8, ఆగస్టు 2012, బుధవారం

పద్య రచన - 75


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. హావ భావాలు దెలుపుచు నభి నయించు
    నాట్య కర్తను జూడంగ నతుల నీయ
    నిచ్చ గింతురు సర్వులు నెచ్చటైన
    నతుల నిత్తును నోయమ్మ ! నాట్య రాణి!

    రిప్లయితొలగించండి
  2. మోములో రసభావములు వెల్లివిరియగ
    కనులలో రతనాల కాంతులీన
    హస్త పద్మములలో నలరార ముద్రలు
    కనక లతాభమౌ తనువు నలర
    పాద విన్యాసముల్ బహు భంగిమలనొప్ప
    శ్రావ్యమై కింకిణీ రవము దనర
    అప్సరకాంతయే యమరలోకము నుండి
    యరుదెంచెనేమొ యీ యవనిపైకి
    యనగ లయతాళ రాగ భావానుసరణ
    రీతి సలుపుచు నున్నట్టి నృత్యమహహ
    రక్తి కట్టె, నా లలనకు రసహృదయకు
    సాదరమ్ముగ గూర్చెద నాశిషములు

    రిప్లయితొలగించండి
  3. సుందరీ నీ చిందుచూచి సిగ్గిలియేమొ
    అంబరమ్మున దాగె నప్సరసలు
    నట్టువాంగననన్న బెట్టు తా శిఖి వీడి
    చెట్టు పుట్టలసీమ పట్టిపోయె
    వీక్షింప సురరాజు వేయికన్నులనొందె
    చక్షులార్ప మరచె యక్షగణము
    నడల నీ లయగాంచి నడనేర్వగానెంచి
    అంచకూటమి నీదు పంచజేరు

    భరతమునికి నీవు గురుతు భారతమందు
    కూచిపూడివారి కూనవందు
    కనగనీదు చిందు కన్నుదోయికి విందు
    పడతి పరగు తీరు బహు పసందు

    రిప్లయితొలగించండి
  4. శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ఆహా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మాపై కరుణ చూపారు! ధన్యోస్మి!

    రిప్లయితొలగించండి
  5. శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ శుభాశీస్సులు. మీ పద్యము మంచి కవిత్వ శోభతో అలరారుచున్నది. మీ అంతర్జాల చిరునామా(Email ID) నాకు పంపించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. నమస్తే శంకరార్యా. మీకు కుశలమేగదా?

    నమస్కారం పండిత నేమాని వారూ, నా మైల్ ఐడీలు ఇవీ

    sk.sarma@adssc.ae
    sarmaji@eim.ae

    రిప్లయితొలగించండి
  7. శ్రీనేమని మరియు శ్రీ ఆదిభట్ల వారి పద్యములు అలరించు చున్నవి.
    నా చిన్న ప్రయత్నాన్ని పరిశీళించ ప్రార్థన:
    అంగన నాట్యమయూరీ
    భంగిమ, పార్థ ప్రవరాఖ్య వర్యుల మనసుల్
    లొంగగఁజేయదె? వారలఁ
    గొంగున ముడివేయదెనట కోమలి చూడన్!

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ సహదేవుడు గారూ!
    మీ పద్యము భావము బాగుగనున్నవి. నాట్యమయూరీ! అనే పదము సరియైనది కాదు. సినిమా కవిత్వములో అలా వాడేరు కానీ అది తప్పు. మయూరి అంటే ఆడు నెమిలి. ఆడు నెమిలి నాట్యము చేయదు. మగ నెమిలి మాత్రమే నాట్యము చేస్తుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. గురువుగార్కి వందనములు.తమరి సూచనకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. ఆంగికాహార్యమ్ము నభినయాదులగూడి
    ముద్రసంకేతాల ముదముగూర్చు
    సంగీత,సాహిత్య సరససమ్మేళన
    భవ్యమై వర్ధిల్లు భరతనాట్య
    మమరేంద్రు సభలోన,నవనీంద్రు సభలోన,
    సభ్యులు మెచ్చిరీ సంప్రదాయ
    మప్సరాంగనలును నవనిలో సుందరుల్
    వెలయించుచుందురీ లలితకళను,
    చిత్రపటమున జూచిన చెలువ,సుంద
    రాంగి ,హావభావమ్ముల నద్భుతముగ
    వెడద కన్నుల జూపించి ,విందు చేసి
    మనను రంజింప జేయుచు మనసు దోచె.

    రిప్లయితొలగించండి