7, మే 2012, సోమవారం

గర్భ కవిత్వములో మెలకువలు - 2

మిత్రులారా!

మొదటి భాగములో ఈ క్రింది ఉదాహరణను చెప్పుకొన్నాము కదా!
"సరస సద్గుణ సాగర శంకరా(ర్య)"
దానికి కొన్ని అక్షరములు చేర్చితే ఈ చంపకమాల అవుతుంది చూడండి: 
"జనగణ సన్నుతా సరస సద్గుణ సాగర శంకరార్య కో
రను వరముల్........"

ఇందులో మరికొన్ని పద్యముల పాదములు చూడండి:
మధ్యాక్కర:  జనగణ సన్నుతా సరస సద్గుణ సాగర శంక
కంద: గణ సన్నుతా సరస సద్
        గుణ సాగర శంకరార్య కోరను వరముల్ ....   

ఇప్పుడు చూచేరు కదూ -- ఒక చంపకమాలలో ఎన్ని పద్యములు ఇమిడి ఉన్నాయో: 
(1) మధ్యాక్కర;  (2) తేటగీతి;  (3) ద్రుతవిలంబితము;  (4) కందము.

మరికొన్ని ఉదాహరణలను 3వ భాగములో చూద్దాము.  స్వస్తి. 
 
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

1 కామెంట్‌:

  1. నమస్కారములు.
    వ్యాకరణము బాగానే తెలుస్తోంది. [ చిన్న నాటి విద్యార్ధి దశ గుర్తుకు తెస్తోంది ] . కాక పొతే వ్రాయ గలగడం నేర్పు కావాలి . గురువులు శ్రీ నేమాని వారికీ . శ్రీ శంకరయ్య గారికీ అనేక ధన్య వాదములు. + కృతజ్ఞతలు .

    రిప్లయితొలగించండి