20, జనవరి 2013, ఆదివారం

పద్య రచన - 227

రాయప్రోలు
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

4 కామెంట్‌లు:

  1. పెంచుము మంచిని మరి ప్రే
    మించుము దేశమ్ము, చేసి మేలును ప్రజకున్
    మంచిగ చూపుము, వైరము
    పెంచకుమనె రాయప్రోలు పెను కలహములన్

    రిప్లయితొలగించండి
  2. అభినవ నన్నయ బిరుదును
    శుభముగ నిల పొంది తీ వు సుబ్బారావా !
    అభి వాదము నే జేతును
    శుభ కా మనలిమ్ము నాకు సుకవి వరేణ్యా !

    కన్నె పాటలు మొదలైన కవిత లెన్నొ
    సుపరిచితములు మాకవి సుబ్బ రావ !
    కవన మందున నీ సాటి కాన రారు
    ఎందు వెదకిన నో సామి !యెవరు నీ కు .

    రిప్లయితొలగించండి
  3. తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మఆదివారం, జనవరి 20, 2013 5:36:00 PM

    రాయప్రోలువారి రచనా సముదాయమునొక చోట నుంచ ప్రయత్నముగ

    స్వప్నకుమారము, వనమాల,సుందర
    కాండ, తెలుగుతోట, కష్ట కమల,
    కన్నెపాటలు, తృణకంకణ(ము),(ఆం)మాంధ్రా
    వళి, భజగోవిందము, లీల వ్రాసె
    సౌందర్యలహరి,ని, జడకుచ్చులు, లలిత,
    మిశ్రమంజరి, యును, మేఘదూత,
    దూతమత్తేభ, మధుకలశము,(ఉ)త్తర
    రామచరితలను రాయ (ప్రో) పోలు
    సుబ్బరావు రసప్లుత సుమసమాన
    పద్య కావ్యముల్ పండిత వందితమయి
    తెనుగు భారతిన్ పొగడగ ధీ గుణమణి
    అందుకొనగ నీకు ప్రణతు లంద జేతు.

    రిప్లయితొలగించండి
  4. రాయప్రోలు వారిని గురించి చక్కని పద్యాలు వ్రాసిన కవిమిత్రులు.....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు.... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి