31, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1010 (మరుని ముద్దులాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మరుని ముద్దులాడె గిరికుమారి.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 297 (తులసి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“తులసి”

30, మార్చి 2013, శనివారం

దత్తపది - 31 (తమన్నా - కాజల్ - సమంతా - త్రిష)

తమన్నా - కాజల్ - సమంతా - త్రిష
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

ఈ దత్తపదిని సూచించిన నా బాల్య మిత్రుడు తాటికొండ ఓంకార్‌కు ధన్యవాదాలు.

పద్య రచన – 296 (నిఘంటువు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“నిఘంటువు”

29, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1009 (ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ప్రాఙ్ముఖుఁడై పరుగుదీసె భానుఁడు వేగన్.

పద్య రచన – 295 (నిత్య కళ్యాణము...)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“నిత్య కళ్యాణము - పచ్చ తోరణము”
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

28, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 1008 (హర నీవే శరణమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
హర నీవే శరణమ్ము నా కనియెఁ బ్రహ్లాదుండు సద్భక్తుఁడై.

పద్య రచన – 294 (గగన కసుమము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“గగన కుసుమము”

27, మార్చి 2013, బుధవారం

ఆహ్వానము


సమస్యాపూరణం – 1007 (కుత్సితులె చేయుదురు)

కవిమిత్రులారా,
హోళీ పండుగ శుభాకాంక్షలు
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము.

పద్య రచన – 293 (హోళి)

కవిమిత్రులారా,
హోళీ పండుగ శుభాకాంక్షలు.
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, మార్చి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1006 (కలహములే సకలసౌఖ్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కలహములే సకలసౌఖ్య కారణము లగున్.
ఈ సమస్యకు ఆధారం ‘పరాక్రి పదనిసలు’ బ్లాగులోని సమస్యాపూరణం. వారికి ధన్యవాలు.

పద్య రచన – 292 (కామ దహనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కామ దహనము”

25, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 1005 (అఆలను మరచిపోయిరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అఆలను మరచిపోయిరాంధ్రులె యౌరా!
ఈ సమస్యను పంపిన వామన్ కుమార్ గారికి ధన్యవాదములు.

పద్య రచన – 291 (హస్తి మశకాంతరము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“హస్తి మశకాంతరము”

24, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1004 (వమ్మొనర్చినచో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వమ్మొనర్చినచో సుఫలమ్ము లొదవు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన – 290 (చిలుక పలుకులు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“చిలుక పలుకులు”

23, మార్చి 2013, శనివారం

సమస్యాపూరణం – 1003 (తన్నన్ జూడఁగనె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తన్నన్ జూడఁగనె భక్తితత్త్వము దెలియున్.

పద్య రచన – 289 (సమ్మెలు - జనజీవనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“సమ్మెలు - జనజీవనము”

శ్రీలలితాంబికా!



శ్రీలలితాంబికా!

అమ్మా! శ్రీ లలితాంబికా! త్రిణయినీ! అమ్మా! మునీంద్రస్తుతా!
అమ్మా! సద్గుణ శోభితా! అనలజా! అమ్మా! సురేంద్రార్చితా!
అమ్మా! పద్మవనీ విహార నిరతా! అమ్మా! సుధావర్షిణీ!
అమ్మా! తావక తత్త్వ వైభవము నే ధ్యానింతు నత్యాదృతిన్

అమ్మా! సర్వ జగద్విధాయిని! వివేకానంద సంధాయినీ!
అమ్మా! సర్వ హృదంతరాళనిలయా! అజ్ఞాన నిర్మూలినీ!
అమ్మా! శ్రీ శివభామినీ! భగవతీ! అర్ధేందు చూడామణీ!
అమ్మా! తావక తత్త్వ వైభవము నే ధ్యానింతు నత్యాదృతిన్

అమ్మా యంచు దలంచినంత భవబంధాదుల్ పటాపంచలౌ
అమ్మా యంచు దలంచినంత హృదయంబత్యంత శోభాఢ్యమౌ
అమ్మా యంచు దలంచి పొందెదను బ్రహ్మానందమున్ సర్వదా
అమ్మా! తావక తత్త్వ వైభవము నే ధ్యానింతు నత్యాదృతిన్

పండిత రామజోగి సన్యాసి రావు

22, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1002 (పిఱికివాఁడు గెల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పిఱికివాఁడు గెల్చె వీరతతిని.
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

పద్య రచన – 288 (రెంటికిఁ జెడిన రేవఁడు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“రెంటికిఁ జెడిన రేవఁడు”

21, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 1001 (సూనుని దీవనలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సూనుని దీవనలు మనకు శుభకరము లగున్.

పద్య రచన – 287 (కవిత్వప్రయోజనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కవిత్వ ప్రయోజనము”

20, మార్చి 2013, బుధవారం

సమస్యాపూరణం – 1000 (వేయి సమస్యలు కవులకు)

కవిమిత్రులారా,
నమస్కృతులు.
"శంకరాభరణం" బ్లాగు వేయి సమస్యాపూరణలకు వేదిక అయింది.
దీనికి మీ అందరి భాగస్వామ్యమూ, సహకారం, సౌజన్యాలే మూలకారణాలు.
అందరికీ పేరుపేరునా అభినందలు, ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేయి సమస్యలు కవులకు వేడుకఁ గూర్చెన్.

పద్య రచన – 286 (ఆంధ్ర భారతి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఆంధ్ర భారతి"

19, మార్చి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 999 (అపకార మ్మొనరించు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అపకార మ్మొనరించు దుష్టులకు సాహాయ్యంబు సేయం దగున్.

పద్య రచన – 285 (అడవి గాచిన వెన్నెల)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"అడవి గాచిన వెన్నెల"
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

18, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 998 (వెఱ్ఱివారలు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వెఱ్ఱివారలు సదసద్వివేక నిధులు.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన – 284 (గతజల సేతుబంధనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"గతజల సేతుబంధనము"

17, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 997 (మృత్పిండమె స్వర్ణ మగుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మృత్పిండమె స్వర్ణ మగుచు మే లొనగూర్చున్.

పద్య రచన – 283 (విద్యాధనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"విద్యాధనము"

16, మార్చి 2013, శనివారం

సమస్యాపూరణం – 996 (పరుల సేవలే యొసంగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పరుల సేవలే యొసంగు భవ్య యోగముల్ సుధీ!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన – 282 (సింహాద్రి అప్పన్న)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"సింహాద్రి అప్పన్న"

15, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 995 (సుతవాహనుఁ డాజిఁ గూల్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన – 281 (శల్య సారథ్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"శల్య సారథ్యము"

14, మార్చి 2013, గురువారం

ఆహ్వానం



శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం

తేదీ : 17-3-2013 (ఆదివారం)
సమయం : ఉదయం 10.00 గం.ల నుండి

వేదిక :
శ్రీ శివశక్తి మందిరం, సెక్టార్ - 1,
రామకృష్ణాపురం, న్యూడిల్లీ -110022

కార్యక్రమం :
* భక్తులచే త్యాగరాజ కీర్తనల ఆలాపన
* పంచరత్న కీర్తనలు
* భక్తులచే త్యాగరాజ కీర్తనల ఆలాపన
* ప్రసాద వితరణ

సంగీత ప్రియులందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే.

కార్యవర్గ సభ్యులు
శ్రీ త్యాగబ్రహ్మ గాన సభ (రిజి)
సంప్రదించవలసిన ఫోన్ నం. : 9818486076

సమస్యాపూరణం – 994 (మృగమును సేవించు నెడల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మృగమును సేవించు నెడల మేలగుఁ బ్రజకున్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన – 280 (అంతర్జాలము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"అంతర్జాలము"
ఈ అంశమును సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

13, మార్చి 2013, బుధవారం

సమస్యాపూరణం – 993 (బుద్ధి గలుఁగు జనుల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బుద్ధి గలుఁగు జనుల రోయఁదగును.
(యతిమైత్రిని గమనించండి)

పద్య రచన – 279 (గోధూళి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"గోధూళి"

12, మార్చి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 992 (అనిరుద్ధుఁడు నెమలి నెక్కి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
అనిరుద్ధుఁడు నెమలి నెక్కి యంబుధి దాఁటెన్.
ఇది ప్రాచీనమూ, ప్రసిద్ధమూ అయిన సమస్య.

పద్య రచన – 278 (త్రిజటా స్వప్నము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"త్రిజటా స్వప్నము"

11, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 991 (ఓడిపోవుట వీరునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ఓడిపోవుట వీరున కొక వరంబు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 277 (జాగరణము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"జాగరణము"

10, మార్చి 2013, ఆదివారం

శ్రీ శివ స్తుతి (దండకము)


 శ్రీమన్మహాదేవ! శంభో మహాదేవ! శంభో మహాదేవ! దేవా! దయాపూర్ణభావా! నగేంద్రాత్మజా హృన్నివాసా! మహా దివ్య కైలాసవాసా! సదానంద! విశ్వేశ్వరా! సర్వలోకేశ్వరా! సర్వయోగేశ్వరా! సర్వభూతేశ్వరా! నందివాహా! భుజంగేశభూషా! త్రిశూలాయుధా! చంద్రచూడాన్వితా! పంచవక్త్రా! జటాజూట సంస్థాభ్రగంగాపగా! దేవదేవా! మహా భక్తి భావంబుతో నీదు తత్త్వంబు ధ్యానింతు నీశా!
సహస్రార్కకోటి ప్రభా భాసురంబై  యనాద్యంత వైశిష్ట్యమున్ బొల్చు లింగాకృతిన్ దాల్చి లోకంబులన్నింట వ్యాపించి యున్నట్టి నీ దివ్య తత్త్వంబు లోకైక రక్షాకరంబై  మహానందధామంబునై జ్ఞానసారంబునై సర్వదా శాంతమై వేదసంస్తుత్యమై యోగి సంసేవ్యమై యొప్పు నో దేవ!దేవా! అచింత్యప్రభావా!
సురల్ రాక్షసుల్ గూడి క్షీరాంబుధిన్ ద్రచ్చుచుండంగ నందుండి ఘోరాగ్ని కీలాన్వితంబైన హాలాహలాభీల మొక్కుమ్మడిన్ బుట్టి లోకంబులన్నింట వ్యాపించుచున్ ఘోర నాశంబు గావించుచుండంగ నా యాపదన్ బాపి లోకంబులన్నింటికిన్ రక్షవై నీవె యా ఘోర కాకోల హాలాహలంబంతయున్ నీదు కంఠంబునన్ నిల్పుకొన్నాడవో దేవదేవా!  త్రిలోకైక రక్షాకరా! దుఃఖనాశంకరా! శంకరా! 
ఆదిదేవుండవై, జ్ఞానసారంబవై, భద్రరూపుండవై, కాలకాలుండవై, త్రాతవై, నేతవై, దేశికస్వామివై, దక్షిణామూర్తివై, యొప్పు సర్వజ్ఞ! సర్వేశ! సత్యప్రకాశా! చిదాకార! నీ తత్త్వ వైశిష్ట్యమున్ నేను ధ్యానించెదన్ నీదు పాదమ్ములన్ గొల్చెదన్, నిన్ను కీర్తించుచున్ నీదు సేవానురక్తుండనై జన్మవారాశినిం దాటి యానంద సాంద్రాకృతిన్ గాంతు నో దేవదేవా! మహాదేవ శంభో! మహాదేవ శంభో! మహాదేవ శంభో! నమస్తే నమస్తే నమః  

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం – 990 (శివ శంకర యనిన)

కవిమిత్రులారా,
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...

 శివ శంకర యనినఁ బాపచింతన లెసఁగున్.

పద్య రచన – 276 (మహాశివరాత్రి)

కవిమిత్రులారా,
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!
నేటి పద్యరచనకు అంశము...
"మహాశివరాత్రి"
ఈ అంశాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

ఒక మంచి పద్యం - 1



శ్రీనాథుని పద్యం
పవిత్ర "మహాశివరాత్రి" పర్వదిన సందర్భంగా ఆ పరమశివుని ప్రసన్నదృక్కులు అందరిపైనా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, పార్వతీపరమేశ్వరులు సాక్షాత్కరించిన ఒక సన్నివేశాన్ని కవిసార్వభౌముడు శ్రీనాథుడు తమ "భీమఖండము" లో ఎంత హృద్యంగా వర్ణించాడో మీ అందరి దృష్టికి తేవాలని అనిపించింది.
ముందుగా పద్యాన్ని చిత్తగించండి.
చంద్రబింబానన, చంద్రరేఖామౌళి
         
నీలకుంతలభార, నీలగళుఁడు
ధవళాయతేక్షణ, ధవళాఖిలాంగుండు
         
మదనసంజీవని, మదనహరుఁడు
నాగేంద్రనిభయాన, నాగకుండలధారి
         
భువనమోహనగాత్ర , భువనకర్త
గిరిరాజకన్యక, గిరిరాజనిలయుండు
         
సర్వాంగసుందరి, సర్వగురుఁడు
గౌరి, శ్రీ విశ్వనాథుండు కనకరత్న
పాదుకలు మెట్టి, చట్టలు పట్టుకొనుచు
నందికేశుండు ముందట నడచిరాఁగ
నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.
        పద్యము సులభగ్రాహ్యంగానే ఉన్నప్పటికీ, తెలియనివారి కోసం కొద్దిగా వివరిస్తాను. పై సీసపద్యములోని నాలుగు పాదాల్లోనూ పార్వతిని, పరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు!
  • గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము). మరి, శంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
  • ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో ' నీల ' అనే పదానికి ' నలుపు ' అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా!
  • ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు.
  • మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు.
  • ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (' నాగము ' అంటే ఏనుగు అనే అర్థం వుంది.) స్త్రీలను ' గజగమనలు ' అని వర్ణించడం కవులకు పరిపాటే! మరి, శివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు.
  • సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
  • ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
  • అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువు; జగద్గురువు.
        పైవిధంగా ఆ ఆదిదంపతులు, తమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు.

        
మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలా, శ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం.

        
ఆస్వాదించే అభిరుచి, ఆసక్తి ఉండాలేగాని, మన తెలుగు సాహిత్యములో ఇటువంటి రసగుళికలు ఎన్నో!...........

భవదీయుడు,
సత్యనారాయణ పిస్క.

9, మార్చి 2013, శనివారం

ఆహ్వానము



ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు 
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవనంలో 
శ్రీ గరికపాటి నరసింహారావుగారి 
అష్టావధానం
 జరగబోతున్నది.
 ఔత్సాహికులు, ఢిల్లీలో ఉన్నవారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించవచ్చు.
వామన్ కుమార్

సమస్యాపూరణం – 989 (సోదరిఁ బెండ్లాడెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సోదరిఁ బెండ్లాడెను మధుసూదనుఁ డెలమిన్.

పద్య రచన – 275 (వైద్యో నారాయణః)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"వైద్యో నారాయణో హరిః"

8, మార్చి 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 988 (బుద్ధి నిడని గురుఁడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
బుద్ధి నిడని గురుఁడె పూజ్యుఁ డగును.
ఈ సమస్యకు మంద పీతాంబర్ గారి 'సరదాకి చిరుకవిత' ఆధారం. వారికి ధన్యవాదాలు.

పద్య రచన – 274 (మానవత్వపు విలువలు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"మానవత్వపు విలువలు"
ఈ అంశమును పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

7, మార్చి 2013, గురువారం

సమస్యాపూరణం – 987 (ధనములు గలవాఁడె నలఁగు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ధనములు లవాఁడె నలఁగు దారిద్ర్యమునన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన – 273 (దశమ గ్రహము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"దశమ గ్రహము"

6, మార్చి 2013, బుధవారం

సమస్యాపూరణం – 986 (స్తనములు గల పూరుషుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
స్తనములు గల పూరుషుండు స్తవనీయుఁ డగున్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

పద్య రచన – 272 (ఉడుత భక్తి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"ఉడుత భక్తి"

5, మార్చి 2013, మంగళవారం

సమస్యాపూరణం – 985 (శ్రీకృష్ణుని మేనమామ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శ్రీకృష్ణుని మేనమామ సీతాపతియే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదములు.

పద్య రచన – 271 (కర్మఫలము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"కర్మఫలము"

4, మార్చి 2013, సోమవారం

సమస్యాపూరణం – 984 (తన బాణము కలత వెట్టె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తన బాణము కలత వెట్టె త్ర్యంబకు మదిలో.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన – 270 (వేమన పద్యములు)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"వేమన పద్యములు"

3, మార్చి 2013, ఆదివారం

సమస్యాపూరణం – 983 (చూచెడి చూపు వెన్కఁ గల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
చూచెడి చూపు వెన్కఁ గల చూపును జూచెడు వాఁడు ధన్యుఁడౌ!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన – 269 (సౌందర్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"సౌందర్యము"

2, మార్చి 2013, శనివారం

వ్యసనము



నేటి కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ ప్రాంతానికి చెందిన సోమదేవుడు క్రీ.శ. 930 – 970 మధ్య కాలంలో సంస్కృతంలో వ్రాసిన వాక్యాలకు రాష్ట్రపతి బహుమతి గ్రహీత, మహామహోపాధ్యాయ, పద్మశ్రీ, బ్రహ్మశ్రీ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ఆంధ్ర వ్యాఖ్యానం శంకరాభరణబ్లాగు మిత్రులకు, పఠితలకు, ఈనాటి అంశము వ్యసనములునకు సరిపోవు నని భావిస్తూ... 
……….. మీ మిత్రుడు
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.

వ్యసన సముద్దేశః
1. వ్యసతి ప్రత్యావర్తయత్యేనం శ్రేయసః ఇతి వ్యసనమ్.
వీణ్ణి శ్రేయో మార్గం నుంచి వెనుకకు మరలిస్తుంది కాబట్టి వ్యసనం”. “వ్యసతి ఇతి వ్యసనమ్అని విగ్రహ వాక్యం.
2. వ్యసనం ద్వివిధం సహజమాహార్యం చ.
సహజమూ, ఆహార్యమూ (తెచ్చి పెట్టుకున్నదీ) అని వ్యసనం రెండు విధాలు.
3. సహజం వ్యసనం ధర్మ సంభూతాధుతాభ్యుదయహేతుభిః అధర్మ జనిత మహా ప్రత్యవాయ  ప్రతిపాదనైః యోగ పురుషైశ్చ ప్రశమయేత్.
ధర్మం వల్ల కలిగిన ఆశ్చర్యకరమైన అభ్యుదయానికి (ఐహిక సుఖాభివృద్ధికి) కారణాలు, అధర్మం వల్ల గొప్ప ప్రత్యవాయం కలుగుతుంది అని బోధించేవి అయిన మంచి ఉపాఖ్యానాల  శ్రవణపఠనాదుల ద్వారా, యోగ పురుషుల ద్వారా కూడా సహజ వ్యసనాలు శాంతింప  చేసుకోవాలి.
4. పరచిత్తానుకూల్యేన తదభిలషితేషు వ్యసనేషు ఉపాయేన విరక్తి జనన హేతవః యోగ పురుషాః.
ఇతరుల మనస్సులు నొచ్చకుండా మాటలాడుతూ వాళ్ళకి ఇష్టమైన వ్యసనాల విషయంలో విరక్తి కలిగేటట్లు ఉపాయాలు చేసేవాళ్ళు యోగపురుషులు.
5. శిష్టసంసర్గ దుర్జనాసంసర్గాభ్యాం పురాతన మహాపురుషచరితోత్థితాభిశ్చ కథాభిః ఆహార్య వ్యసనం పతిబధ్నీ యాత్. 
మంచివాళ్ళతో సంబంధం పెట్టుకోవడంచేత, దుర్జనులకి దూరంగా ఉండడంచేత, ప్రాచీనులైన (నల రామ యుధిష్టిరాది) మహాపురుషుల చరిత్రలకి సంబంధించిన కథలు వింటూండడంచేత ఆహార్యవ్యసనాలు ప్రతిబంధించాలి. (కొత్త వ్యసనాలు అలవడకుండా చూచుకోవాలి).
6. స్త్రియః అతిభజమానః భవత్యవశ్యం తృతీయాప్రకృతిః.
అతిగా స్త్రీ సంసర్గం చేసేవాడు తప్పక నపుంసకుడు అవుతాడు.
7. సౌమ్యధాతుక్షయః సర్వధాతు క్షయం కరోతి.
సౌమ్యధాతు (శుక్ల) క్షయంవల్ల అన్ని ధాతువులూ  క్షీణిస్తాయి. శరీరంలో ఉండే రస (నీరు)- రక్త మాంస మేధస్ (కొవ్వు) అస్తి మజ్జా శుక్రాలకి ధాతువులని పేరు.
8. పానశౌణ్డః చిత్తభ్రమాత్ మాతరమప్యభిలషతి.
అతిమద్యపానాసక్తుడు చిత్తభ్రమ వల్ల (ఒళ్ళు తెలియని స్థితిలో) తల్లిని కూడ అభిలషిస్తాడు. 
9. మృగయాసక్తిః స్తేనవ్యాలద్విషద్దాయాదానామ్ అమిషం పురుషం కరోతి. 
వేటమీద ఆసక్తి పురుషుణ్ణి దొంగలకి, మదగజాలకి, శత్రువులకి, దాయాదులకి అమిషంగా (తినే ఆహారంగా) చేస్తుంది. (వాళ్ళ వల్ల మరణిస్తాడు).
10. నాస్త్యకృత్యం ద్యూతాసక్తస్య, మాతర్యపి హి మృతాయాం దీవ్యత్యేవ హి కితవః
జూదగాడికి చేయకూడని పని అంటూ ఉండదు. తల్లి చచ్చి పడి ఉన్నా కూడా జూదగాడూ జూదం  ఆడుతూనే ఉంటాడు. 
11. పిశునః సర్వేషామవిశ్వాసం జనయతి.
చాడీలు చెప్పేవాని మీద ఎవరికీ విశ్వాసం ఉండదు. 
12. దివాస్వాపః సుప్తవ్యాధివ్యాలానామ్ ఉత్థాపనదణ్డః, సకల కార్యాన్తరాయశ్చ.
పగటి నిద్ర, నిద్రిస్తూన్న రోగాలనే క్రూరసర్పాలను మేల్కొల్పేకర్ర. అన్ని పనులకూ విఘ్నం.
13. న పరపరివాదాత్ పరం సర్వ విద్వేషణభేషజమస్తి.
అందరినీ శత్రువులుగా చేసికోవాలంటే ఇతరులను చాటుగా దూషించడం వంటి మందు మరొకటి  లేదు.
14. తౌర్యత్రికాసక్తిః కం నామ ప్రాణార్థమానైర్న వియోజయతి.
నృత్య గీత వాద్యాలమీద అత్యాసక్తి ఎవణ్ణి ప్రాణాలనుండీ, ధనం నుండీ, గావ్రవం నుండి దూరం చెయ్యదు?
15. మృషోద్యా నావిధాయ కమప్యనర్థం న విరమతి.
అబద్ధాలాడడం ఏదో ఒక అనర్థం కలిగిస్తేకాని ఊరుకోదు.
16. అతీవేర్ష్యాలుం పురుషం స్త్రియః పరిత్యజన్తి, ఘ్నన్తి వా.
ఎక్కువ ఈర్ష్య కలవాణ్ణి స్త్రీలు విడిచివేస్తారు లేదా చంపివేస్తారు.
17. పరపరిగ్రహాభిగమః కన్యాదూషణం వా సాహసం దశముఖ దాణ్డక్యాది వినాశహేతుః ప్రసిద్ధమేవ.
పరభార్యా సంబధము అవివాహితకన్యాదూషణం అనే సాహసమూ రావణుడు, దాండకి మొదలైన వాళ్ళ వినాశానికి దారితీసినవి అనే విషయం ప్రసిద్ధమే.
18. యత్ర నాహమిత్యధ్యవసాయః తత్సాహసమ్.
ఏ పని చేస్తున్నప్పుడు నేను అనే నిశ్చయం ఉండదో అది సాహసం. అనగా వళ్ళు తెలియని ఆవేశంలో చేసే పని సాహసం అని భావం అయి ఉంటుంది. 
19. అర్థ దూషకః కుబేరో2పి భవతి భిక్షాభాజనమ్.
అర్థ దూషకుడు సాక్షాత్తూ కుబేరుడే అయినా బిచ్చం ఎత్తుకొనవలసి వస్తుంది. 
20. అతి వ్యయః అపాత్రవ్యయశ్చ అర్థస్య దూషణమ్.
అతిగా వ్యయం చేయడం, అయోగ్యులైన వ్యక్తులకు ఇచ్చి వ్యయం చేయడం అర్థ దూషణము.
21. హర్షామర్షాభ్యామ్ అకారణం తృణాఙ్కురమపి నోపహన్యాత్; కిం పునర్మనుష్యమ్.
హర్షంచేతనో, కోపంచేతనో నిష్కారణముగా గడ్డి మొలకనికూడా చంపకూడదు; మనుష్యుని మాట చెప్పాలా?
22. శ్రూయతే హి-నిష్కారణం భూతావమానినౌ వాతాపిరల్వలశ్చాసురౌ అగస్త్యాత్యాసాదనాద్వినేశతురితి. 
నిష్కారణముగా ప్రాణుల్ని బాధించిన వాతాపి, ఇల్వలుడు అనే అసురులు అగస్త్యుని విషయంలో గూడా హద్దుమీరి ప్రవర్తించడం చేత నశించిరని వింటున్నాము గదా?
23. యథాదోషం కోటిరపి గృహీతా న దుఃఖాయతే; అన్యాయేన తృణశలాకాపి గృహీతా ప్రజాః ఖేదయతి
దోషాలు లేకుండగా (కష్ట పెట్టకుండగా) కోటి తిసికొన్నా ఏవిధంగా దుఃఖం కలిగించదో అదే విధంగా అన్యాయంగా ఒక గడ్డి పరక తీసికొన్నా ప్రజలకు దుఃఖం కలిగిస్తుంది. లేదా యథాదోషం అనగా చేసిన అపరాధాన్ని అనుసరించి అని అర్థం.  
24. తరుచ్చేదేన ఫలోపభోగః సకృదేవ.
చెట్టు తెగగొట్టి పళ్ళు తినడం ఒక్కమాటే జరుగుతుంది. 
25. ప్రజా విభవో హి స్వామినః ద్వితీయం భాణ్డాగారమ్; అతః యుక్తితః తముపయుఞ్జీత.
ప్రజల ఐశ్వర్యం అనేది రాజుకి రెండవ ధనాగారం. అందుచేత దానిని యుక్తితో ఉపయోగించుకోవాలి. 
26. రాజపరిగృహీతం తృణమపి పరేణ గృహీతం చేత్ కాఞ్చనీ భవతిః జాయతే చ పూర్వ సంచితస్య అర్థస్యాపహారః.
రాజు సొత్తు గడ్డి పరకే అయినా దాన్ని ఇతరులు గ్రహిస్తే బంగారం అవుతుంది (రాజు సొత్తు తృణము అపహరించినా బంగారం అపహరించినంత అపరాధంగా పరిగణింప బడుతుంది). దానితో అంతవరకూ ప్రోగుచేసికొన్న ధనం కూడా పోతుంది.
27. వాక్పారుష్యం శస్త్రపాతాదపి విశిష్యతే.
మాటలలో పరుషత్వం శస్త్ర ప్రహారం కంటే కూడా తీక్ష్ణ మైనది.
28. జాతివయోవృత్తవిద్యావిభవానుచితం హి వచనం వాక్పారుష్యమ్.
(తన లేదా ఎదుటివాని) జాతికి, వయస్సుకు, నడవడికకి ( లేదా ఉద్యోగానికి), ఐశ్వర్యానికి తగని వచనం వాక్పారుష్యమ్”.
29. స్త్రియమ్, అపత్యం, భృత్యం వా తథోక్త్యా వినయం గ్రాహయేత్ యథా హృదయప్రవిష్టాత్ శల్యాదివ వచనతో న తే దుర్మనాయన్తే.
స్త్రీకి గాని, సంతానానికి (పుత్రీ పుత్రాదులకు) గానీ, భృత్యుడికి గానీ వినయం ఎలా నేర్పాలంటే తను చెప్పిన మాటలు హృదయంలో ములుకుల వలె ప్రవేశించి వాళ్ళకు కష్టం కలిగించకుండా ఉండేటట్లు నేర్పాలి. 
30. వధః క్లేశః అర్థహరణం వా వ్యుత్క్రమేణ దణ్డ పారుష్యమ్. 
న్యాయ విరుద్ధంగా చంపడంగాని, బాధ పెట్టడం గాని, ధనం అపహరించడం గాని దండ పారుష్యం.

సంస్కృత భాషా ప్రచారసమితి, హైదరాబాదు వారిచే ప్రచురింపబడిన
నీతి వాక్యామృతం ( సోమదేవుని నీతి సూత్రాలు) అనే గ్రంథం నుండి సేకరణ.