14, ఆగస్టు 2012, మంగళవారం

పద్య రచన - 81


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. చదువుల నెత్తుక వెళ్ళెడి
    ముద నష్టపు సోముకు మరి మోదితివయ్యా!
    చదువుల చేపగ మాకే
    సదమల చేపగ నిలచిన చక్రీ! జేజే!

    రిప్లయితొలగించండి
  2. జలములు ముంచువేళ కడు శౌర్యము జూపిన మత్స్యరాజమా!
    పలుకుల తేనెలూర నిను భక్తిని వేడుచునుందు దేవరా!
    కలవరమింక లేక, మఱి కల్పన కైనను మానసమ్మునన్
    చలనము లేక, నాదు తొలి స్వామిగ నిల్పితి సంతసమ్ముతో.

    రిప్లయితొలగించండి
  3. మన విజ్ఞాన విశేషసార ఘన సంపద్వైభవంబైన వే
    దనిధానంబును సోమకాఖ్యుడు బలాత్కారంబుగా గొంచు వే
    జనుచుండన్ గని గూల్చి యా దనుజునిన్ సందీప్తితో వేదరా
    శిని రక్షించిన మత్స్యరూప! నిను నే సేవింతు నత్యాదృతిన్

    రిప్లయితొలగించండి
  4. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    సదమల చేప అని 4వ పాదములో వాడేరు. బాగులేదు. తిలకించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు.
    మత్స్యావతారములో 2 ప్రయోజనములు చెప్పుదురు:
    (1) సోమకుని సంహరించి వేదములను రక్షించి మరల బ్రహ్మకు నిచ్చుట;
    (2) ప్రళయ కాలములో వైవస్వత మనువుని రక్షించుట
    ఈ రెండిటిలో ఏ ప్రయోజనమైన కనుపించాలి మన పూరణలలో. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  6. సోమ కాసురు డ య్యెడ చుట్ట చుట్టి
    వేదముల నపహరణ గావించ నంత
    విష్ణు మత్స్యావ తారపు వేష ము న న
    సంహ రించెను నాతని శాంర్గ ము నన

    రిప్లయితొలగించండి
  7. అయ్యా, ఇది చూడండి.

    చిఱురూపమ్మునఁ దోచి మత్స్యముగ నీ సృష్టిన్ కృపాదృష్టితో
    పరదైవమ్ముగ కావ వచ్చితివి దేవా! నా ప్రణామమ్ములన్
    హరి! నీకర్పణజేతు, కోరకనె సాహాయ్యమ్ము నందించగా
    కరమందించుచు నా ప్రభున్ పడవ నెక్కంగన్ ప్రబోధించితే!

    రిప్లయితొలగించండి
  8. ఈరోజు చేపల పులుసునకు వచ్చినన్ని విభిన్న పూరణలు మత్స్యావతారమునకు రాలేదు. ఏం చేస్తాము? సాధు సాధు. అందుచేత అందరి అభిరుచిని ఆదరించాలి కదా. పూరణలు చేసిన వారికందరికి మంచి ప్రశంసలే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. చేప రూపు దాల్చి ఛేదించి రక్కసు
    వేద రాసి దెచ్చి వేధ కిచ్చి
    సృష్టి కార్యమునకు సేమంబు చేసిన
    మత్స్య రూప నతులు మరల మరల.

    ప్రళయ కాలమందు కళదప్పి సర్వము
    నీట మునిగి నపుడు నిన్ను వేడ
    మత్స్య రూపు దాల్చి మనువును బ్రోచిన
    పరమ పురుష నీకు ప్రణతి ప్రణతి.

    రిప్లయితొలగించండి
  10. రామావతారము, కృష్ణావతారము గురించి తెలిసినంతగా మాకు మత్స్యావతారము గురించి తెలియకపోవటం తప్ప వేరే కారణం ఉండదనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  11. లక్ష్మీదేవిగారూ, శ్రీమద్భాగవతములో మత్స్యావతారము గురించి బాగా ఇచ్చారు.

    రిప్లయితొలగించండి
  12. ఈరోజు మత్స్యావతారము కాబట్టి నేనొక అవధానంలో విన్న సమస్య గుర్తొస్తోంది. ఔత్సాహికులు పూరించవచ్చు.
    "మత్స్యము మత్స్యమే మరియు మత్స్యము మత్స్యము గాక యేమగున్"

    రిప్లయితొలగించండి


  13. ధాతను గికురించి ,తస్కరించిన వేద
    ములనెల్ల దాచె సముద్రమందు,
    సోమకాసురుబారి శ్రుతులను రక్షింప
    అవతారమునుదాల్చె నచ్యుతుండు,
    అసురుని వధియించె నంబుధిచర మత్స్య
    రూపమ్ము దాలిచి పాపహారి
    ప్రథమావతారమై ప్రఖ్యాతిగాంచెను,
    గణుతి చేయంగ జగమ్ములెల్ల
    ఇంక యెన్నియో లీలల నెన్నదరమె
    యుగయుగమ్ముల ధర్మమ్ము నుద్ధరింప
    సజ్జనులబ్రోవ నుదయించు ,సర్వలోక
    రక్షకుండు శ్రీకరుడు నారాయణుండు.

    ఉద్ధృతమ్ముగ బొంగె పయోధి యెల్ల ,
    ప్రళయకాలాన,మనువును,ప్రాణికోటి,
    నౌకలో గొని మత్స్యమై శ్రీకరుండు
    కాచె గరుణచే బీభత్స కాలమందు.








    రిప్లయితొలగించండి
  14. గుండు మధుసూదన్ గారి పద్యములు.......

    (1)
    సోమకాసురుఁ డనెడి యసురుఁ డొకండు
    నాల్గు వేదమ్ములను దాచె నబ్ధి లోన!
    హరియ మత్స్యావతారుఁడై యసురుఁ జంపి,
    కాచె వేదమ్ములను; నిల్పె ఘనత భువిని!

    (2)
    కం.
    వైవస్వత మనువొక దిన
    మా విశ్వేశ్వరున కపుడు నర్ఘ్యం బిడఁగన్;
    ఠీవిగను మత్స్య మొక్కటి
    "కావుమ న"న్నంచుదుమికె కమికిలి లోనన్!(1)
    తే.
    కరుణతో రాజు దానిని కలశమందు
    విడిచె; మఱునాఁడు చేపయుఁ బెరిఁగిపోయి,
    "నన్ను రక్షింపు"మని కోర నపుడు నొక్క
    నూఁతిలోఁ జేర్చె రాజు సంతోషముగను!(2)
    ఆ.వె.
    మఱు దినాన మీన మా నూఁతి లోపలఁ
    దిరుగ రాక యున్నఁ దిరిగి ప్రభుని
    వేడె "మఱల నన్ను వేఱొక్క చోటున
    విడువ వలయు"నంచుఁ బ్రేమ తోడ!(3)
    కం.
    రాజటులె దానిఁ జెఱువున
    రాజిలఁగా విడువ,మఱలఁ గ్రక్కునఁ బెరిఁగెన్!
    సాజముగ రాజపు డా
    యోజన విస్తీర్ణ మత్స్య ముదధిని జేర్చెన్!(4)
    ఆ.వె.
    చేర్చి యిటులఁ బలికె, "శ్రేష్ఠమౌ మీనమా!
    నీవు రాక్షసుఁడవొ, యీశ్వరుఁడవొ
    యెఱుఁగఁ జాలఁ జెపుమ, యెవఁడ వీ"వనవుడుఁ
    దా జనార్దనుఁడ నటంచుఁ బలికి;(5)
    తే.
    "రాజ! నూఱేండ్ల పిదపఁ బ్రళయము వచ్చు;
    నట్టిచో సర్వ సత్వమ్ము లటులె నాల్గు
    వేదములనొక్క నావలోఁ బ్రోగు సేసి,
    నాదు శృంగానఁ గట్టు మో యనఘ చరిత!"(6)
    కం.
    అనుచు నదృశ్య మ్మాయెను;
    మనువును దానటులె సక్రమమ్ముగఁ జేయన్
    ఘనముగను జీవతతి పుడ
    మిని వర్ధిల్లెను; మనువుకు మే నుప్పొంగెన్!(7)

    - :శుభం భూయాత్ :-

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ________________________________

    చిన్ని చేపగ తా మారి - సృష్టి బ్రోచె !
    సోమకాసురు దునుమాడు - శూరునకును
    వేద సంపద గాపాడు - విష్ణు వునకు
    అంబుజోదరు , నజయుని - కంజలిడరె !
    ________________________________

    రిప్లయితొలగించండి
  16. సామ వేద శాస్త్రములను సగరమందు దాచి, ఈ
    భూమికి కడు భారము గను భువిని చెలగుచున్న యా
    సౌమకుని వధించి వేద శాస్త్రములను దెచ్చి, మా
    భూమి పైన మత్స్యముగను పూజలందు రాఘవా !

    రిప్లయితొలగించండి