8, సెప్టెంబర్ 2012, శనివారం

పద్య రచన - 106

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 కామెంట్‌లు:

  1. భంగిమ జూపుచు సినిమా
    రంగము పై కాలు సేతు లటు నిటు లూపన్
    గింగిరములు దిరుగుచు రే
    లంగిని జూడంగ నవ్వు లవియే వచ్చున్.

    రిప్లయితొలగించండి

  2. ఆంధ్ర భూమి పైన హాస్యము పండించి
    హావ భావములను హాయిగాను
    అమర విభుకు జూప నద్దాని రేలంగి
    దివికి నేగె నతడు దివ్య జీవి.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు.
    "అమరవిభుకు" అని ప్రయోగించేరు. సాధువేనా?
    ఉకార ఋకారముల తరువాత "కు"ను విడిగా వాడరాదు - "నకు" అని మాత్రమే ఉపయోగించితే వ్యాకరణ బద్ధముగా ఉంటుంది. అందుచేత "అమరపతికి" అని మార్చుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. హాస్య చక్రవర్తివిర నీ వాంధ్ర చిత్ర
    సీమ యందమరుడ వైతివో మనస్వి
    ఇప్పటివర కెప్పటికి నీకెవరు సాటి
    రారు రేలంగి వెంకట రామ ధన్య!

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    మీ సూచన మాకు సదా శిరోధార్యము.

    రిప్లయితొలగించండి

  6. నవ్వుల రాయడె యాతడు
    నవ్వులు నవ్వించు మనల నటనల తోడన్
    నివ్వసుది నట శిఖా మణి
    యవ్వల రేలంగి యతడె యాప్తుడు మనకున్ .

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి పద్యములు.....

    చుక్కల్లో చంద్రుడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య

    కం.
    రేలంగి హాస్య నటునిగఁ
    బాలించెను జలనచిత్ర వనిలోనను! దా
    నేలిన పాత్రలు పద్మ
    శ్రీ లభియింపంగఁ జేసెఁ జిత్రములందున్!(1)

    సీ.
    బాల్యమ్ములోఁ దండ్రి పలికించె 'హరికథల్'
    'సంగీత' మింపారె సరస భంగి!
    మొదట 'నాటక రంగ'మునను 'బృహన్నల'
    లోన స్త్రీ పాత్రలోఁ దా నటించె!
    'గృష్ణ తులాభార'కీర్తితుఁడై తాను
    'జలన చిత్రాల'లో నెల కొనియెను!
    'గుణ సుందరి కథ'లో గుణము హెచ్చఁగఁ బ్రజల్
    'హాస్య నటుని'గా సమాదరించ;
    గీ.
    స్థిరత నందియు రేలంగి తీరు మాఱె!
    నాయకుని సరసను దా సహాయ నటుని
    పాత్ర లెన్నియొ పోషించి, ప్రజల మెప్పు
    వడసి, తానెంతొ వెలిఁగి పోవఁగ మొదలిడె!(2)

    సీ.
    విప్ర నారాయణ, వెలుఁగు నీడలు, దొంగ
    రాముఁడు, మిస్సమ్మ, లవకుశలను;
    సత్య హరిశ్చంద్ర, జగదేక వీరుఁడు,
    మాయా బజారులన్ మంచి హాస్య
    నటనను బోషించినట్టి రేలంగి తా
    నెంతయో యెదిగెను వింతగాను!
    ప్రేక్షకాళిని హాస్యరీతుల మెప్పించి,
    చిత్ర పరిశ్రమన్ జిర యశుఁడయి,
    గీ.
    నిలిచి, వెలిఁగెను నాతండు! నేఁటి కింక
    నతని చిత్రాలు చూచెద ననెడి వార
    లెందఱో కలరన వింత యేమి కాదు!
    తర తరమ్ము లప్రతిముఁడై తనరె నతఁడు!!(3)

    ఆ.వె.
    ప్రియ తముండునైన 'రేలంగి' మాటాడి
    నవ్వు పువ్వు ఱువ్వు, ఱివ్వుమనఁగ!
    విరియు నెడఁద మనకు 'వేంకట రామయ్య'
    పలుకు వినఁగ! నతఁడు వర యుతుండు!!(4)
    కం.
    నవ్వుల ఱేఁ డతఁ డెప్పుడు
    ఱువ్వు ఛలోక్తులును హాస్య రుచు లందించున్!
    దివ్వియ వలె వెలుఁగు నతం
    డివ్విధి జన హృదయ వీథిఁ దిరమై భువిలోన్!!(5)

    -:శుభం భూయాత్:-

    రిప్లయితొలగించండి
  8. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    ఈనాటి పద్య రచనలో "లక్ష్యము - కీ.శే. రేలంగి వేంకటరామయ్య"
    మంచి రచనలు వచ్చేయి. అందరికీ అభినందనలు.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: గింగిరులు తిరుగుటను ప్రస్తావించేరు - ప్రశస్తమైన పద్యము.

    శ్రీ మిస్సన్న గారు: ఆంధ్రభూమిపై హాస్యము పండించిన హాలికునిగా వర్ణించేరు - ఉదాత్తమైన భావము.

    శ్రీ చంద్రశేఖర్ గారు: హాస్య చక్రవర్తిని అభినుతించేరు - ప్రశస్తముగా నున్నది పద్యము.

    శ్రీ సుబ్బారావు గారు: నవ్వులు రాయడు అనిసంబోధించేరు - పద్యము చాల ఉత్తమముగా నున్నది - 3వ పాదములో నివ్వసుది అంటే అర్థము కాలేదు.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: మంచి ఖండికలాగ విపులముగా వ్రాసేరు. మంచి మంచి భావములతో రీలంగి వారి జీవిత చరిత్రను పద్మశ్రీ బిరుదమును మన కనులముందుంచేరు. అద్భుతమైన రచన.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ నేమాని గారూ! ధన్యవాదములు.
    శంకరార్యా! మీ ఆరోగ్యము కుదుట బడినదా..త్వరగా కోలుకోవాలని మా కోరిక..

    రిప్లయితొలగించండి
  10. హేళనలులేనిహాస్యము
    రేలంగికిజన్మతః భలే యభినయమై
    కేరింతల గిలిగింతలు
    తాళగలేనట్లుజేసి తప్పట్లొసగున్!

    రిప్లయితొలగించండి




  11. హాస్యనటన జనాళికాహ్లాద మొసగె
    మాట,నడకయు,జేతలు మరియు హావ
    భావముల హాస్యమొలికించి జీవమిచ్చె
    పాత్రలకు 'రేలంగియే 'చిత్రములను.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా:
    మరికొన్ని రచనలు:
    అందరికీ అభినందనలు.

    శ్రీ సహదేవుడు గారు చక్కని మాట "హేళనలు లేని హాస్యము" అని ప్రారంభించేరు. పద్యము ప్రశంసనీయముగా నున్నది. 3వ పాదములో ప్రాసను మరిచి పోయేరు.

    డా. కమనీయము గారు చక్కగా వర్ణించేరు - హాస్యమొలికించి జీవ మిచ్చె యని. ఉత్తమమైన పద్యము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సహదేవుడు గారూ!
    కుంతి గురించి మీరు వ్రాసిన పద్యము నాకు అర్థము కాకపోవుటలో మీ తప్పేమియునూ లేదు. నాకు అవగాహనా లోపము కావచ్చు కదా! సరే. మీ పద్యము ఉత్తమముగా నున్నది.
    నారదుని గూర్చి మీరు వ్రాసిన పద్యము చాల బాగున్నది. "అవ్వన్" అనే ప్రయోగము వ్యాకరణ శుద్ధము కాదు. "అగుటన్" (అవుటన్ లేక ఔటన్ అని కూడా అనవచ్చును).మన్యుల్ అనే పదము తరువాత యడాగమము రాదు. ఈ కలి నారద మన్యులు నాకలి దీరన్ అనే నుగాగమము సరిపోవును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీనేమని గురువర్యులకు ప్రణామములు.
    ఆర్యా!
    శ్రీరేలంగి వారిమీద వ్రాసిన పద్యములో 3వ పాదములో ప్రాస మఱచిపోలేదు.ఆశువుగా దొర్లింది. తదుపరి పరిశీళనలో తప్పుకాదేమొ ననిపించింది.తమరొకసారి సుమతీ శతకంలోని
    'సిరితా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్' అన్న పద్యాన్ని గమనించండి.
    ఇక నారదుని మీది పద్యములో తమరి సూచన మేరకు సవరణ:
    లోకార్తిఁదీర్చ మునివై
    శ్రీకరు నామము జపింప శ్రీకర మందన్
    యీ కలి నారద మన్యులు
    నాకలి దీరంగ దోచిరన్యాయముగన్!

    తమరి గురువాత్సల్యమునకు ముగ్దుడనగుచుంటిని
    స్వస్తి.

    రిప్లయితొలగించండి