20, జులై 2012, శుక్రవారం

రవీంద్రుని గీతాంజలి - 79

IF it is not my portion to meet thee in
this my life then let me ever feel that
I have missed thy sight let me not
forget for a moment, let me carry the
pangs of this sorrow in my dreams and
in my wakeful hours.

As my days pass in the crowded
market of this world and my hands
grow full with the daily profits, let me
ever feel that I have gained nothing
let me not forget for a moment, let me
carry the pangs of this sorrow in my
dreams and in my wakeful hours.

When I sit by the roadside, tired
and panting, when I spread my bed low
in the dust, let me ever feel that the
long journey is still before me let me
not forget for a moment, let me carry
the pangs of this sorrow in my dreams
and in my wakeful hours.

When my rooms have been decked
out and the flutes sound and the laughter
there is loud, let me ever feel that I
have not invited thee to my house-
let me not forget for a moment, let me
carry the pangs of this sorrow in my
dreams and in my wakeful hours.

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము....

ఈ బ్రదుకు జారిపోకముం దెన్నడైన
నిన్ను దర్శించు ప్రాప్తి లేకున్న యేని,
“నయ్యయో! చూడలేనైతి” నన్న చింత
యిదియె నా మదిలో సదా మెదలనిమ్ము,
మఱపురానీకు మొక క్షణమాత్రమేని,
కలలయందును మెలకువ గడియలందు
నీ యమితశోక వేదన యెల్లవేళ
గుండెలో ముల్లు గ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

జనము క్రిక్కిరిసిన జగ మనెడి విపణి
నెన్ని దినములో గడచిపోయినవి నాకు,
ప్రతిదినమ్ము లభించు సంపదలతోడ
నిండినవి యెన్ని తడవలో రెండుకేళ్లు,
*(కాని నాకేమి యొరిగె నద్దాని చేత?)
“చిక్కలే దించుకయు నాకు నిక్క” మంచు
మరపు రానీకు మెప్పుడీ మాట నాకు,
కలలయందును మెలకువ గడియలందు
నీ యమితశోకవేదన యెల్లవేళ
గుండెలో ముల్లు గ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

ప్రక్క లెగయ రొప్పుచు దారిప్రక్క బడలి
కూరుచున్నను, దుమ్ములో గుడ్డ పరచి
పండుకొన్నను రానిమ్ము భావ మిదియె,
“ఉన్న తెరువెల్ల నికముందె యున్న” దంచు
మరపు రానీకు మొక క్షణమాత్ర మేని,
కలలయందును మెలకువ గడియలందు
నీ యమిత శోకవేదన యెల్లవేళ
గుండెలో ముల్లు గ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

ఇంట మంగళాలంకృతు లెసఁగుఁగాక,
మురళిపాటలు హాయిగ మ్రోయుఁగాక,
యెంత యుల్లాసరేఖ రహించుఁగాక,
“నిను బిలువనైతి మాయింటి” కనెడు చింత
యిదియె నామదిలో సదా మెదలనిమ్ము,
మరవనీకు ప్రభూ! క్షణమాత్రమేని,
కలలయందును మెలకువగడియలందు
నీ యమితశోకవేదన యెల్లవేళ
గుండెలో ముల్లుగ్రుచ్చిన ట్లుండనిమ్ము ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి