25, ఆగస్టు 2012, శనివారం

పద్య రచన - 92


కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

  1. ఇలలో పాపము పెరుగగ
    కలలో దలపంగ లేని ఘన ఘోరములన్
    చెలగగ రా బోయెడు మన
    కలి కల్మష నాశకుడగు కల్కికి జేజే!

    రిప్లయితొలగించండి
  2. తురగమ్ము నెక్కి యద్భుత
    కరవాలము చేత బూని కలి పురుషుని సం
    హరణము నొనర్చి ధర్మము
    ధర గాచెడు కల్కి విభుని దలచి భజింతున్

    రిప్లయితొలగించండి
  3. పాపులు చెలరేగి భారమై భూదేవి
    ............కన్నీరు గార్చెడు కాలమందు
    ధర్మరతి నశించి దౌష్ట్యము పెచ్చాయి
    ............సాధు సజ్జనకోటి సమయు వేళ
    వర్ణాశ్రమమ్ములు వావివర్సలు పోయి
    ............నరనారు లొండొరుల్ తిరుగు నపుడు
    జాలి దయ క్షమల్ సంతలో సరుకాయి
    ............మానవత్వము మంట మాడిపోవ

    కలి మహత్వము ఘనమైన గడియలోన
    దుష్టులను బట్టి ద్రుంచగ తురగమెక్కి
    వాడి ఖడ్గము దాలిచి వత్తువీవు
    కల్కి రూపాన శ్రీహరీ గావ ధరణి.


    రిప్లయితొలగించండి
  4. ఇలను వింతరీతులందు ఇచ్చకాలు జరుపు యా
    కొలది జనుల వశము చేసుకొని చెలగుచునున్న యా
    కలి పురుషుని సంహరింప, కల్కి రూపమెత్తి,భూ
    స్థలికి నీవు తురగమెక్కి తరలినావు రాఘవా !

    రిప్లయితొలగించండి
  5. మీ విశ్లేషణ జరిగిన తరువాత, నేను, పరశురామ, వామన,మత్స్యావతారముల మీద కూడా పద్యాలు పోస్ట్ చేశాను. గురువు గారు వీలు చూసుకొని సలహాలు తెలియ జేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి పద్యము....
    సీ.
    కలియుగాంతమ్మునఁ గల రాజు లందఱుఁ
    జోర సములు గాను; క్రూరులుగను
    వర్తించుచుండఁగాఁ బ్రబల యశస్కుఁడు
    విష్ణుయశుండను విప్రు నింటఁ
    గల్కి నామమ్మున ఘను విష్ణు నంశాన
    జనన మందియుఁ దాను జగమునందు
    దుష్ట శిక్షణమును; శిష్ట రక్షణమును
    జేసియు మనకిడుఁ జిర యశమ్మ
    తే.గీ.
    టంచును బురాణములు వచియించుచుండె!
    నేఁడు నెటఁ జూడఁ బాపులై నెగడు వారె;
    చెడుగు పనులెన్నొ పూనియుఁ జేయువారె!
    వెంటనే రాఁ గదే కల్కి వేగిరముగ!

    రిప్లయితొలగించండి
  7. సత్యసంధత శూన్యమై, జపము, తపము,
    వేదవిహితమైన సుకర్మ విడచి యున్న
    కలియుగమ్మున- ధర్మము- కల్కి నిలుపు
    తురగమునధిరోహించి, నతులను గొనుచు.

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అద్భుతంగా ఉంది మీ పద్యం. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    కలి ఆగమనాన్ని చక్కగా వర్ణిస్తూ మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
    కొన్ని పదాలు పానకంలో పుడకల్లా ఉన్నాయి. వాటికి నా సవరణలు...
    ‘పెచ్చాయి - చెలరేగి’, ‘వర్సలు పోయి - వరుస లడంగి’, ‘సరుకాయి - సరుకయి’, ‘శ్రీహరీ గావ - శ్రీహరీ కావ’
    *
    వామన్ కుమార్ గారూ,
    మీ పద్యం ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నది. బాగుంది. అభినందనలు.
    ‘జరుపు యా’ను ‘జరుగు నా’ అనండి.
    మీ మిగిలిన అవతారాల పద్యాలను పోస్ట్ చేశానన్నారు. కానీ రాలేదే?
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారూ,
    ఆ పద్యాలను ఆ యా శీర్షికల కింద పోస్ట్ చేశాను. అయినప్పటికీ, ఇక్కడ మరలా పోస్ట్ చేస్తున్నాను.


    పరశు చేత బూని, వెంట పరుగులెత్తి రాజులన్,
    ఇరువదొక్క మారులు ధర, తిరుగుతూ వధించుచూ
    ధరణి భారమెంతయైన తగ్గునట్లు జేయగా,
    పరశురామ జన్మమీవు బడసినావు రాఘవా !



    శ్రీమదాది దేవ నీవు, సిరులు భువిని నింపగా,
    భూమి భారమైన బలిని భువిని మట్టు బెట్టగా,
    వామనావతారముగను, వసుధనవతరించి, మా
    క్షేమములను జూసినావు, క్షీర శయన! రాఘవా!



    మూడడుగుల ఒజ్జవీవు ముజ్జగముల కధిపుడా! (కధిప! ఏ)
    జాడ నెరుగని ప్రపంచ జనుల నార్తి బాపగా
    మూడడుగుల నేలనడిగి, ముష్కరులను దుంచగా
    నేడు వామనునిగ నీవు నిలిచినావు రాఘవా !

    సామ వేద శాస్త్రములను సగరమందు దాచి, ఈ
    భూమికి కడు భారము గను భువిని చెలగుచున్న యా
    సౌమకుని వధించి వేద శాస్త్రములను దెచ్చి, మా
    భూమి పైన మత్స్యముగను పూజలందు రాఘవా !

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ మీ సూచనలకు ధన్యవాదాలు. ఒక్కొక్కసారి చిన్నచిన్న దోషాలు కూడా గురువుల దృష్టి సోకితేనే కానీ తట్టవు. సవరించిన నాపద్యం:

    పాపులు చెలరేగి భారమై భూదేవి
    ............కన్నీరు గార్చెడు కాలమందు
    ధర్మరతి నశించి దౌష్ట్యమ్ము మితిమీరి
    ............సాధు సజ్జనకోటి సమయు వేళ
    వర్ణాశ్రమమ్ములున్ వావివరుస లేక
    ............నరనారు లొండొరుల్ తిరుగు నపుడు
    జాలి దయ క్షమల్ సంతలో సరుకయి
    ............మానవత్వము మంట మాడిపోవ

    కలి మహత్వము ఘనమైన గడియలోన
    దుష్టులను బట్టి ద్రుంచగ తురగమెక్కి
    వాడి ఖడ్గము దాలిచి వత్తువీవు
    కల్కి రూపాన శ్రీహరీ కావ ధరణి.

    రిప్లయితొలగించండి
  11. తురగ మెక్కి నీవు తిరుగాడి భువిపైన
    కల్ల కపట ములను యెల్ల దిశల
    పాప పుణ్య మన్న పరిహాసమే నీకు
    నాదు యుగ మటంచు నాల్క జాపి !

    రిప్లయితొలగించండి
  12. గ్రహములనుజేరురోవర్లుఘనతఁజెందఁ!
    యశ్వ వాహన మేపాటి?యదుకులేశ!
    బాంబు లేవైనఁజొరలేని పటిమ నంద!
    చేతి కరవాల మేరీతి చిత్తు జేయు?
    నీ దశావతారంబును నిక్కముగను
    టెన్తు జనరేష నున్మీఱు టెక్కుఁగూర్చి
    యాధునికముగవతరించుమాది విష్ణు!
    వందన శతమ్ములర్పింతు వంగి వంగి
    కల్కియవతార మర్జంటు కలి తరించ!

    రిప్లయితొలగించండి
  13. వామన్ కుమార్ గారూ,
    మీ పద్యాలను ఆయా శీర్షికల క్రింద వ్యాఖ్యానించాను. చూడండి.
    *
    మిస్సన్న గారూ,
    సంతోషం. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కపటములను +ఎల్ల’ అన్నపుడు యడాగమం రాదు. ‘కపటములనె యెల్ల’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    అన్యభాషాపదాల నుపయోగించినా మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఆధునికముగ + అవతరించు’ అన్నప్పుడు సంధిలేదు. ‘ఆధునికముగ జన్మించు మాది...’ అందాం.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కల్క్యావతారము :

    01)
    _______________________________

    కాలకాలుని మహిమల - గనగ తరమె ?
    కాలచక్రము నియతము - గా చరించు !
    కలి ప్రభావము వ్యాపింప - గాఢముగను
    కల్ల లాడుట నేర్చుదు - రెల్ల జనులు !
    కష్ట పడకుండ దొంగలై - గడుపు చుంద్రు !

    కలుష జన్ములు , హీనులు - కలము లంత
    కాకరూకపు రీతుల - గద్దె నెక్కి
    కర్మజీవుల నత్యంత - గాసి బెట్టి
    క్షమకు భారమ్ముగా మారు - కాలమందు

    కలిని బాపుట కొరకునై - కర్కశముగ
    కత్తి బట్టుక యేతెంచు - ఖరువు నెక్కి
    కల్కి భగవాను డికముందు - కాలమందు !
    కల్కి కంజలి నిడుటకై - కదలి రండు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘కలము లంత / కాకరూకపు రీతుల’...?

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ధన్యవాదములు !

    కలముడు = దొంగ
    కాకరూకము = మోసము

    రిప్లయితొలగించండి