు + వచ్చి’ కదా! ‘పోటొచ్చి’ అనడం వ్యావహారికమే. ‘పోటొప్పి/ పోటొనర’ అందామా?
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని పూరణలు చెప్పారు. బాగున్నాయి. అభినందనలు.
    ‘కాటేయని ...’ పూరణలో వెలుచ శబ్దప్రయోగం ప్రశంసనీయం. కాని ఆ పాదంలో గణదోషం. ‘కాటేయని వెలుచం గొ్ని’ అంటే సరి!
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    కాకుంటే ‘ఏటికి’ పదప్రయోగమే సందేహాస్పదం.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఐదు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘సంపదలు’ అనేది ‘సఒదలు’ అని టైపాటు. ‘చాటెడు’ - చాటడు అయింది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    సరసమైన పూరణ. అభినందనలు.
    కోటీశ్వరునికి కృష్ణుడనే పేరెందుకు? ‘కోటీశ్వరుడగు మనుజుడు’ అంటే సరిపోయేది కదా!
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలు, గోలి వారి పద్యానికి సవరణ (పేరడీ అంటే బాగుంటుందేమో?) చాలా బాగున్నాయి.. అభినందనలు.
    *
    ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    మీ సందేహం సహేతుకమే!
    *
    మిస్సన్న గారూ,
    చమత్కారాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నిజానికి ‘ఇంకోటికి’ నాకు అభ్యంతరకరమే!
    *
    ‘కమనీయం’ గారూ,
    చక్కని పూరణలు చెప్పారు. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    లోకకళ్యాణం కోరిన మీ పద్యానికి ధన్యవాదాలు.
    *
    ‘శ్యామలీయం’ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    కాని పూరణయే సందిగ్ధంగ ఉంది.

    రిప్లయితొలగించండి
  33. కోటికి పరుగెత్త దలచి
    పూటకు గతిలేనివారి భూముల కెల్లన్
    చేటునుతలపెట్టినొకడు
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్!!!

    రిప్లయితొలగించండి
  34. నోటులు పాతవి మూటలు
    కోటీశ్వర రావు దాచి గూడున నుంచన్
    గూటము కొట్టగ మోడీ
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి
  35. నోటుల మెండుగ నిడుచున్
    తోటలు భవనములు కొనుచు తొంబలు తొంబల్
    నోటికి కాన్సరు రాగా
    కోటికి పడగెత్తికూడ కూటికి వగచెన్

    రిప్లయితొలగించండి