29, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 921 (తల బాష్పంబులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

20 కామెంట్‌లు:

  1. శాస్త్రి గారూ ! నమస్కారం.ధన్యవాదములు. మీరన్నట్టు స్కందుడు అనేదే సాధు రూపం. అమరకోశంలోనూ ఇలాగే ఉంది. .. పార్వతీనందన: స్కంద: సేనాపతీ: ...

    రిప్లయితొలగించండి
  2. వలదీ రీతి నధర్మవర్తనము కోపంబున్ మహాదేవు ను
    జ్జ్వల కారుణ్య రసాత్మకున్ సువిధి సంభావింపుమా తండ్రి! ని
    చ్చలటంచున్ సతి బల్క దక్షుడు తిరస్కారంబుతో నీల్గె, కాం
    తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్

    రిప్లయితొలగించండి
  3. కులకాంతన్, పరదార, నేకవసనన్ ఘోరాతిఘోరంబుగా
    ఖలముం బూని పరాభవించ వలదో కౌరవ్య! యంచాడినన్
    బలవంతంబుగ నీడ్చి గాదె యడగెన్ పాపాత్ముడానాడు, కాం
    తలబాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  4. ఇల సంస్కారము బెంచు విద్యలకు దానిల్లౌ ప్రదేశమ్మునన్
    కలకంఠిన్ కడు దుష్కరంబుగ మహాకాఠిన్యులై చంపుటే?
    కలికాలమ్మన నిట్లహో! మిగుల శోకమ్మందు నల్లాడు కాం
    తల బాష్పంబులు_ భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  5. తలలో కెక్కిన మత్తుచే చెడిన డెందంబుల్ విఘాతమ్ముతో
    మెలగన్ నీచపు చేష్టలన్ దగిలి యా ంలేచ్ఛుల్ లతాంగిన్నటన్
    బలవంతమ్మును జేయ బస్సున, విలాపమ్ముల్ ఘటించన్ ధరా
    తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ నాగరాజు రవీందర్ గారు ప్రస్తుత పరిస్థితిని ఉట్టంకించుచు పద్యము చెప్పేరు. చాల బాగుగనున్నది. వారికి శుభాశీస్సులు & అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. టైపాటు సవరణ :

    ఎలా టైపు చేసినా లేఖినిలో మ్లేచ్ఛుల్ అనే పదం సరిగ్గా రాలేదు . అందుకే దాన్ని అలాగే వుంచేశాను . మళ్ళీ ఇప్పుడు చివరికి గూగుల్ తెలుగులో ఆ పదాన్ని టైపు చేసి సవరణ చేస్తున్నాను .


    తలలో కెక్కిన మత్తుచే చెడిన డెందంబుల్ విఘాతమ్ముతో
    మెలగన్ నీచపు చేష్టలన్ దగిలి యా మ్లేచ్ఛుల్ లతాంగిన్నటన్
    బలవంతమ్మును జేయ బస్సున, విలాపమ్ముల్ ఘటించన్ ధరా
    తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  8. నాగరాజు రవీందర్ గారూ,
    లేఖినిలో మ్లేచ్ఛులు టైప్ చేయాలంటే ‘m@lEcCulu’ అని టైపు చేయవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  9. ఓ అలాగా గురువుగారూ ! ఈ విషయం నాకు తెలియదు. తెలియ జెప్పినందులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. కలకంఠీ చనిపోయి నావ యువతీ కామాంధులే క్రూరులై
    బలిమిన్ శీలము ప్రాణమున్ గొనగ నిర్భాగ్యంపు లోకమ్మునన్
    నిలువన్నేరక చిట్టితల్లి కలుగున్ నీయాత్మకున్ శాంతి కాం-
    తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  11. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, డిసెంబర్ 29, 2012 10:00:00 PM

    ఇల నేకాలము నాడు వారలకు లేదింతైన రక్షాభ్యుతిన్
    కలికాలంబున రెచ్చిపోయినవి దుష్కార్యంబు లెన్నో గతుల్
    మలినాపూరిత మానసాధములు, కామాంధుల్ ప్రవర్తింప కాం
    తల భాష్పంబులు భీషణాస్త్ర చయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  12. ఇల నే గాథను చూడలేదు వినలే దిబ్బంగి దుష్కృత్యమున్
    బలిమిన్ జేసిరి నిర్భయంబున కడున్ బాధించిరా ' నిర్భయన్ '
    తలలన్ దీయగ శిక్ష వేయవలయున్ తాత్సారమున్ జేయ కాం
    తల భాష్పంబులు భీషణాస్త్ర చయమై దండించు దుర్మార్గులన్.

    రిప్లయితొలగించండి
  13. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మశనివారం, డిసెంబర్ 29, 2012 11:46:00 PM

    శాస్త్రి గారు! మీ పూరణ యావద్దేశ ఆకాంక్షను తెలియజేయు చున్నది. మంచి పూరణ నిచ్చారు౤ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. ఈనాటి సమస్యకు మొదటి రెండు పూరణలు పురాణేతిహాసాలను ఆధారంగా చేసికొన్నా, ఆ తరువాత వచ్చిన వన్నీ ఢిల్లీ అత్యాచారాన్ని ఖండించేవిగా ఉన్నాయి.
    చక్కని పూరణలు పంపిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    మిస్సన్న గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
    అభినందనలు, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. మాస్టరు గారికి, బాల సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. తులతూగం గనులాక్రమించియు వనాదుల్ ధ్వంసమై యందు తో
    వల, నీరమ్ములు పాఱు వాగుల స్వరూపాదుల్ నశించన్ ధరా
    తల పర్యావరణంబు నాశమయి విందైపోయినన్ ధారుణీ
    తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్!

    రిప్లయితొలగించండి
  17. బలుపౌ నేతలు గుద్దులాడుచు నటన్ బ్రహ్మాండమౌ తీరునన్
    గెలువంగా మన పార్లమెంటున మహా ఘీంకారముల్ తోడుతన్...
    విలువల్ చీరుచు ఫోనుపైన విడుచున్ పీడించు ముస్లింల కాం
    తల బాష్పంబులు భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్

    రిప్లయితొలగించండి