2, జూన్ 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1070 (వేదము లాఱని గణించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్.

17 కామెంట్‌లు:

  1. వేదములు నాల్గు; పంచమ
    వేదము భారతము గాగ, విదుడొకడు భువిన్
    వేదమె ’మార్క్సిజ” మిపుడని -
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
  2. మోదాత్ముం డొక్కండనె
    వేదము రామాయణమ్ము, వేదము భరతం
    బాదరణమ్మందెఁ గనుక
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  3. మేదిని ఋగ్వేదాదులు
    వాదము లేనట్టి నాల్గు, భారత మాయు-
    ర్వేదమ్ములు కలపినచో
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్!

    రిప్లయితొలగించండి

  4. ఆచార్య ఫణీంద్ర గారి స్ఫూర్తితో , గుండు మధుసూదన్ గారి బాటలోనే :

    వేదములు నాల్గు ; పంచమ
    వేదము భారతము గాగ విదుడొక డనుచున్
    “లేదా !? రామాయణ" మని
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
  5. వేదములు నాలు గైనను
    వేదమె యా భారతంబు వివ రింపంగన్
    వేదము రామాయణమును
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్ .

    రిప్లయితొలగించండి
  6. వేదములు నాలుగు ; ధను
    ర్వేదముతో గలిపి యైదు ; విధిగా నాయు
    ర్వేదమును చేర్చి యొక్కడు
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్!

    రిప్లయితొలగించండి
  7. వేద గణితమాధారముగ ఒక లెక్క చేయగా 6 ఫలితము వచ్చినదని చెప్పుచు ఇద్దరి సంభాషణ: (అన్వయము ఒకింత ఇబ్బందిగనే యున్నది)

    నీదు ఫలితంబు తప్పగు;
    నాదీ గణనమ్ము లెస్స; నయముగ దేలెన్
    గాదే నా కాధారము
    వేదము, లారని గణించె విజ్ఞులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  8. ఒక వేద విద్యార్థి --

    వేదములగు నాలుగు, నా
    వేదవ్యాసుడు పలికిన ప్రియభారతమున్,
    సాదరమగు గురువు పలుకు-
    వేదము లారని గణించె విజ్ఞులు మెచ్చన్ .

    రిప్లయితొలగించండి
  9. మేదిని హిందూ మతమున
    వాదంబులు లేక వెలుగు భారతమింకన్
    కాదనక రామచరితము
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  10. వేదములు త్రై వేద్యం బని
    యాదరముగ జేర్చి రంట యధర్వణ వేదం
    బాధార మగు రెండు గలిపి
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి



  11. వేదములు నాలుగు ధనుర్
    వేదముతో నైదు గాగ ,వెండియు నాయుర్
    వేదముతో గలిపినచో
    వేదములారని గణించె విజ్ఞులు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  12. వేదములు నాల్గు, పంచమ
    వేదము భారతము, షష్ఠ వేదమ్మా యు
    ర్వేదమ్మంచును తెలివిగ
    వేదములారని గణించె విజ్ఞులు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  13. వేదములు నాల్గు ఋగ్వే-
    దాదులు పంచమము భారతమ్మిక నాకున్
    వేదమె సతి పల్కని కవి
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి
  14. మేదిని భారత యుతములు
    వేదము లైదగుచు నొప్పు విస్సన పల్కుల్
    వేదము లందరికని కవి
    వేదము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి

  15. ఇ యం వేద, ప్రకృతి , పురుషః
    యం దు ప్రస్తుతించు ఋగ్, యజుర్
    వే ణువై సామ, విశ్లేషించు అధర్వే
    ద ము లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. కాదన లేనుర నాలుగె
    వేదము; లాఱని గణించె విజ్ఞులు మెచ్చన్
    వేదాంగమ్ములు: వ్యాకర
    ణాదులు ఛందస్సు, శిక్ష...నాకివె తెలియున్!

    రిప్లయితొలగించండి