శనివారం 21 ఎప్రిల్ 2012

శ్లోకానువాదము


తరుణులకాదరణ

యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
|
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాః తత్రాఫలాః క్రియాః
||

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
అనువాదము


వనితల కెందు నెందు సమభావన తోడ లభించుచుండునో
ఘనమగు గౌరవమ్మచట క్రాలు నిరంతర శాంతిసౌఖ్యముల్
మన మలరంగ నచ్చట నమర్త్యులు నొప్పుదు, రెందు మానినుల్
కనరొ సుఖమ్ము లట్టియెడ కార్యములెల్లను నిష్ఫలమ్ములౌ.

3 వ్యాఖ్యలు:

వసంత కిశోర్ చెప్పారు...

స్వేచ్ఛానువాదం :

_________________________________


స్త్రీలు పూజింపబడుచోటె - సిరులు వెలయు !
స్త్రీలు పూజింపబడు చోటె - శ్రేయముండు !
స్తీలు పూజింపబడు చోటె - స్వేచ్ఛ మెండు !
స్ర్తీల దూషించు చోటెల్ల - శిక్ష లుండు !
చేయ తలపెట్టు కార్యముల్ - చేదె యగును !

_________________________________
శిక్ష = శాస్తి

హ.వేం.స.నా.మూర్తి చెప్పారు...

బారులు దీరెద రమరులు
నారిని పూజించుచోట, నానా సుఖముల్
నారిని అవమానించిన
దూరముగా తొలగిపోవు, దు:ఖము గలుగున్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
. నిజమే స్త్రీలను గౌర వించి , అభిమానించి , ఆదరించి ,పెద్ద పీటవేసిన మన సంస్కృతి శ్లాఘ నీయం .ఆ విలువను కాపాడు కోగలగడం ముదావహం. చాలా మంచి శ్లోకాన్ని అందించిన గురువులకు పాదాభి వందనములు .