31, మే 2013, శుక్రవారం

పద్య రచన - 358 (పొగ త్రాగెడువాఁడు)

ఈజోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినము

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. poga cooru needu tittulu
    pogulucu neevaaru tiTTi pOseda rakaTaa
    pogabeTTa vaari bratukuna
    poga riMgula kanabaDenu kapOlamu needE !

    రిప్లయితొలగించండి
  2. poga cooru needu tittulu
    pogulucu neevaaru tiTTi pOseda rakaTaa
    pogabeTTa vaari bratukuna
    poga valadane vadala nee kapOlamu kanumaa!

    రిప్లయితొలగించండి





  3. సెగచే నూపిరితిత్తుల
    రగిలించి నశింపజేయు ,రక్తము బీల్చున్,
    భుగభుగ మంచును గొలుసుగ
    పొగత్రాగెడువాడు దున్నపోతై పుట్టున్.

    రిప్లయితొలగించండి
  4. చూడ చిత్ర మందు నొకడు చుట్ట ద్రాగు
    చుండె నక్కట ! పొ గలను జూడు నింగి
    కెటుల రయ్యన నల్లగ నేగు చుండె ?
    చుట్ట ద్రాగిన కేన్సరు చుట్టు కొనును .

    రిప్లయితొలగించండి
  5. జగముల బ్రోవగ శంభుడు
    దిగ మ్రింగెడు వేళ విషము దిగ్గున దొణకెన్
    పొగ చెట్టై మొలచెను భువి
    పొగ త్రాగెడు వాడు బొమిక ప్రోవై పోవున్.

    రిప్లయితొలగించండి
  6. వ్యసనములను మానుమనుచు
    నసఁ బెట్టగ నేమి ఫలము? నా జిహ్వకు, మా
    నసమునకును తృప్తి యనుచు
    విసుగునుఁ జూపుచు జిరాకు పెంచుదురయ్యా.

    రిప్లయితొలగించండి
  7. పొగ రింగుల వలయమ్ములు
    గగనంబున కెగసి చాల కలుషిత మౌగా !
    సగ భాగము జనులకపుడు
    గగనం బౌ విషము వీడ గాజర యనగన్ !

    గాజర = పొగాకు

    రిప్లయితొలగించండి

  8. పొగను బీల్తురు కొందరు ఫోజులిచ్చి
    హాని కలిగించు సిగరెట్టు యనవరతము
    త్వరగ మరణించ వలెనన్న త్రాగు పొగను
    పొగను త్రాగిన కాన్సరు ముప్పు గలుగు



    రిప్లయితొలగించండి
  9. రింగు రింగుల పొగ రేపువాడొక్కఁడు
    *****ముక్కునుండి వదులు మూర్కుడొకఁడు
    మేఘాలు సృష్టించు మేథావియొక్కఁడు
    *****బంగుకలిపి దిగ మ్రింగునొకఁడు
    పెదవి మూలల నుండి వదులు వాడొక్కడు
    *****పరుల మోముననూదు వాడొకండు
    నింగిని జూచుచు నింపాదిగ నొకఁడు
    *****తత్తర పాటున త్రాగునొకఁడు

    గుప్పిట బిగించునొక్కడు గుంభనముగ
    తర్జనీ మధ్యమము మధ్య దాల్చు నొకఁడు
    బొటన చూపుడు సందున పూనునొకఁడు
    ఎన్ని రీతులు త్రాగునో యెన్న తరమె!!

    రిప్లయితొలగించండి
  10. ఆధు నికమంచు త్రాగెద రాడ వారు
    గర్భ మందలి శిశువున కౌను హాని
    పొగను బీల్చిన గుండెకు రగులు తెగులు
    విడువ దలచిన వదలదు నీడ వలెను

    రిప్లయితొలగించండి
  11. ఒక్కటి త్రాగక యొకటి రెండును రావు
    *****చాయి త్రాగెడి వేళ జతగ మారు
    చలిని త్రోలగ మరి వెలిగించునొక్కటి
    *****మనసు బాగుపఱుప దినుసునిదియె
    ఒంటరై యుండిన గంటకునొక్కటి
    *****వత్తిడి తగ్గింప వలయునొకటి
    అలసటే లేకుండ గొళుసు పగిది త్రాగు
    *****పరులు త్రాగుట జూడ పళ్లు లాగు

    మాటి మాటికి విదిలించు మసిని కసిగ
    చెంతనున్నచో చొక్కాకు చిల్లుబెట్టు
    ఉరము సగమై క్షయ గలుగ, కరము నరము
    పట్టు దప్పిన, చింతింప ఫలము గలదె?

    రిప్లయితొలగించండి
  12. జిగురువారు గుప్పు గుప్పున ఊది పడేశారు.

    రిప్లయితొలగించండి
  13. ధూమపానానికి వ్యతిరేకంగా మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు.....
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కమనీయం గారికి,
    సుబ్బారావు గారికి,
    మిస్సన్న గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    జిగురు సత్యనారాయణ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి