31, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం - 779 (వీరక్కకు చిన్నచేయి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
వీరక్కకు చిన్నచేయి విస్తరి ఘనమౌ.
ఈ సమస్యను పంపిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదములు.

పద్య రచన - 67

రుద్రమదేవి
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 90

ON the day when death will knock at
thy door what will thou offer to him ?

Oh, I will set before my guest the
full vessel of my life I will never let
him go with empty hands.

All the sweet vintage of all my
autumn days and summer nights, all
the earnings and gleanings of my busy
life will I place before him at the close
of my days when death will knock at
my door.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

పగటి తుదివేళ మృత్యుదేవతయె తలుపు
తట్టినపు డేమి కానుక పెట్టె దీవు? ||

అహహ! నా యిలు సేరిన యతిథి కేను
మ్రోల నిల్పెద జీవనపూర్ణపాత్ర,
సాగనంపను రిక్తహస్తాల నెపుడు ||

సురుచిర శరద్వసంత వాసరము లెన్నొ,
*(అందముల్ చిందు తొలి మలు సందెలెన్నొ,)
నింపె మధుమాధురుల్ జీవనంపు గిన్నె,
*(వేనవేల్ సుఖదుఃఖాల వెలుగునీడ
లుండె పూలయి పండ్లయి గుండెనిండ,)
పనుల సందడిఁ దడఁబడు బ్రదుకుతోడఁ
గూడఁబెట్టిన యదియును గూర్చునదియు
తుట్టతుదినాడు తలుపులు తట్టినట్టి
మృత్యుసన్నిధి సర్వ మర్పించుకొందు ||

30, జులై 2012, సోమవారం

సమస్యాపూరణం - 778 (పాలు గాంచి పిల్లి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పాలు గాంచి పిల్లి పారిపోయె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 66


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 89

No more noisy, loud words from me
such is my master's will. Henceforth
I deal in whispers. The speech of my
heart will be carried on in murmurings
of a song.

Men hasten to the King's market.
All the buyers and sellers are there.
But I have my untimely leave in the
middle of the day, in the thick of work.

Let then the flowers come out in my
garden, though it is not their time ;
and let the midday bees strike up their
lazy hum.

Full many an hour have I spent in
the strife of the good and the evil, but
now it is the pleasure of my playmate
of the empty days to draw my heart on
to him ; and I know not why is this
sudden call to what useless incon-
sequence !

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఇదియె నాస్వామి సంకల్ప, మింక కంఠ
మెత్తి బిగ్గరగాఁ బల్క నెప్పుడేని,
మాటలాడెద గుసగుస నేటినుండి,
గీతమందస్వరాలాప రీతితోన
తేటపరచెద మదిలోని మాట లెల్ల ||

రాచయంగడి కెగబ్రాకెఁ బ్రజలగుంపు,
కొనెడువా రమ్మువారును గూడి రచట,
కాని పట్టపగల్ వేళగాని వేళ
వచ్చితిన్ పనిసందడి వదలి నేను,
(ఎఱుఁగఁడో యాతఁ డిప్పుడె యేల పిలిచె?)
పూలు నాయెలదోటలోఁ బూయునిమ్ము,
తుమ్మెదల్ మ్రోయనిమ్ము జుంజుమ్మటంచు,
కాని యవ్వాని కిది యెటుగానివేళ ||

ద్వంద్వములలోని సదసద్విభాగమందె
జీవితపు టెన్నిదినములో చెల్లిపోయె,
కాని మున్ వట్టినాళ్ళ నాతోన యాట
లాడుకొను జంటగాని కీనాడు నాదు
మనసుఁ దనవైపు లాగుకోఁ జనవు పుట్టె,
అనుపయోగఁపు వట్టి యే యాటకోస
మిట్లు చప్పునఁ బిల్చెనో? యే నెఱుంగ ||

29, జులై 2012, ఆదివారం

సమస్యాపూరణం - 777 (కుచముఁ గోసె మగఁడు)

 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కుచముఁ గోసె మగఁడు కూర కొఱకు.

పద్య రచన - 65


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 88

DEITY of the ruined temple ! The
broken strings of Vina sing no more
your praise. The bells in the evening
proclaim not your time of worship.
The air is still and silent about you.

In your desolate dwelling comes the
vagrant spring breeze. It brings the
tidings of flowers the flowers that for
your worship are offered no more.

Your worshipper of old wanders ever
longing for favour still refused. In the
eventide, when fires and shadows mingle
with the gloom of dust, he wearily
comes back to the ruined temple with
hunger in his heart.

Many a festival day comes to you
in silence, deity of the ruined temple.
Many a night of worship goes away
with lamp unlit.

Many new images are built by
masters of cunning art and carried to 
the holy stream of oblivion when their
time is come.

Only the deity of the ruined temple
remains unworshipped in deathless
neglect.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

భగ్నమందిరదేవతా! పాడ దిపుడు
తెగిన తీగల వీణ నీ పొగడికలను,
పూజకై సాంధ్యఘంటలు మ్రోగ విపుడు,
నీ కెలని గాలియే శాంతనీరవమ్ము ||

తిరుగుఁబోతు వసంతఁపుఁ జిరుతగాలి
వచ్చె నీ పాడుబడిన నివాసమునకు,
తెచ్చెఁ దానేవొ పూవుల ముచ్చటలను,
పువ్వు లయ్యవి యింక నీ పూజకోస
మప్పనము సేయఁబడుటకె యొప్పవంట ||

అక్కటకట! తిరస్కృతుఁ డయ్యు పాత్ర
యర్చకుం డెవ్వరి యనుగ్రహంపు భిక్ష
కొఱకొ పవలెల్ల తాను క్రుమ్మరుచునుండు ||
వెలుఁగు నీడలు గోధూళిఁ గలిసికొనెడి
సందెచీఁకటి నలసట జెంది యతఁడు
పుట్టె డాకలితో నొసల్ గొట్టుకొనుచుఁ
దిరిగి వచ్చు నీ భగ్నమందిరము జేర ||

భగ్నమందిర దేవతా! వచ్చుచుండె
మూగవడి యెన్నొ యుత్సవమ్ముల దినాలు,
తొలగె నిశలెన్నొ దీపమే వెలుఁగకుండ ||

వేనవేల్ క్రొత్తబొమ్మలు విజయదశమి
సంతరింతురు వరకళాచతురమతులు,
సమయ మైనప్పుడో పవిత్రముగ మరపు
వరదలో జారవిడతురు వానినెల్ల ||

పాడుగుడిలోని దేవతాప్రతిమ యొకటె
ముగిసిపోని యుపేక్షలో మునిగిపోవు ||

28, జులై 2012, శనివారం

సమస్యాపూరణం - 776 (పాండవులకు శ్రీకృష్ణుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పాండవులకు శ్రీకృష్ణుఁడు వైరి ును.

పద్య రచన - 64

 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 87

IN desperate hope I go and search for
her in all the corners of my room ; I
find her not.

My house is small and what once has
gone from it can never be regained.

But infinite is thy mansion, my lord,
and seeking her I have come to thy
door.

I stand under the golden canopy of
thine evening sky and I lift my eager
eyes to thy face.

I have come to the brink of eternity
from which nothing can vanish no
hope, no happiness, no vision of a face
seen through tears.

Oh, dip my emptied life into that
ocean, plunge it into the deepest full-
ness. Let me for once feel that lost
sweet touch in the allness of the uni-
verse.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఆస మాలిన మదితోన యరిగినాఁడ,
నింటిలో మూలమూల గాలించినాఁడ,
కాని యద్దాని నేనెందుఁ గాననైతి ||

ఇరుకు టిలు నాది, యేది పోయినను సరియె
తిరిగి యేనాటికైనను దొరుక దచట ||

కాని యో నాప్రభూ! తావకీనభవన
మది యపారము, వెదకుచు వెదకు చేను
చేరుకొంటిని జుమ్ము నీ ద్వారసీమ ||

స్వామి! భవదీయమైన సంధ్యామయంపుఁ
బసిడిపందిట నిల్చి పిపాసగొన్న
కన్ను లెత్తితి నీదు మొగమ్మువైపు ||

చేరితిన్ శాశ్వతత్వఁపు తీరమునకు,
నేది యేనియు నచట నశింప దెపుడు,
ఆశలని, సుఖ *దుఃఖము లనియు లేవు,
రిత్తలైన గొంతెమ్మ కోరికలతోడి
యశ్రుముఖములఁ జూచు దృశ్యములు లేవు ||

అహహ! నిత్యత్వ మనెడు నయ్యబ్ధిలోన
నీవ ముంచుము నాశూన్యజీవితమును,
ముంచుము గభీర పూర్ణతాంభోధిలోన,
నీ మహా సృష్టిలోపలి నిండుఁదనపుఁ
దీయనౌ తుది తాకిడి హాయి మఱల
నొక్కసారి నా యనుభూతి కెక్కనిమ్ము ||

వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ


ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు. (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్. (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ,
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్. (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్నఁ గాని, చదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత, యనవరతమ్మున్. (14) 


గుండు మధుసూదన్

వరలక్ష్మీ స్తోత్రము

వందేహం శ్రీహరిప్రియామ్


వందేహం శ్రీమహాలక్ష్మీం
వందే భక్త వరప్రదామ్ |
వందే వారిజ పత్రాక్షీం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే పూర్ణేందు బింబాస్యాం
వందే చంద్ర సహోదరీమ్ |
వందే మందస్మితాం పద్మాం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే సంపత్ప్రదాం దేవీం
వందే దారిద్ర్య నాశినీమ్ |
వందే హిరణ్మయీం శాంతాం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే సువర్ణ భూషాఢ్యాం
వందే దేవగణార్చితామ్ |
వందే సౌభాగ్య సంపన్నాం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

వందే సౌఖ్యప్రదాం లక్ష్మీం
వందే మంగళ దేవతామ్ |
వందే దయామయీం సాధ్వీం
వందేహం శ్రీహరిప్రియామ్ ||

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

27, జులై 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 86

DEATH, thy servant, is at my door.
He has crossed the unknown sea and
brought thy call to my home.

The night is dark and my heart is
fearful yet I will take up the lamp,
open my gates and bow to him my
welcome. It is thy messenger who
stands at my door.

I will worship him with folded hands,
and with tears. I will worship him
placing at his feet the treasure of my
heart.

He will go back with his errand done,
leaving a dark shadow on my morning ;
and in my desolate home only my
forlorn self will remain as my last
offering to thee.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

నీదు సందేశముం గొని నేడు రేడ!
పరిచితముగాని మేటి సాగరము దాటి
చేరఁ బారెను మిత్తి నా ద్వారమునకు ||

చిమ్మచీఁకటి యీరేయిఁ గ్రమ్ముకొనియె,
మెండుకొనియె భయమ్ము నాగుండె నిండ,
నైనఁ గానిమ్ము, దీపము బూని తలుపు
దెరచి స్వాగత మిచ్చెద శిరసువంచి
వచ్చె నీమృత్యుదూత నాద్వారమునకు ||

కేళ్లమోడుపుతోడఁ గన్నీళ్లతోడ
పూజ గావింతు, తత్పాదమూలమందు
ప్రాణభండారమున్ సమర్పణ మొనర్తు ||

నా యుషసుమీద చీఁకటిచాయ దించి
తనపని ముగించి నీదూత తరలిపోవు,
వట్టి మాయింట మిగిలియున్నట్టి నన్ను
నేన తుదికాన్కగాగ నీకిచ్చుకొందు ||

సమస్యాపూరణం - 775 (వరలక్ష్మీవ్రతముఁ జేయ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వరలక్ష్మీవ్రతముఁ జేయవలదంద్రు బుధుల్.

పద్య రచన - 63

వరలక్ష్మీవ్రత పర్వదిన శుభాకాంక్షలు!
 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

26, జులై 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 85

WHEN the warriors came out first from
their master's hall, where had they hid
their power ? Where were their
armour and their arms ?

They looked poor and helpless, and
the arrows were showered upon them
on the day they came out from their
master's hall.

When the warriors marched back
again to their master's hall where did
they hide their power ?

They had dropped the sword and
dropped the bow and the arrow ; peace
was on their foreheads, and they had
left the fruits of their life behind them
on the day they marched back again to
their master's hall.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

స్వామి కూటమిలోనుండి సైనికాళి
వెలికిఁ దొలుదొల్త వచ్చినవేళయందె
మేటి భుజశక్తి యెచ్చట మాటువడెనొ?
అస్త్రముల్ కవచమ్ము లేమయ్యెనొక్కొ? ||

దీనులై యసహాయులై కానఁబడిరి,
నలువలంకులనుండి యానాడు వారి
పైనిఁ గురిసె నిరంతరబాణవృష్టి,
వెలికి వచ్చిరి ప్రభునియిల్ వీడినారు ||

మఱల తమ యజమానుని మందిరంబు
జేరుటకు వెనుదిరిగిరి వారలెల్ల,
తమ విపులశక్తి నెచ్చట దాచినారొ? ||

ఎచటఁ గత్తులు విల్లమ్ము లిడిరొ కాని
ఫాలమున శాంతిరేఖలు దేలియాడ
బ్రదుకులోపలి సుఖదుఃఖఫలము లెల్ల
వీడి వెనుకకుఁ దిరిగిరి నాడె తాము,
మఱలఁ దమ యజమానుని మందిరంబు
జేరుటకు వెనుదిరిగిరి వార లెల్ల ||

సమస్యాపూరణం - 774 (కాకరపూ పూచి నిమ్మ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాకరపూ పూచి నిమ్మకాయలు కాచెన్.
(‘తెలుగులో సమస్యాపూరణలు’ గ్రంధంనుండి)

పద్య రచన - 62

 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

25, జులై 2012, బుధవారం

సమస్యాపూరణం - 773 (విషము సేవింప నాయువు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
విషము సేవింప నాయువు పెరుగునయ్య!
ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 61

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 84

IT is the pang of separation that spreads
throughout the world and gives birth
to shapes innumerable in the infinite sky.
It is this sorrow of separation that
gazes in silence all night from star to
star and becomes lyric among rustling
leaves in rainy darkness of July.

It is this overspreading pain that
deepens into loves and desires, into
sufferings and joys in human homes ;
and this it is that ever melts and flows
in songs through my poet's heart.


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

అణువణువులో జగమ్మెల్ల నలముకొన్న
తావకీన వియోగవ్యథాభరంబె
*యడవులై, కొండలై, నింగియై, సముద్ర
మై, వివిధరూపముల నభివ్యక్తమయ్యె;
ఇది విరహబాధ మౌనమై యెల్ల రేయి
సూచు రెప్పవ్రాల్చ కొక్కొక్క చుక్కవైపు,
వాన చీఁకటి వేళ శ్రావణఁపు రేల
నాకు లల్లాడు గలగల లాటలోన
మొరయు నీ విరహవ్యథాభరితగీతి ||

నీ గభీరవియోగార్తి నిఖిలజనుల
విషయవాంఛలై, ప్రేమలై, వేదనలయి,
సుఖములై పలురూపుల చొప్పు దాల్చి
తెప్పతెప్పలై యిల్లిల్లు కప్పివేయు;
ఇదియు విరహార్తియే సుమా యీ మదీయ
కవి హృదంతర మందుండి కరఁగి కరఁగి
పాటలై పొంగి పొరలుచుఁ బరుగు లెత్తు ||

24, జులై 2012, మంగళవారం

సమస్యాపూరణం - 772 (మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మగనిఁ దూలనాడి మాన్య యయ్యె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 60


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 83

MOTHER, I shall weave a chain of
pearls for thy neck with my tears of
sorrow.

The stars have wrought their anklets
of light to deck thy feet, but mine will
hang upon thy breast.

Wealth and fame come from thee
and it is for thee to give or to withhold
them. But this my sorrow is absolutely
mine own, and when I bring it to thee
as my offering thou rewardest me with
thy grace.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


*(తల్లిరో! నేడు నీ పైడిపళ్ళెరమును
స్వీయదుఃఖాశ్రుమాలఁ గైసేతు నేను)
మాతరో! నేడు నా బాష్పమౌక్తికముల
హారముం గ్రుచ్చి నీ గళమందు వైతు ||

చొక్కఁపు రవీందుతారల చెక్కడంపు
వెలుఁగుటందెలు నీ పదంబులఁ జెలంగుఁ,
గాని యీనాడు నీ యెదపైని నాదు
బాష్పమాలిక వ్రేలి శోభలు వెలార్చు ||

ధనము కీర్తియు నీ వీయఁదగినవమ్మ!
యిచ్చెదో! మానుకొనెదొ! నీ యిష్ట మద్ది,
కాని మాయింట నా సొంతమైన సొమ్ము
దుఃఖ మొకటియె పూర్తిగ దొరుకు సుమ్ము ||
*(అచ్చమౌ రతన మ్మిది యరయ దీవ,)
యేను దానిన కానుక యిత్తు నీకుఁ,
బ్రతిఫలంబయి నీ యనుగ్రహము వచ్చు,
*(నెంతయుం దీని కేను గర్వింతు నమ్మ!) ||

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 5

కావ్యములోని సాహిత్యపరమైన విశేషములు:
          శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు పేర్కొనినట్లు యీ కావ్యము సరళముగా, సుబోధకముగా, సూక్తి సురభిళముగా అలరారుచున్నది. సుమారు 2,400 పద్యములు కల ఈ కావ్యములో  50 విధముల ఛందస్సులు గోచరించును.  అనేకములగు విశేష వృత్తములు చాలా సందర్భములలో నుపయోగింప బడినవి.
ఉదా: స్రగ్ధర, మహాస్రగ్ధర, మేఘవిస్ఫూర్జితము, శిఖరిణి, సుగంధి, ఉత్సాహ, మత్తకోకిల, మొ.వి.

          12 సంస్కృత శ్లోకములు వేదవాక్యములను అనుకరించు రీతిలో చదువరులకు ఆహ్లాదకరముగా గలవు.  
          అక్కడక్కడ కొన్ని శబ్దాలంకారములు, అర్థాలంకారములు కూడా కావ్యమునకు వన్నె తెచ్చునున్నవి.  ఉదా: శ్లేషాలంకారము, ముద్రాలంకారము, ముక్తపదగ్రస్త అలంకారము మొ.వి.
          శ్రీరామగీత అను జ్ఞానబోధ సంపూర్ణముగా ఒక 180 పాదముల సీసమాలికగా వ్రాయబడినది.
           కావ్యాంతములో కొన్ని గర్భ కవిత్వ రీతులు రేఖా చిత్రములతో చూపబడినవి.
          శ్రీ కొంపెల్ల వేంకట రామ శాస్త్రి గారి అభిప్రాయములో "ఈ అధ్యాత్మ రామాయణములో సందర్భోచితమైన పద ప్రయోగములు, రసోచితమైన వృత్త విన్యాసాలు సహృదయులకు హృదయాలను రంజింపజేస్తాయి. 
          శ్రీ కోటమర్తి వేంకట నరసింహ మూర్తి గారి విశ్లేషణలో: ఇందలి రచనా వైవిధ్యము ఆదర్శప్రాయము.  గ్రంథ పరిశీలనా విషయమున యథోచితముగా అడుగడుగునా ఎన్నో యెన్నెన్నో చిన్నెలు, వన్నెలు పాఠకలోకమునకు దృగ్గోచరమగుటయే గాక చర్విత చర్వణ స్థితికి గొంపోవును.  

మనమార హితులు నాయం
దనురాగము జూపి మధురతర పదములతో
వినుతించి కృతిని స్పందన
మును దెలిపిరి వారి నెల్ల బొగడుదు వేడ్కన్

శ్రీరామచంద్ర! నీ సేవ భాగ్యంబని
          వ్రాసితి నధ్యాత్మ రామ చరిత
నా బృహత్కార్యంబు నందాది నుండియు
          చివరి దన్క ననేక శిష్టజనులు
సౌహర్దమలర ప్రోత్సాహమ్ము గూర్చుచు
          నందించిరి సహాయ మాదరమున
నా రీతి బాసటయై నిల్చి నట్టి వా
          రందర నెంతయు నభినుతింతు
వారిపై కరుణామృత వర్షధార
కురిసి కలిగింపుమో దేవ! కువలయమున
నఖిల సౌభాగ్యములు, జీవితాంత్యమందు
నీదు సాయుజ్యముక్తి నో నీరజాక్ష!

ఈ గ్రంథము వలయు వారికి ఉచితముగా పోస్టులో పంప బడును.  
సంప్రదించవలసిన చిరునామా:
Nemani Ramajogi Sanyasi Rao
Plot No.HIG 33, Flat No.203,
Navya's Vijay Heights,
Marripalem Vuda Layout,
VISAKHAPATNAM - 530 009.
Phone: 0891 - 2565944,  mobile: 94402 33175

23, జులై 2012, సోమవారం

సమస్యాపూరణం - 771 (మునిని సంహరించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మునిని సంహరించె ననిలసుతుడు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 59


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాము(ల)ను వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 82

TIME is endless in thy hands, my lord.
There is none to count thy minutes.

Days and nights pass and ages bloom
and fade like flowers. Thou knowest
how to wait.

Thy centuries follow each other
perfecting a small wild flower.

We have no time to lose, and having
no time we must scramble for our
chances. We are too poor to be late.

And thus it is that time goes by
while I give it to every querulous man
who claims it, and thine altar is empty
of all offerings to the last.

At the end of the day I hasten in
fear lest thy gate be shut ; but I find
that yet there is time.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


కరతలము నీ కనంతమౌ కాల మధిప!
నిముసముల్ సేసి దాని గణించు నెవఁడు?
వచ్చుచుం బోవుచుండుఁ బవళ్లు రేలు
పువ్వులట్లు యుగాలు విప్పుచును రాలు,
*ఎదురుచూ పన నేమిటో యెఱుఁగు దీవె,
తడయ వెపుడేని తొందరపడ వొకింత,
ఒక యడవిపువ్వు సంపూర్ణవికసితంబు
సలుపు పనిలోనె బహుశతాబ్దులుగ నైనఁ
గడపివేయఁగఁ జాలెదు కాల మీవు ||

రిత్తపుచ్చగ క్షణమేని లేదు మాకు,
పనుల యొత్తిడి గజిబిజిపాటులోనఁ
గాలమే లేదు మాకడఁ జాలినంత,
యొక రవంత విలంబము నోర్వలేము ||


ఉన్న నా కొద్ది సమయమో యొక్కరీతి
“నాది, నాది” యఁటంచు పెన్‌వాదులాడు
పరుల పోరాటపడలేక భాగములుగఁ
బంచి యిచ్చుటలోనె గతించిపోవుఁ,
గాన్క యొకటియు నీ పూజగద్దెపైన
నుంచఁ బడ కది వట్టిగ నుండుఁ దుదకు ||

పగలు ముగిసెడు ననఁగనే భయము గ్రమ్ము,
“మూయఁ బడదు గదా భవదీయదివ్య
మందిరద్వార” మని మదిఁ గుందుచుందు,
పరుగు పరుగున నీదరి కరుగుఁదెంతుఁ,
గాని యచ్చోట నెప్పుడు గాంచనైన
సమయముండు నీ పూజకుఁ జాలినంత ||

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 4

          ఈ కావ్యము పేరు "శ్రీమదధ్యాత్మరామాయణము" కావున ఇది వేదాంత విజ్ఞాన సర్వస్వమునకు భాండాగారము.  అనేకానేక వేదాంత విజ్ఞాన విషయములు ఇందులో తెలుపబడినవి.
1.   కావ్య ప్రారంభములో "శ్రీరామహృదయము" అనే ఆత్మజ్ఞాన బోధ కలదు.  దీనినే సీతా రామాంజనేయ సంవాదము అని కూడా చెప్పుదురు.  ఆత్మ జ్ఞానసారము శ్రీరాముని ఆదేశము మేరకు సీతాదేవి ఆంజనేయునికి బోధిస్తుంది.  పిదప శ్రీరాముడు మరికొంత బోధ కావించెను.  ఇదే ఈ కావ్యమునకు పునాది.  మిగిలిన కావ్యమంతయు దీనికి విపులమైన వ్యాఖ్య గానే యున్నది.
2.   శ్రీరాముడు లక్ష్మణునికి నాలుగు సందర్భములలో జ్ఞానబోధ కావించెను.  అందులో "శ్రీరామగీత" యను మహోపదేశము చాల ముఖ్యమైనది.  శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన "గీతాబోధ"తో సమానమైనది.  అంతేకాదు అనేకులగు మహర్షులకు, శబరి, స్వయంప్రభ, తార మొదలగు వారికి మంచి జ్ఞాన బోధ గావించెను.  అటులనే కొందరు మహర్షుల బోధలు కూడ ఇందున్నవి. 
3.  శ్రీరామునికి అహల్య, పరశురాముడు, జటాయువు, ఇంద్రాది దేవతలు చేసిన స్తోత్రములు అనేకములు ఇందున్నవి.  కౌసల్యాదేవి శ్రీ మహావిష్ణువునకు చేసిన స్తోత్రము ఒక దండకము రూపములో, అయోధ్యా పౌరులు శ్రీరామ పట్టాభిషేక సమయములో చేసిన స్తోత్రము ఒక దండకము కలవు.  మరియును మూడు అష్టకములు కలవు. 
4.  పూర్తి సంస్కృత వాక్యములతో కొన్ని శ్లోకములు వేద మంత్రములను అనుకరించుచు కలవు  --
  - బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నప్పుడు;
  - పరశురాముడు శ్రీరామునికి ప్రార్థనము  చేసినప్పుడు;
  - శ్రీరాముడు రామలింగ క్షేత్రములో లింగ ప్రతిష్ఠ కావించినపుడు చేసిన స్తోత్రము
మొదలైన స్తోత్రములు చదువరులకు ఎంతయును ఆనందమును కలిగించును.

5.   మూలములో లేని స్తోత్రములను ఈ కావ్యములో కొన్నిటిని చేర్చితిని.  ఉదా: గంగాదేవికి సీతాదేవి చేసిన ప్రార్థన;  ఆంజనేయుడు శ్రీరామునికి చేసిన స్తోత్రము, ఇంద్రాదులు సీతాదేవి అవతారము ముగించునపుడు చేసిన స్తోత్రము, మొ.వి.  
          వ్యాస మహర్షి ఈ అధ్యాత్మ రామాయణము (పూర్తి కావ్యము) గురించి, ఇందులోని శ్రీరామ హృదయమును గూర్చి, మరియు శ్రీరామగీతను గూర్చి చదివిన, వ్రాసిన, వినిన గొప్ప పుణ్య ఫలితములు ఉండును అని ఫలశ్రుతిని దెలిపెను.
          స్వస్తి.  (సశేషము).

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

22, జులై 2012, ఆదివారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 3

          ఈ మహాకావ్యము మహనీయులైన పీఠాధిపతులు, జగద్గురువుల అనుగ్రహము నొందినది.
(1) శ్రీ శ్రీ శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతులు తమ సంతొషమును శుభాశీస్సులను తెలిపిరి.
(2) శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు తిలకించి "ఈ గ్రంథము తత్త్వ జిజ్ఞాసువులకు నిత్య పారాయణ గ్రంథముగా వెలుగొంద గలదని" ఆశీర్వదించిరి.  తాము కూడ ఈ గ్రంథమును నిత్యము పఠించుచున్నట్లు దయతో వెల్లడించిరి.
(3) శ్రీ శ్రీ శ్రీ కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతులు ఈ గ్రంథము సరళంగా, సుభోధముగా, సూక్తి సురభిళముగా నున్నది అని వెల్లడించి తమ ఆశీర్వచనములను గూర్చిరి.
(4) మహామహోపాధ్యాయ సద్గురు డా. కందుకూరి శివానంద మూర్తి గారు ఈ గ్రంథమును చదివి, వారి సందేశమును కూడా వ్రాసి, "సరళమైన అన్వయ సౌలభ్యము, సముచితమైన మాటల పొందిక అన్ని చదువరికి మిక్కిలి ఆనందాన్ని ఇవ్వగలవు.  ఈ కృతి తప్పక  ప్రజాదరణ పొందగలదు.  ఇంతటి పద్యకావ్యమును రచించిన ఈ కవి ఇంత తపోదీక్షను అవలంబించిన పుణ్యాత్మడగుట నిజము.  వారిని మనసారా అభినందించుచున్నాను."  అని వారి ఆశీస్సులనిడిరి.

          సాహితీమూర్తు లనేకులు ఈ గ్రంథమును ప్రశంసించిరి.
          ఆచార్య సార్వభౌమ డా. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ కావ్యమునకు విపులమైన ఆముఖమును వ్రాసిరి.  ఈ కావ్యము జిజ్ఞాసువులకు ఆత్మ తత్త్వోపదేశ ప్రధానమైన రచన గాను, కావ్య రసాస్వాదన తత్పరులకి మధుర కావ్యముగాను దర్శన మిస్తుంది.  మూలంలోని తత్త్వ వివరణ అనువాదములో సులభ సుందరముగా నిరూపింపబడినది.  ప్రధాన కథ శబ్ద ప్రయోగ వైచిత్రితో వర్ణనలతో అసదృస కల్పనలతో మహాకావ్య పద్ధతిలో అభివర్ణింప బడినది.  కాబట్టి ఉభయ పక్షాలకు చెందిన పాఠకులు ఈ అధ్యాత్మ రామాయణ పద్య కావ్యాన్ని తప్పక ఆస్వాదింపగలరు." అని వాక్రుచ్చిరి. 
          మహా సహస్రావధాని డా. గరికిపాటి నరసింహా రావు గారు, సహస్రావధాని డా.  కడిమిళ్ళ వరప్రసాద్ గారు వంటి వారి ప్రశంసలు కూడా ఈ కావ్యమునకు లభించినవి.శ్రీ కొంపెల్ల వెంకట రామ శాస్త్రి గారు మరియు శ్రీ కోటమర్తి వెంకట నరసింహ మూర్తి గారు  (కొవ్వూరు - పశ్చిమ గోదావరి జిల్లా) ఈ పద్య కావ్యమును పరిశీలించి తగు  సూచనలిచ్చి వారి అభిప్రాయములను తెలిపిరి.  
          ఈ విధముగా ఈ కావ్యము ఎందరెందరో మహనీయ మూర్తుల మన్ననలను అందుకొనినది.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం -770 (రాముని వెంట రాముఁ గని)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

రాముని వెంట రాముఁ గని రాముని సంఘము సంతసించుచున్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 58


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 81

ON many an idle day have I grieved
over lost time. But it is never lost, my
lord. Thou hast taken every moment
of my life in thine own hands.

Hidden in the heart of things thou
art nourishing seeds into sprouts, buds
into blossoms, and ripening flowers into
fruitfulness.

I was tired and sleeping on my idle
bed and imagined all work had ceased.

In the morning I woke up and found
my garden full with wonders of flowers.


శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....


వ్యర్థముగ నష్టమై పోయినట్టి నాళ్లు
తలఁచి పలుమారు లేను చింతింలుచు నుందు,
గాని యవి నష్టమౌట యెక్కడిది స్వామి?
నా బ్రదుకున నొక్కొక్క క్షణమ్ము నీవు
నీదు హస్తంబునం దాల్చి నిల్చియుండ ||

ప్రతి పదార్థము లోన గుప్తముగ నుండి
యరసి పోషించు నంతర్నియంత వీవ,
బీజములనుండి మొలక దెప్పింతు వీవ,
చిట్టి మొగ్గలఁ బువ్వులు చేతు వీవ,
విరులు ఫలములుగా మార్చి వేతు వీవ,
ఫలములం *గర్భబీజాలు నిలిపె దీవ ||

బడలి పవళింప నలసతఁ బాన్పు జేరి
“ఆగిపోయె సమస్త కార్యము” లటంచు
మదినిఁ దలఁచుచుఁ దలఁచుచు నిదురపోతిఁ,
గాని మేల్కాంచి యయ్యుషఃకాల మందె
నేను చూతును గదా! మదుద్యాన మెల్ల
నబ్బురము గొల్పు పూలు నిండారఁ బూచె ||

21, జులై 2012, శనివారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 2

          25-3-2009 నాడు అమెరికా చేరుకొని అచ్చట నొక సంవత్సర కాలము నివసించితిని.  ఆ సమయమున నిత్యము అధ్యాత్మరామాయణము సంస్కృత మూలమును తెలుగు తాత్పర్యమును చదువుట, బాగుగా అర్థము చేసికొనుట, దానిని తెలుగు పద్యములలో వ్రాయుటను ఒక దీక్షతో గావించితిని.  ప్రతి దినము ముప్పది పద్యములకు తక్కువ కాకుండ వ్రాయుట, ఆ విధముగ 3 రోజులలో సుమారు నూరు పద్యములు వ్రాయుట అగుట తోడనే మనస్సునకు విశ్రాంతి 2 రోజులు ఇచ్చుట, పిదప 2 రోజులలో ఆ వ్రాసిన పద్యములను సరిజూచు కొనుట, టైపు చేయుట జరుగు చుండెడిది.  ఆ విధమైన పట్టుదలతో ఈ కావ్యమును 2009 సంవత్సరము వినాయక చవితి పర్వదినమున (సెప్టెంబరు) ముగించితిని.
          ఆ రచనానుభవము వర్ణించుటకు వీలుకానిది.  నిత్యము రామాయణమును అధ్యయనము చేయుట, అందులోని పాత్రలలో లీనమగుట, తదనుగుణముగ మంచి భావముతో పద్యములను వ్రాయుట, వివిధములైన స్తోత్రములను రచించుట, అధ్యాత్మ విషయములను బాగుగ అధ్యయనము చేయుట, మొదలగు ననేక విషయములతో నిత్యము గడపుట అనునది ఒక గొప్ప తపస్సు అని నా భావము.  అట్టి మహాయోగమును పొందితిని.
          ఈ కావ్యములో శ్రీరాముడు పరమాత్మగా (పురుషోత్తమునిగా) వర్ణించబడెను.  సీతాదేవి యోగమాయ.  పరమాత్మను సగుణ బ్రహ్మముగను, నిర్గుణ బ్రహ్మముగను చెప్పుదురు.  కావున నేను శ్రీరాముని స్తుతించుచు ఈ క్రింది శ్లోకమును చెప్పితిని.
     రామం విశ్వమయం వందే  బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ |
     శాంతం సనాతనం సత్యం  చిదానందం పరాత్పరమ్ ||

          ఈ కథను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పుచున్నటుల నుండును.  రామకథను ఒక ఆధారముగ చేసికొని వివిధములైన వేదాంత విషయములను వివరించుటయును, భక్తిపూర్ణమైన అనేక స్తోత్రములను చేయుటయు నిందు ముఖ్యముగా కనుపట్టును.  అందుచేత నిది కర్మ, భక్తి, జ్ఞాన యోగములను త్రివేణీ సంగమముగ గోచరించును.  ఆ త్రివేణీ  సంగమమున నిత్యము స్నాన పానాదుల నొనర్చు వారి పుణ్య ఫలమును ఏమని వర్ణింపగలము - సర్వయోగ ఫలప్రదము. 
స్వస్తి!  (సశేషము)

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం -769 (ఆంగ్లభాష యుండ)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

ఆంగ్లభాష యుండ నాంధ్ర మేల?

ఈ సమస్యను సూచించిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 57


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 80

I AM like a remnant of a cloud of
autumn uselessly roaming in the sky, O
my sun ever-glorious ! Thy touch has
not yet melted my vapour, making me
one with thy light, and thus I count
months and years separated from thee.
If this be thy wish and if this be thy
play, then take this fleeting emptiness
of mine, paint it with colours, gild it
with gold, float it on the wanton wind
and spread it in varied wonders.

And again when it shall be thy wish
to end this play at night, I shall melt
and vanish away in the dark, or it may
be in a smile of the white morning, in a
coolness of purity transparent.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

మింట నవశిష్టశారద మేఘశకల
మట్లు క్రుమ్మరుచుంటి నిరర్థకముగ,
నా రవీ! శాశ్వతచ్ఛవీ! నన్ను నీదు
కరములం గరఁగించి  యావిరిగఁ జేసి
కలుపు కొనవైతి వింక నీ కాంతితోడ,
నిక్కతంబున నెల లేండ్లు లెక్కా యిడుచు
నేను నీకంటె వేరయి నిలిచి యుంటి ||

ఇట్టి క్రీడయె నీకు నభీష్ట మేని
నా యనిత్యంపు తుచ్ఛశూన్యత్వ మీవె
రంగు రంగున దిద్దుము, బంగరంపుఁ
బూత యిడు మిచ్చవచ్చిన రీతి విసరు
తెమ్మెరలపయిఁ దేలిపోని, మ్మనేక
గతులా వెదజల్లు మద్భుతాద్భుతము గాగ ||

ఆట ముగియింప నీ మనసైన రేయిఁ
గరఁగి తిమిరాన లీనత గాంతు నొండె,
యచ్చ తెలివేగుఁ జిరునగ వౌదు నొండె,
చలువనై తేటఁదనమున నిలుతు నొండె || 

20, జులై 2012, శుక్రవారం

‘శ్రీమదధ్యాత్మరామాయణము’ రచన - ఒక తపస్సు - 1


          నా ఆత్మీయ సోదరుడు ఆంధ్ర విశ్వవిద్యాలయములో అచార్యపదవి నిర్వహించి విశ్రాంతి గైకొనుచున్న ఆచార్య సార్వభౌమ ప్రొ. వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక శుభ సమయమున నన్ను సంబోధించి “తమ్ముడూ! అధ్యాత్మరామాయణము పద్యములలో వ్రాయుటకు నీవు సమర్థుడవు. అందుచేత నీవు ఆ రచనమును  పూనుకొనుము” అని నాలో ఉత్సాహమును కల్పించి నన్ను ఆశీర్వదించినారు. 
          పిదప ఒక వారము దినములలో శ్రీ వలివేటి సుబ్రహ్మణ్యము అనే మిత్రుడు (మంచి పద్యకవి, భారత్ సంచార నిగములో ఇంజినీరు - ప్రస్తుతము రాజమహేంద్రవరము నివాసి) తన వద్దనున్న గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ వారి ప్రచురణ ‘అధ్యాత్మ రామాయణము’ సంస్కృతమూలము తెలుగు తాత్పర్యముతో కూడిన పుస్తకమును నాకు ఇచ్చెను. 
          14-1-2009 (సంక్రాంతి) నాడు అధ్యాత్మరామాయణమును తెలుగు పద్యములలో రచించుటకు శ్రీకారము చుట్టితిని.  రచన నిరాటంకముగనే సాగెను.  25-3-2009 నాటికి అమెరికాకు చేరు కొంటిని.  అచ్చట మా చిన్న అబ్బాయి చి. నందకిశోర్ ఉద్యోగము చేయుచున్నాడు.  అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రములో లేంకాస్టర్ పట్టణములో ఉంటూ పద్యరచన కొనసాగించితిని.  పద్య రచన చక్కగా సాగి సెప్టెంబరులో (వినాయక చవితి నాటికి) కావ్య రచన పూర్తి అయినది.  సుమారు 7 నెలల కాలములో పద్యకావ్యము పూర్తి అగుట ఒక గొప్ప అదృష్టము.  
          ఈ కావ్యమును సంస్కృతములో శ్రీ వ్యాస మహర్షి వ్రాసెను.  ఇందులో 4,200 శ్లోకములు కలవు.  శ్రీరాముని కథ రేఖా మాత్రముగనె యుండును.  ఎక్కువ భాగము శ్రీరాముడును, మహర్షులు, ఇతరులు చేసిన ఆత్మ తత్త్వ బోధలు ఉండును, అటులనే శ్రీరామునికి ఎందరో చేసిన స్తోత్రములు ఉండును.  ఇట్టి కావ్యమును నేను తెలుగులో సుమారు 2,400 పద్యములలో వ్రాసితిని.  ఆ సమయము ఒక పుణ్య సమయము.  నేను కావ్యమును రచించుట ఒక తపస్సు.  ఇది నా జన్మ జన్మల పుణ్య ఫలముగా లభించిన అదృష్ట విశేషము.
          మరికొన్ని వివరములను తదుపరి భాగములో వివరించెదను.  స్వస్తి.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం -768 (కపిని వలచి గిరిజ)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

కపిని వలచి గిరిజ తపము సేసె.

(కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో)

పద్య రచన - 56

మహానంది పుణ్యక్షేత్రము
 
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 79

IF it is not my portion to meet thee in
this my life then let me ever feel that
I have missed thy sight let me not
forget for a moment, let me carry the
pangs of this sorrow in my dreams and
in my wakeful hours.

As my days pass in the crowded
market of this world and my hands
grow full with the daily profits, let me
ever feel that I have gained nothing
let me not forget for a moment, let me
carry the pangs of this sorrow in my
dreams and in my wakeful hours.

When I sit by the roadside, tired
and panting, when I spread my bed low
in the dust, let me ever feel that the
long journey is still before me let me
not forget for a moment, let me carry
the pangs of this sorrow in my dreams
and in my wakeful hours.

When my rooms have been decked
out and the flutes sound and the laughter
there is loud, let me ever feel that I
have not invited thee to my house-
let me not forget for a moment, let me
carry the pangs of this sorrow in my
dreams and in my wakeful hours.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఈ బ్రదుకు జారిపోకముం దెన్నడైన
నిన్ను దర్శించు ప్రాప్తి లేకున్న యేని,
“నయ్యయో! చూడలేనైతి” నన్న చింత
యిదియె నా మదిలో సదా మెదలనిమ్ము,
మఱపురానీకు మొక క్షణమాత్రమేని,
కలలయందును మెలకువ గడియలందు
నీ యమితశోక వేదన యెల్లవేళ
గుండెలో ముల్లు గ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

జనము క్రిక్కిరిసిన జగ మనెడి విపణి
నెన్ని దినములో గడచిపోయినవి నాకు,
ప్రతిదినమ్ము లభించు సంపదలతోడ
నిండినవి యెన్ని తడవలో రెండుకేళ్లు,
*(కాని నాకేమి యొరిగె నద్దాని చేత?)
“చిక్కలే దించుకయు నాకు నిక్క” మంచు
మరపు రానీకు మెప్పుడీ మాట నాకు,
కలలయందును మెలకువ గడియలందు
నీ యమితశోకవేదన యెల్లవేళ
గుండెలో ముల్లు గ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

ప్రక్క లెగయ రొప్పుచు దారిప్రక్క బడలి
కూరుచున్నను, దుమ్ములో గుడ్డ పరచి
పండుకొన్నను రానిమ్ము భావ మిదియె,
“ఉన్న తెరువెల్ల నికముందె యున్న” దంచు
మరపు రానీకు మొక క్షణమాత్ర మేని,
కలలయందును మెలకువ గడియలందు
నీ యమిత శోకవేదన యెల్లవేళ
గుండెలో ముల్లు గ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

ఇంట మంగళాలంకృతు లెసఁగుఁగాక,
మురళిపాటలు హాయిగ మ్రోయుఁగాక,
యెంత యుల్లాసరేఖ రహించుఁగాక,
“నిను బిలువనైతి మాయింటి” కనెడు చింత
యిదియె నామదిలో సదా మెదలనిమ్ము,
మరవనీకు ప్రభూ! క్షణమాత్రమేని,
కలలయందును మెలకువగడియలందు
నీ యమితశోకవేదన యెల్లవేళ
గుండెలో ముల్లుగ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

19, జులై 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 78

WHEN the creation was new and all
the stars shone in their first splendour,
the gods held their assembly in the sky
and sang " Oh, the picture of perfec-
tion I the joy unalloyed ! "

But one cried of a sudden " It seems
that somewhere there is a break in the
chain of light and one of the stars has
been lost."

The golden string of their harp
snapped, their song stopped, and they
cried in dismay "Yes, that lost star
was the best, she was the glory of all
heavens ! "

From that day the search is un-
ceasing for her, and the cry goes on
from one to the other that in her the
world has lost its one joy !

Only in the deepest silence of night
the stars smile and whisper among
themselves " Vain is this seeking !
Unbroken perfection is over all ! "


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

జగతి నవనవ నిర్మితి నెగడి నపుడు,
తొలి వెలుంగుల చుక్కలు పొలుచు నపుడు,
గుంపులై మింట వేల్పులు కొలువు దీరి
గాన మొనరించి రిట్టులు *వీణపైన
“ఎంత నిండైన కళయిది యిచట నహహ!
యెంత నిర్మలమైన హాయి కల” దంచు ||

అంతలోనె హఠాత్తుగ నరచి రెవరొ
“అయయొ! తెగిపోయినది కాంతిహార, మరరె!
యేదొ యొక చుక్క దీనిలో లే” దఁటంచు ||

“అకట! పోయిన చుక్క రమ్యాతిరమ్య,
మది సకల నాకలోక శోభైక నిలయ,
మది మహా మహనీయ, మౌ, నౌ”నఁటంచు
నెల్ల సురలొక్క పెట్టున గొల్లు మనిరి ||

దేవతా వీణ బంగరుతీగ లపుడె
పళ్లు మని తెగె, పాటలు చల్లఁబడియె ||

నాటినుండి తదన్వేషణమ్మె తెగదు,
*(రేయి నిదుర లేదు, పగలు హాయి లేదు,)
మాటి కివ్వియె కేక లెచ్చోట విన్న
“ఒక్క యా చుక్క లేమిచే నక్కటకట!
జగము గోల్పడెఁ దన పెను సంబరంబు,
సృష్టికళ నిండుదనమె లోపించె” నంచు
మాటి కివ్వియె కేక లేనోట విన్న ||

కాని చుక్కలు గంభీర మౌన నిశల
మింట మిలమిలలాడు చొండొంటితోడ
“నిది వృధాశ్రమ, సృష్టికిఁ గొదువ లేదు,
నిండుదనమున నన్నియు నుండె” నంచు
ముసినగవు లొల్క గుసగుస ముచ్చటించు || 

సమస్యాపూరణం -767 (ముగిసె నాషాఢ మని)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

ముగిసె నాషాడ మని యేడ్చె ముద్దుగుమ్మ.

పద్య రచన - 55

 
కవిమిత్రులారా, 
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

18, జులై 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 77

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

77

I KNOW thee as my God and stand
apart I do not know thee as my own
and come closer. I know thee as my
father and bow before thy feet I do
not grasp thy hand as my friend's.

I stand not where thou comest down
and ownest thyself as mine, there to
clasp thee to my heart and take thee as
my comrade.

Thou art the Brother amongst my
brothers, but I heed them not, I divide
not my earnings with them, thus sharing
my all with thee.

In pleasure and in pain I stand not
by the side of men, and thus stand
by thee. I shrink to give up my
life, and thus do not plunge into the
great, waters of life. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

నీవు దేవుఁడ వంచెంచి నిలిచియుందు
దూరమునయందె, నీవు నా తీరె యంచుఁ
దెలిసి నీచెంత కే నరుదెంతునోయి!
తండ్రి వంచెంచి నీదు పాదాల మ్రోల
వాలుదుం గాని, నెచ్చెలివోలె నీదు
కేలు కేలను గీలింపఁ జాలనోయి ||

క్రిందికిం దిగి చిరతరప్రేమతోన
స్వయముగా వచ్చి నావాఁడ వయిన నిన్ను
నెదకు హత్తించి కౌఁగిటఁ బొదువుకొనెడి
సాహసమ్మది నామదిఁ జాలదోయి!
అరయ లేనోయి నిన్ సహచరుఁడ వంచు ||

సోదరులలోన నీవొక సోదరుఁడవె,
కాని వారల నేను లక్ష్యమ్మె సేయఁ,
బంచి యీఁ జాల వారికి సంచితమ్ము,
నిత్తు నీపొత్తుకొఱకు నాయెల్ల సొత్తు ||

పరుల సుఖదుఃఖభరమునఁ బాలుగొనక
నీ సమీపంబు నందున నిల్చియుందు,
ప్రాణములకుఁ దెగించెడి పనులఁటన్నఁ
గడుభయమ్మున గమ్మున ముడుచుకొందు,
కాని జీవన మనియెడి కడలియందుఁ
జప్పునం దూకు ధైర్యము చాలదోయి! ||

సమస్యాపూరణం -766 (వచ్చినపని సఫలమయ్యె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

వచ్చినపని సఫలమయ్యె వైరము హెచ్చెన్.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 54


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

17, జులై 2012, మంగళవారం

సురవర తెలుగు కీబోర్డ్

సురవర తెలుగు కీబోర్డ్

          ప్రస్తుతం నేను సురవర తెలుగు కీబోర్డుతో టైపు చేస్తున్నాను. అన్ని విధాల సౌకర్యంగా ఉంది. దాని వివరాలు....

          తెలుగులో కంప్యూటర్లో పని చేయడమంటే అదేదో బ్రహ్మ విద్యనో లేకపోతే కేవలం కొందరు సాంకేతిక విజ్ఞానం కలవారికి మాత్రమే సొంతం అన్నది నిన్నటి మాట.
          సురవర కీబోర్డ్‌తో మనం వేరే ఏ సాఫ్టువేర్ల అవసరం లేకుండానే, చాలా సులువుగా తెలుగులో టైప్ చెయ్యవచ్చు.
suravara telugu keyboard


ఈ కీబోర్డ్…

    కంప్యూటర్లు, ల్యాప్టాప్‌లపై పని చేస్తుంది.
    మైక్రోసాఫ్ట్ విండోస్ 7, ఎక్స్పీ, విస్టా, లినక్స్, అను ఫాంట్స్‌పై పని చేస్తుంది.
    ఇంగ్లిష్, తెలుగు రెండూ సపోర్ట్ చేస్తుంది.
    ఇన్‌స్క్రిప్ట్ స్టాండర్డ్ నిమిషాల్లో నేర్పిస్తుంది.
    యూనికోడ్ తెలుగును మన మునివేళ్ళపై ఉంచుతుంది.
    మన కంప్యూటరుకు తెలుగు రుచి చూపిస్తుంది.


ఈ కీబోర్డ్ తో మనం....

    అతిసులభంగా తెలుగులో టైప్ చేయవచ్చు.
    తెలుగులో ఈ-మెయిల్స్ పంపించవచ్చు.
    తెలుగులో చాటింగ్ చేయవచ్చు.
    తెలుగులో కథలు, నవలలు రాయవచ్చు.
    తెలుగులో డాక్యుమెంట్లు ప్రింట్ చేయవచ్చు.
    తెలుగులో వెబ్సైట్లు నడపవచ్చు.
    ఆంగ్ల భాషకు లభించే అన్ని సౌలభ్యాలు తెలుగుకు కూడా దగ్గర చేయవచ్చు.


ఈ కీబోర్డును ఎలా కొనాలి?

ఈ కీబోర్డ్ ను కొనటం చాలా సులభం. కొనే విధానాలకోసం suravara.com ను చూడండి.

ఈ కీబోర్డ్ గరిష్ఠ అమ్మకపు ధర 1500/- రూపాయలు మాత్రమే.
ప్రత్యేకమయిన 33.4% తగ్గింపు తరువాత ఇప్పుడు మీరు కేవలం 999/- రూపాయలకే ఈ కీబోర్డ్‌ను సొంతం చేసుకోవచ్చు.


రవీంద్రుని గీతాంజలి - 76

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

76

DAY after day, O lord of my life, shall
I stand before thee face to face ? With
folded hands, O lord of all worlds, shall
I stand before thee face to face ?

Under thy great sky in solitude and
silence, with humble heart shall I stand
before thee face to face ?

In this laborious world of thine,
tumultuous with toil and with struggle,
among hurrying crowds shall I stand
before thee face to face ?

And when my work shall be done in
this world, O King of kings, alone and
speechless shall I stand before thee
face to face ?

చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు అనువాదము....


ప్రతి దినము నిల్తు నీమ్రోలఁ బ్రాణనాథ!
ఓ యఖిలలోకనాథ! కేల్దోయి మోడ్చి
యేను నిల్తును జుమ్ము నీ యెట్టయెదుట ||

ప్రభువ! యీ నీ యపారఁపు నభము క్రింద
నిర్జనము నీరవమ్మగు నెలవు నందు
నమ్రహృదయాన *బాష్పకీర్ణ నయనముల
నేను నిల్చెదఁ గాక నీ యెదుటియందె ||

బహు పరిశ్రమ కలకల ధ్వని పరీత
కర్మమయ మైన యీ నీ జగమ్ములోనఁ
బనుల గిజగిజలాటలఁ బరుగు లిడెడి
జనగణఁపు రాపిడుల నడుచక్కినేని
నేను నిల్తును గాక నీ యెట్ట యెదుట ||

ఈ భవల్లోకమందు నా యెల్లపని స
మాప్తమై పోయినపుడు రాజాధిరాజ!
యొంటరిగ మౌనభావము నూనివచ్చి
యేను నిల్తును గాక నీ యెట్ట యెదుట ||

సమస్యాపూరణం -765 (భాష రానివాఁడె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...


భాష రానివాఁడె పండితుండు.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 53


ఈరోజు నా పుట్టినరోజు. అరవైమూడవ సంవత్సరంలో అడుగుపెట్టాను.

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

16, జులై 2012, సోమవారం

ఆహ్వానం!


(స్పష్టంగా చదవడానికి చిత్రంపై క్లిక్ చేయండి)

రవీంద్రుని గీతాంజలి - 75

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

75

THY gifts to us mortals fulfil all our
needs and yet run back to thee un-
diminished.

The river has its everyday work to
do and hastens through fields and
hamlets ; yet its incessant stream winds
towards the washing of thy feet.

The flower sweetens the air with its
perfume ; yet its last service is to offer
itself to thee.

Thy worship does not impoverish the
world.

From the words of the poet men take
what meanings please them ; yet their
last meaning points to thee. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఈవు మర్త్యులమైన మా కిచ్చు కాన్క
లెల్ల మా యక్కరల్ దీర్చి, చెల్లిపోక,
మఱల నీజాడ లరయుచుఁ బరుగులెత్తు ||

దినదినము ప్రవహిల్లు నదీమతల్లి
పొలములకుఁ దడిజొన్పు, పల్లెలను దన్పు,
కాని యద్దాని యవిరత మైన ధార
కదలివచ్చు నీయడుగులు కడుగుకొఱకు
*తాను దన్నె జలాంజలిగా నొసంగు ||

పూవు లవి తమ కమ్మని తావితోన
యఖిల జగతిని గమగమలాడఁ జేయు,
కాని యవ్వాని చరమలక్ష్యమ్ము నీదు
పూజకై యర్పితంబయి పోవుటోయి!
*(జగతి, గికురించి నీదు పూజనము లేదు,)
నీదు సేవన లోకము పేదవడదు ||

తలఁప నెల్లరు సుకవిగీతమ్ములందుఁ
దమ మనోభీష్ట భావ చిహ్నములు గాంత్రు,
కాని యవ్వాని చరమ లక్ష్యమ్ము మాత్ర
మొక్క నీదగు సంగీత మొసఁగు నోయి! ||

సమస్యాపూరణం -764 (ఈతాకుల గుడిసెలోన)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

ఈతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్.

(`తెలుగులో సమస్యాపూరణములు’ గ్రంధంనుండి)

పద్య రచన - 52

(భీముఁ డశ్వత్థామ యను గజమును సంహరించుట)

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

15, జులై 2012, ఆదివారం

రవీంద్రుని గీతాంజలి - 74

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

74

THE day is no more, the shadow is upon
the earth. It is time that I go to the
stream to fill my pitcher.

The evening air is eager with the sad
music of the water. Ah, it calls me out
into the dusk. In the lonely lane there
is no passer by, the wind is up, the
ripples are rampant in the river.

I know not if I shall come back
home. I know not whom I shall
chance to meet. There at the fording
in the little boat the unknown man
plays upon his lute. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

పగలు దిగజారె, ధారుణిపైకి డిగ్గి
పుంజుకొనె సంజ, కుండ నింపుకొను కొఱకు
నింక నే నేటి రేవున కేగవలయు ||

వానచినుకుల కళవళపాటు పాట
నందుకొని మింట విసరెను సందెగాలి,
కనుమసకలోని కవ్వలి కడలనుండి
యహహ! నన్ బిల్చుచున్నది యా స్వరంబె,
*పోవలయుఁ గుండ నింపఁగ రేవుపైకి ||

ఈ రహోమార్గమందు లేఁ డెవఁడు నేడు,
కడు హడావిడి సేయుచు గాలి యెగసె,
ప్రేమనదిలోని తడలు పింపిళ్లుగూసె,
మఱలి వత్తునొ లేదొ నే డెఱుఁగ నింత,
యెవరితో నాకు, గలయిక యవు టెఱుంగ,
నెవ్వఁడో క్రొత్తవాఁడు తా నీ స్రవంతిఁ
జేరి, రేవునఁ బడియున్న చిన్నినావ
నెక్కి, కూర్చుండి, వీణ వాయించుచుండె
*పోవలయుఁ గుండ నింపుకో రేవుపైకి ||

సమస్యాపూరణం -763 (కోటి కంటె యొకటి)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

కోటికంటె నొకటి మేటి గాదె!

పద్య రచన - 51


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

14, జులై 2012, శనివారం

రవీంద్రుని గీతాంజలి - 73

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


73

DELIVERANCE is not for me in renuncia-
tion. I feel the embrace of freedom in
a thousand bonds of delight.

Thou ever pourest for me the fresh
draught of thy wine of various colours
and fragrance, filling this earthen vessel
to the brim.

My world will light its hundred
different lamps with thy flame and
place them before the altar of thy
temple.

No, I will never shut the doors of
my senses. The delights of sight and
hearing and touch will bear thy delight.

Yes, all my illusions will burn into
illumination of joy, and all my desires
ripen into fruits of love. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

స్వామి! నా ముక్తివైరాగ్యసాధనంబు
నందలేదు సుమా! యమందానురాగ
బహుసహస్రోరుశృంఖలాబంధములనె
నా కెదో మాక్షలక్షణానంద మందు ||

రకరకఁపు రంగు లనెడి, సౌరభము లనెడి
యమృతరసమున మృణ్మయమైన నాదు
పాత్ర నించెద వంచులు వారునట్టు,
లనిశ మిటుసేత నా కొరకని కదయ్య! ||

ఏను మాలోకమందలి వేనవేల
దివ్వెలన్ వెలిగింతు నీ దీప్తిశిఖకు
నవ్వి యన్నియు దెచ్చి నీ యాలయమున
పూజగద్దియ మీద నిల్పుదను జుమ్ము! ||

కఠినయోగాసనమ్ముల గాసితోన
యింద్రియద్వారముల్ మూయు టిచ్చగింప,
సొంపు గొల్పు రూపాదులు చూచినపుడు,
వినినపుడు, తాకినప్డు లభించు ముదమె
నాకు, జేకూర్చు యుష్మదానందభరము ||

నా భ్రమము లెల్ల నీ మహానందయజ్ఞ
మందు సమిధలుగా వెలుఁగొందఁగలవు,
పండువారుచు నా యెల్ల వాసనలును
భక్తిఫలములుగాఁ గనుపట్టఁగలవు ||

సమస్యాపూరణం -762 (చెడువానిం గొలువ సిరులు)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

చెడువానిం గొలువ సిరులు చేకుఱు మనకున్.

ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన - 50


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

13, జులై 2012, శుక్రవారం

వినాయక స్తుతి

వినాయక స్తుతి


సురవందిత శుద్ధ యశోవిభవా!
ధరణీధరరాజ సుతా తనయా!
పరమార్థ ఫలప్రద! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా! (1)

సరసేక్షణ! సజ్జన సంఘహితా!
దురితఘ్న! సుఖప్రద! దోషహరా!
పరమేశ్వర నందన! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా!  (2)

కరిరాజవరేణ్య ముఖా! సుముఖా!
కరుణాకర! పావన! కంజపదా!
వరదా! శ్రితవత్సల! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా!  (3)

శరణాగత రక్షక! సద్ధృదయా!
శరదైందవ వర్ణ! ప్రసన్న ముఖా!
పరమా! ప్రమథ స్తుత! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా!  (4)

పరమేశ కృపామృత పానరతా!
పరితాపహరా! భవబంధ హరా!
వర మూషిక వాహన! వందనమో
వరసిద్ధి వినాయక! భద్రగుణా!  (5)

రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

రవీంద్రుని గీతాంజలి - 72

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

72

HE it is, the innermost one, who
awakens my being with his deep hidden
touches.

He it is who puts his enchantment
upon these eyes and joyfully plays on
the chords of my heart in varied cadence
of pleasure and pain.

He it is who weaves the web of this
maya in evanescent hues of gold and
silver, blue and green, and lets peep out
through the folds his feet, at whose
touch I forget myself.

Days come and ages pass, and it is
ever he who moves my heart in many a
name, in many a guise, in many a
rapture of joy and of sorrow. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము.....

అతఁడె నా యంతరాంతర మధివసించి
తన గభీరనిగూఢమౌ తాకుతోన
లీలగా నస్మదాత్మను మేలుకొల్పు ||

తన విచిత్రంపు గారడితనఁపు సొంపు
నేర్పుతో నాకనుంగవ నింపు నతఁడె,
నాదు సుఖదుఃఖ భిన్నభిన్నస్వరాల
హృదయతంత్రులు వేడ్క మ్రోయించు నతఁడె ||

బంగరువు వెండి రంగులఁ బసరు నీలి
వన్నెలన్ మాయవల యల్లువాఁ డతండె,
దానిలోనుండి సడలించి తనపదములు
ముడుచుకొని మెలమెల్లగా నిడు నతండె,
తా నొకించుక నన్ సోకి నేనె నన్ను
మరచు నట్టుల పరవశపరచు నతఁడె ||

దినము లరుదెంచు, యుగములు తిరిగిపోవు,
కాని బహునామరూపము లూని యెపుడు
మేలుకీడుల, మోదఖేదాల తడల
నోలలార్చుచు నామది నుండు నతఁడె ||

సమస్యాపూరణం -761 (పెండ్లికాని పిల్ల)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

పెండ్లికాని పిల్ల బిడ్డను గనె.

(కర్ణజనన వృత్తాంతము నిషిద్ధము)

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 49


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

12, జులై 2012, గురువారం

రవీంద్రుని గీతాంజలి - 71

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

71

THAT I should make much of myself
and turn it on all sides, thus casting
coloured shadows on thy radiance
such is thy maya.

Thou settest a barrier in thine own
being and then callest thy severed self
in myriad notes. This thy self-separa-
tion has taken body in me.

The poignant song is echoed through
all the sky in many-coloured tears and
smiles, alarms and hopes ; waves rise up
and sink again, dreams break and form.
In me is thy own defeat of self.

This screen that thou hast raised is
painted with innumerable figures with
the brush of the night and the day.
Behind it thy seat is woven in wondrous
mysteries of curves, casting away all
barren lines of straightness.

The great pageant of thee and me
has overspread the sky. With the
tune of thee and me all the air is
vibrant, and all ages pass with the hiding
and seeking of thee and me. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

స్వయముగా నన్ను నే గొప్ప సల్పుకొందు,
గొప్పతన మది నల్దెసల్ ద్రిప్పుకొందు,
పోతవన్నెల నానీడ నీ తళుకుల
కద్దుకొనుచుందు, నీమాయ యిద్ది స్వామి! ||

నిన్ను విభజించి పలుతీర్ల నిల్పి నీవె
భిన్న భిన్న స్వరమ్ములఁ బిల్చుకొనెదు,
ప్రభువ! యీ నీ వియోగకల్పనము తాను
నీలిమే నయి నాపయి నిల్చునోయి ||

విశ్వగగనము నిండ నీవిరహతీవ్ర
గీతి మార్మ్రోగు నెన్నెన్ని రీతులందొ,
అదియె దుఃఖాశ్రులై, దరహాసము లయి,
భయములై, యాశలై కనుపట్టుచుండు,
తడలుగా రూపుకట్టుచుఁ గరఁగుచుండు,
అరసి చూడ స్వయమ్ముగా నందుకొన్న
నీ యపజయంబు నాలోన నిల్పినావు ||

నాథ! యీ నీ జగన్మయనాట్యశాల
తెరపయిన్ వేనవేల చిత్తరువు లీవు
దించెదవు రేఁబవళ్లను కుంచెతోడ,
వంపుదీరిన యడ్డ దిడ్డంపు చాళ్ల
యతి రహస్యఁపుటల్లిక నద్భుతమయి
చెలఁగు నద్దాని వెన్క నీ సింహపీఠి,
యొక్క రేఖయు సూటిగ నుండ దచట ||

ఉప్పరం బెల్ల నీ, నా, మహోత్సవప్ర
దర్శనమ్ములతోన వ్యాప్తమయిపోయె,
గాలి యిది యెల్ల నీ, నా స్వరాళిదేలి
మ్రోత లీనె వనీకుంజపుంజములను,
కాని దాగురుమూతలలోనె మనకు
యుగయుగమ్ములు కడచనుచుండె నోయి! ||

దత్తపది - 22 (కరము - తరము - వరము - హరము)

కవిమిత్రులారా,

‘కరము - తరము - వరము - హరము’

పై పదాలను ఉపయోగించి

రాయబారానికి పోనున్న కృష్ణునిముందు ద్రౌపది ఆవేదనను గూర్చి

మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

పద్య రచన - 48


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

11, జులై 2012, బుధవారం

రవీంద్రుని గీతాంజలి - 70

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

70

Is it beyond thee to be glad with the
gladness of this rhythm ? to be tossed
and lost and broken in the whirl of this
fearful joy ?

All things rush on, they stop not,
they look not behind, no power can
hold them back, they rush on.

Keeping steps with that restless, rapid
music, seasons come dancing and pass
away colours, tunes, and perfumes
pour in endless cascades in the abound-
ing joy that scatters and gives up and
dies every moment. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఇది మహానంద వాహిని, యీ ప్రచండ
గమనవేగము నిన్ మించి కలదు, నీదు
ఛంద మిద్దాని లయగతి కందునొక్కొ?
దీని భీషణమౌ సుడిలోనె దొర్లె
దొకొ? లయమ్మయి ప్రవహిలుచుందు వొక్కొ?
విరిగిపడి నుగ్గు నుగ్గయి తిరిగె దొక్కొ? ||

(దిక్కు దిక్కున మిన్నెల్ల పిక్కటిల్లె,
*వినవె మృత్యువు మీటెడి వీణెమ్రోత,
చంద్ర భాస్కర తారకాచయము మండు
టగ్గి యానందకీలల నిగ్గు దేరి
మెరయు చిటునటు బిరబిర పరుగులెత్తు,
ఆ మహోన్మాదకారి గానానుగతుల
నేవి యెచటికిఁ బరచుట యెఱుఁగఁ డెవ్వఁ,)
డన్నిఁటం గనుపట్టు ననంతజవము,
తెరపి యెఱుఁగవు, వెనుకకుఁ దిరిగి కనవు,
వాని నాపెడి బల మెందుఁ గానరాదు,
పరు గదియె వాని కానందగరిమ గూర్చు ||

అ మ్మహాగానరయముతో నడుగు కల్పి
యారు ఋతువులు నాట్యము లాడు చెపుడు
పొలుపుమై వచ్చుచుండును బోవుచుండు,
వాని రాకన రంగులు, గానముల్, సు
వాసనల్ సెలయేళులభంగి నిచ్చ
పడుచు, విరియుచు, రూపు గోల్పడుచు, విలయ
మందు చుండుఁ దదానంద మందె మున్గి ||