4, ఆగస్టు 2012, శనివారం

సమస్యాపూరణం - 783 (శ్రావణమేఘములు గురియ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రావణమేఘముు గురియాగ సుములన్.

18 కామెంట్‌లు:

  1. భావజుడును రమణి రతీ
    దేవియు తమ వీటికరుగుదేర ముదముతో
    గావించుచు సత్కృతులను
    శ్రావణ మేఘములు కురియసాగె సుమములన్

    రిప్లయితొలగించండి
  2. లావున ఋతువుల కనువుగ
    శ్రావణ మేఘములు కురియసాగె; సుమములన్
    తీవలు నింపుకొనిమురిసె
    నా వర్షామృతము హర్ష మందించ ధరన్!

    రిప్లయితొలగించండి
  3. గుండు మధుసూదన్ గారి పూరణ....

    దేవేంద్రుఁడు వర్షమ్మను
    దీవననిడ భువికి బయలుదేఱియు రాఁ,బూఁ
    దీవలు పులకించఁగ నట
    శ్రావణమేఘములు కురియసాగె సుమములన్!

    రిప్లయితొలగించండి
  4. శ్రావణ మాసమునందున
    దేవతలెల్లరును లక్ష్మిదేవిని కొలువన్,
    పూవుల జల్లిగ భువిపడె
    శ్రావణమేఘములు కురియసాగె సుమములన్.

    రిప్లయితొలగించండి
  5. రావము సేయుచు పెద్దగ
    శ్రావణ మేఘములు కురియ సాగె, సుమములన్
    దేవుని పూజలు సేసిన
    కావును లే మనల నెపుడు కంటికి ఱెప్పై.

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. భావన జేసితి మదిలో
    శ్రావణమేఘములు గురియసాగె సుమములం,
    దా వనమందున,తరువుల,
    తీవలయందును చినుకుల తీరుగ నిపుడే.

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీ నరసింహం గారి పూరణ.....

    శ్రావణ గౌరీ పూజకు
    ఆ వరుణుఁడు భక్తితొడ ఆమని చెలితో
    ఈ వనికి తరలిరాగా
    శ్రావణ మేఘములు కురియసాగె సుమములన్.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ హర్షామృతాన్ని కురిపించింది. బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    కానీ ‘సుమములన్’ అన్నదాన్ని ‘సుమములందు’ అని మార్చారు. దీనిని పూరణగా స్వీకరించవచ్చా?
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పద్యంలోపల అచ్చులు వ్రాయడం మన సంప్రదాయం కాదు కదా! పూర్వపాదంలో వాక్యం పూర్తయి తరువాతి పాదాన్ని అచ్చుతో ప్రారంభించవచ్చు.
    మీ పద్యాన్ని ఇలా చెప్పవచ్చు.....
    శ్రావణ గౌరీ పూజల
    కా వరుణుఁడు భక్తితొడ నామని చెలితో
    నీ వనికి తరలిరాగా
    శ్రావణ మేఘములు కురియసాగె సుమములన్.

    రిప్లయితొలగించండి
  10. భావాంబర వీథిని గన
    నా వానచినుకులు తోచె నలరులుగా ,ర
    త్నావళులై,ముత్యాలై
    శ్రావణమేఘములు కురియసాగె సుమములన్ .

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు,
    ధన్యవాదాలు. మఱి మరొక పూరణ

    పూవనిలో పూదీవలు
    శ్రావణ మేఘములు; కురియసాగె సుమములన్;
    వీవన బూనిన పవనుడు
    దా వలపులు తెలుపుచు మఱి దాకిన తోడన్.

    రిప్లయితొలగించండి
  12. ఈ వనపు విరుల సొగసులు
    భావజుని యెదను విరియు వాసంతములై !
    రేవెలుగు శీతలము లన
    శ్రావణ మేఘములు గురియ సాగె సుమములన్ !

    రిప్లయితొలగించండి
  13. కమనీయం గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. చిటపట చినుకులు పడుతూ ఉంటే.....చెలికాడే సరసన ఉంటే ...

    ఆవరణ మందు చిటపట
    శ్రావణ మేఘములు గురియ, సాగె సుమములన్
    భావజుడే బెట్టి పదును
    యా వనిలో జంట పైన యదుటున వేయన్.

    రిప్లయితొలగించండి
  15. జీవుల దాహముఁదీర్చగఁ
    భూవనిఁగురిసితరియించు!,పూజకుతీగెల్
    కోవెలఁజేర్చితరించగ
    శ్రావణ మేఘములు!,కురియ సాగె సుమములన్!
    ( క్రమాలంకారం )

    రిప్లయితొలగించండి
  16. ఆ వానా కాలములో
    బావను చేబట్టి గుమ్మ పరుగులు పెట్టన్
    త్రోవన చెట్టుల నీడల
    శ్రావణమేఘములు గురియసాగె సుమములన్

    రిప్లయితొలగించండి
  17. కోవెలకు పోవు దారిని
    తీవెల పుష్పముల తరువు తియ్యని నీడన్
    మావారి తోడ దాగగ
    శ్రావణ మేఘములు కురియసాగె సుమములన్ 😊

    రిప్లయితొలగించండి