2, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 635 (పార్థసారథి రణమున)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పార్థసారథి రణమున పరుగు లిడెను.

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. "పది దినమ్ముల సమరమ్ము వ్యర్థమె కద!
    నిలువు మర్జున! భీష్ముని నేడు నేను
    ప్రాణములఁ దీసెద" ననుచు రథము డిగ్గి
    పార్థసారథి రణమున పరుగు లిడెను.

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ, మొదటి పూరణ మీదే అవటం ఈనాటి ప్రత్యేకము. చక్కటి పూరణ, పెద్ద ఐడియా లాగేశారు:-)

    రిప్లయితొలగించండి
  3. శ్రీ వసంత కిశోర్ గారికి ప్రత్యేకముగా ప్రశంసలు, అభినందనలు. మంచి మంచి విషయములను వెలుగులోనికి తెచ్చేరు. అవి బ్లాగు మిత్రులందరికి తప్పక ఆహ్లాదమును జ్ఞాన వికాసమును కలిగించును.

    నందన నామ సంవత్సరానికి స్వాగతమును ముందుగనే ఒక కవికోకిల పలుకుట ప్రశంసనీయము(శ్రి మిస్సన్న గారు). మరి మా స్పందనను చూడండి:

    సుగంధి:
    నందనాఖ్య వత్సరమ్ము నవ్య శోభలీనుచున్
    విందుచేయ వచ్చుచుండె విశ్వమోహనాంగియై
    చందనాదులైన రమ్య సాహితీమయక్రియల్
    వందనాలతో బొనర్చి స్వాగతమ్ము పల్కుడీ

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా ! కురుక్షేత్రములో పార్థ సారథిని చక్కగా పరుగులు పెట్టించారు.బాగున్నది. మీ ఆరోగ్యము కుదుట బడినదా..

    ధర్మ మోరిమి శౌర్యమ్ము దరిని నిల్చి
    రయము హయముల బూనిచి రథము నెక్క
    పార్థసారథి, రణమున పరుగు లిడెను
    మోస మన్యాయము నధర్మ ములును నిజము.

    రిప్లయితొలగించండి
  5. గోగ్రహణమును చేసిన కురువరులగు
    భీష్మ గురు కర్ణ ముఖ్యులౌ వీరుల గని
    ఉత్తరకుమారు డతిభీతచిత్తు డగుచు
    పార్థసారథి రణమున పరుగులిడెను

    రిప్లయితొలగించండి
  6. కర్ణుని రథ చక్రం అధో గతి ఆయెను
    పార్థుని తో చేరి సారధి వేగిర పడెను
    కర్ణుని పిడికెడు గుండె యాచింప
    పార్థ, సారథి రణమున పరుగు లిడెను


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  7. శంఖనాదమ్ము నెల్లర జజ్జరిల్లె
    భీకరమ్ముగ యుద్ధము పెచ్చరిల్లె
    రథము, హయముల బిగియించి రయము జూపి
    పార్థసారధి రణమున పరుగులిడెను.

    రిప్లయితొలగించండి
  8. అన్నదమ్ములు బంధువులాప్తమిత్రు
    లనిన పార్థుకు గీతబోధనము జేయ
    పార్థ సారథి, రణమున పరుగులిడెను
    శత్రుసంహారకార్యార్థ సాధనమున.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    గీతాబోధన తదుపరి :

    01)
    _____________________________________________

    పార్థునకు గీత బోధించి - పథము జూపి
    పార్థు నిర్భీతు గావించి - ప్రస్తుతించి
    ప్రళయ భీకర రణరంగ - భరణి జేర
    పార్థసారథి రణమున - పరుగు లిడెను !
    _____________________________________________
    ప్రస్తుతించి = అభినందించి
    భరణి = భూమి(స్థలము)

    రిప్లయితొలగించండి
  10. కదన రంగాన దానయై కాను పించ
    పార్ధ సారధి ,రణమున పరుగు లిడెను
    శత్రు సేనలు నందరు చకితు లగుచు
    దైవ లీలలు దెలియగ దరమె మనకు ?

    రిప్లయితొలగించండి
  11. కర్ణు డీల్గెడి నీరోజు కల్ల గాదు
    తేరు చక్రము భూమిలో దిగబడియెను
    వాడి శరమున గూల్చుము వానిఁ గనుము
    పార్ధ! సారధి రణమున పరుగు లిడెను.

    రిప్లయితొలగించండి
  12. డి. నిరంజన్ కుమార్శుక్రవారం, మార్చి 02, 2012 8:51:00 PM

    పట్టనాయుధమన్నట్టి ప్రతిన మరిచి
    భీకరమ్ముగ గర్జించి భీష్మునచట
    అంతమొందింప చక్రమ్ము చేత బట్టి
    పార్థసారథి రణమున పరుగులిడెను

    రిప్లయితొలగించండి
  13. శ్రీ వామన కుమార్ గారూ!
    శుభాశీస్సులు. మీరు పద్యములను మళ్ళీ వ్రాయుటకు పూనుకొనుచున్నారు. సంతోషము. విజయోస్తు. ఛందస్సు గురించి సులక్షణసారము అనే పుస్తకము దొరికితే కొనండి. సులభముగా అర్థమగుతుంది. మరియొక సలహా: నిత్యము ప్రాచీన కవుల పద్యములను చదువుటను అలవరచు కొనండి. ముఖ్యముగా భారతము మరియు భాగవతము చల్ల ఎక్కువగా ఉపకరించును. కందము, తేటగీతి, ఆటవెలది వంటి పద్యములను ఎక్కువగా చదువుచుంటే వాటి లోని గమనము (లయ) మీకు తెలిసిపోతుంది. దాంతో పద్యము రచించుట సులభము అగుతుంది. స్వస్తి

    రిప్లయితొలగించండి