4, ఆగస్టు 2012, శనివారం

పద్య రచన - 71


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. గరుడ గమనుని నేనెప్డు గార వింతు
    వినత పుత్రుని వీపెక్కు విభుని గొలుతు
    సర్ప వైరికి స్వామిని సన్నుతింతు
    శ్రీని విడువని వానికి జేలు కొడుదు.

    రిప్లయితొలగించండి
  2. వందే వారిజలోచనం సురనుతం వందే రమావల్లభం
    వందే వారిద నీల కోమలతనుం వందే జగన్నాయకం
    వందేహం ద్విజవాహనం మురహరం వందే కృపాసాగరం
    వందే భక్తవరప్రదం హృది సదా వందే హరిం మాధవం

    రిప్లయితొలగించండి
  3. చిత్త శుధ్ధిగ జేసెద సేవ నీకు
    ముక్తి కోసము నెప్పుడు మ్రొక్క నిన్ను
    పారమార్ధికమునకునే పాటు పడుదు
    ఎల్ల వేళల జూడుము చల్లగాను

    రిప్లయితొలగించండి
  4. ఈరోజు వేంకటేశుని దర్శనం చేసుకొని వచ్చి ఇప్పుడే చూశాను. మనోహరమైన చిత్రం. పండితులవారి పద్యం చాలా బాగున్నది.
    అలాగే వ్రాయాలని ప్రయత్నించాను. తప్పులుంటే మన్నించి దిద్దగలరు.

    వందేహం స్థితికారకం భవహరం వందే మహాదైవతం
    వందేహం శుభరూపిణం శుభకరం వందే సురారాధితం
    వందేహం మునిపూజితం హరసఖుం వందే ప్రభో! శ్రీధరం
    వందేహం మధురాంతకం గిరిధరం వందే శ్రియావల్లభం!

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    పండిత నేమాని వారి స్ఫూర్తితో, వారికి ధన్యవాదములతో...

    వందే విష్ణు మనంత మబ్ధిశయనం వందే ముకుందం హరిం
    వందే పంకజనాభ మచ్యుత మజం వందే೭క్షరం మాధవమ్|
    వందే೭హం మధుసూదనం సువదనం వందే ఖగేంద్రధ్వజం
    వందే శ్రీదయితం ద్విజేంద్రగమనం వందే జగన్మోహనమ్||

    రిప్లయితొలగించండి
  6. నా మొదటి పద్యానికే తెలుగురూపమునిద్దామని ప్రయత్నించి కొంతవరకూ మాత్రమే సఫలీకృతురాలనయినాను.

    మ్రొక్కుల్ మంగళ రూప! మంగళము! నామోహమ్ము దియ్యంగదే!
    మ్రొక్కుల్ గైకొను, లోకపూజితుడవై మోక్షంబునియ్యంగదే!
    మ్రొక్కుల్ దేవతలెల్ల గొల్చు విభుడౌ ముల్లోకనాథా! హరీ!
    మ్రొక్కుల్ నీకు మహానుభావ! నిను నే మ్రొక్కంగ పాలింపవే!

    రిప్లయితొలగించండి
  7. స్రగ్ధరా వృత్తము:
    వందే దేవాదిదేవం వనరుహనయనం వార్ధిజా ప్రాణనాథం
    వందే వైకుంఠనాథం పరమమునినుతం వాసుదేవం మురారిం
    వందే పక్షీంద్రవాహం ఫణివరశయనం భక్తలోకార్తిహారిం
    వందేహం పద్మనాభం పరమసుఖకరం వారిదశ్యామలాంగం

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    సోదరి లక్ష్మీదేవిగారి స్ఫూర్తితో...ధన్యవాదములతో...నా తెనిఁగింపుఁ బద్యము:

    కొల్తున్ విష్ణు ననంతు నబ్ధిశయనున్ గొల్తున్ ముకుందున్ హరిన్
    గొల్తున్ బంకజనాభు నచ్యుతు నజున్ గొ ల్తక్షరు న్మాధవున్
    గొల్తున్ నే మధుసూదనున్ సువదనున్ గొల్తున్ ఖగేంద్రధ్వజున్
    గొల్తున్ శ్రీదయితున్ ద్విజేంద్రగమనున్ గొల్తున్ జగన్మోహనున్!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఈరోజు మీలో భక్త్యావేశం పొంగులెత్తింది. అద్భుతమైన పద్యాలను వ్రాసారు. కవిమిత్రులకు స్ఫూర్తి నిచ్చాయి. ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    కాని చిత్రంలోని లక్ష్మి, గరుత్మంతుల ప్రస్తావన లేదు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ శ్లోకం, పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
    హరసఖం అనాలి కదా! ‘మధురాంతకం’ ఏమిటి? ‘మధ్వంతకం’ అనాలనుకుంటాను.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ శ్లోకం, దాని అనువాద పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారు,
    తప్పే. మన్నించండి.
    మీరు సూచించిన సవరణలతో......


    వందేహం స్థితికారకం భవహరం వందే మహాదైవతం
    వందేహం శుభరూపిణం శుభకరం వందే సురారాధితం
    వందేహం మునిపూజితం హరసఖం వందే ప్రభో! శ్రీధరం
    వందేహం మధుసూదనం గిరిధరం వందే శ్రియావల్లభం!

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి పద్యము.....

    పండిత నేమాని వారి స్రగ్ధరావృత్త మమోఘముగ నున్నది. వారికి అభినందనలు...ధన్యవాదములతో...

    స్రగ్ధరావృత్తము(తెలుగు):

    కొల్తు న్విష్ణు న్ముకుందుం గొలుతు మురహరుం గొల్తు దైత్యారి నీశున్
    గొల్తుం జక్రిం ద్రిపాత్తుం గొలుతును ధ్రువునిం గొల్తు నేఁ గైటభారిన్
    గొల్తున్ హేమాంగునిన్ నేఁ గొలుతు నమృతదుం గొల్తుఁ బక్షీంద్రధుర్యున్
    గొల్తున్ లక్ష్మీవిభున్ నేఁ గొలుతు హరి నజున్ గొల్తుఁ బంకేరుహాక్షున్!

    రిప్లయితొలగించండి
  12. గుండు మధుసూదన్ గారూ,
    మీ స్రగ్ధర చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీమతి లక్ష్మీ దేవి గారి శార్దూల శ్లోకములో 3, 4 పాదములలో కొన్ని సవరణలు చేయవలసి యున్నది.
    (1) 3వ పాదములో "వందే ప్రభుం శ్రీధరం" అనాలి.
    (2) 4వ పాదములో వందే శ్రియావల్లభం సరికాదు. శ్రీవల్లభం అనాలి - లేకుంటే శ్రియోవల్లభం (శ్రియః + వల్లభం) అనాలి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. కొలిచెద భక్తిగ మిమునే
    నిలకడగా మనము నిలిపి నీరాజనముల్ !
    సొలసితి నిటు శరణంటిని
    నిలుపు ము నాపైన కరుణ నీరజ నయనా !

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమానివారికి ధన్యవాదములతో...

    వందేహం స్థితికారకం భవహరం వందే మహాదైవతం
    వందేహం శుభరూపిణం శుభకరం వందే సురారాధితం
    వందేహం మునిపూజితం హరసఖం వందే ప్రభుం శ్రీధరం
    వందేహం మధుసూదనం గిరిధరం వందే శ్రియోవల్లభం!

    రిప్లయితొలగించండి
  16. (భక్తపోతనామాత్యులకు క్షమాపణలతో)
    సిరియున్ గూడియు శంఖచక్రయుగమున్ జేదోయి సంధించియున్
    పరివారంబునుజీరి,యభ్రగపతింబన్నించి యాకర్ణికాం
    తరధమ్మిల్లముఁజక్కనొత్తు జగదోద్ధారంపునుత్సాహినిన్
    హరిఁమోక్షమ్మదిపొందగోరెదనుమాయామోహముల్ వీడగన్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము "సిరియున్ గూడియు" -- గురించి:

    ఈ క్రింది సవరణలు పరిశీలించండి:

    1. సిరినిన్ గూడియు - అని ప్రారంబించాలి.
    2. జగత్ + ఉద్ధార = జగదుద్ధార అవుతుంది. జగదోద్ధార అవదు. జగదోద్ధార అనే ప్రయోగమును వాగ్గేయకారులు వాడేరు కాని అది వ్యాకరణ విరుద్ధము.
    3. మీ భావము ప్రకారము పద్యములోని అన్వయమును ఒకమారు చూడండి సరళంగా సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. ఫణిరాజు తల్పాన పవళించు పరమాత్మ
    ఖగరాజు భుజమెక్కి కదిలెనెటకొ?
    కువలయంబుల నెల్ల కుక్షిలో నిముడించు
    పురుశోత్తముడు నేడు పోవు టెటకొ?
    మకర కుండల కాంతి మహినిండ దీపింప
    మధుసూదనునినేటి మార్గ మెటకొ?
    ఘన శంఖచక్రముల్ కరయుగ్మమందున
    ధరియించి వెడెలెడు ధామ మెచటొ?
    వైకుంఠ మందున వసియించు హరి నేడు
    సిరితోడ పయనించి తరలుటెటకొ?

    శ్రావణoబని కాబోలు సంతసమున
    దీన జన రక్షణార్థమై దివిని వీడి
    లక్ష్మి నారాయణులు సలక్షణముగ
    తరలి వచ్చిరి మ్రొక్కరే శిరసు వంచి !!!

    రిప్లయితొలగించండి
  19. పదునాల్గు లోకాల పాలించు ప్రభువైన
    పరమాత్మ కనిపించె పత్నితోడ
    చతురాననుని తండ్రి శంఖుచక్రాలతో
    నగుపించె నివ్వారు నవనిపైన
    మంగళ రూపుడై మహిలోన వెలసిన
    మూర్తియై కనవచ్చె ముక్తినొసగ
    ధరియిత్రి భారమ్ము తగ్గించు దేవుడై
    గరుడుని పైకెక్కి ఘనతతోడ

    శ్రావణమున వచ్చె చక్కని తల్లితో
    వరములిచ్చి కాచెడి వరలక్ష్మి
    తోడ, గొలుతు భక్తి తోహరి సిరిలక్ష్మి
    దంపతులను నేను తన్మయతను.

    పీతాంబరులవారి స్ఫూర్తితో.....
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీపండితనేమని గురువర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ తమరి సూచనల ప్రకారం సవరించిన పద్యాన్ని పరిశీళించ ప్రార్థన:
    సిరినిన్ గూడియు శంఖచక్రయుగమున్ జేదోయిసంధించియున్
    పరివారంబులు పాడ,యభ్రకపతిన్ బైనెక్కియాకర్ణికాం
    తరధమ్మిల్లముఁజక్కనొత్తి,జగదుద్ధారంబుకైసాగెడున్
    హరిఁవైకుంఠనివాసువేడెదను మాయామోహముల్ వీడగన్

    రిప్లయితొలగించండి
  21. మంద పీతాంబర్ గారూ,
    బహు గొప్పగా, చక్కగా పాడుకునేలా ఉంది పద్యం.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ సహదేవుడు గారూ!
    శుభాశీస్సులు. మీరు చక్కగా సవరించేరు. చాలా బాగున్నది ఈ పద్యము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం సవరించిన తరువాత ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం పోతన పద్యాన్ని తలపించింది. అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. తుమ్మల శిరీష్ కుమార్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి