13, జులై 2013, శనివారం

పద్య రచన – 401 (విదూషకుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు ‘పద్యరచన’కు అంశము....
“విదూషకుఁడు”
ఈ అంశాన్ని సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

8 కామెంట్‌లు:

  1. తనబాధలెన్నియున్నను
    మనబాధల మరచిపోవ మందిచ్చునుగా
    మనమందు విదూషకుడహ !
    వినరయ్యా నిలచిపోవు వేషము భాషల్.

    రిప్లయితొలగించండి
  2. పూర్వ కాలంబు నందున పృధివి యొద్ద
    హాస్య మంత్రి వి దూ షకు డ నగ నొకడు
    ఉండి , రాజులు సంతోష ముండు నటుల
    చూతు రెప్పుడు నిజమిది సుమ్ము నమ్ము

    రిప్లయితొలగించండి
  3. రాజకీయ వ్యూహ రచనలఁ బన్నుచు
    శత్రు భీతి తోడి సతమతమగు
    రాజ సభకు నంటు బూజును దులిపెడు
    గతి విధూష కునికి మతిన మెరయు!

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘రాజకీయ వ్యూహ’ అన్నప్పుడు ‘వ్యూ’కు ముందున్న ‘య’ గురువై గణదోషం ఏర్పడుతున్నది. సవరించండి.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారికి ధన్యవాదములు.
    తమరి సూచన ప్రకారం మొదటి పాద సవరణ తో మొదటి పాదం:
    'రాజకీయ తంత్ర రచనలఁ బన్నుచు'

    రిప్లయితొలగించండి
  6. లేని నవ్వు తెచ్చి లాఫింగుధెరఫీగ
    యోగ యనుచు రోగి యోగి ఆయె
    వికటకవిని బోలు విదూషకులేరయ
    విశ్వమందు నవ్వు విగతజీవి

    రిప్లయితొలగించండి
  7. గుండె నిండ వెతలు గూడు గట్టిన గాని
    బండ బారి తాను మొండి గాను
    నగవు పులిమి గొప్ప నాట కీయము జేసి
    వికట కవిగ నెపుడు వెలయు చుండు

    రిప్లయితొలగించండి
  8. సహదేవుడు గారూ,
    మీ సవరణ బాగుంది.
    *
    శైలజ గారూ,
    మంచి భావంతో పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    మొదటి పదంలో యతి తప్పింది. ‘లాగి నవ్వు తెచ్చి లాఫింగు థెరఫీగ’ అందాం.
    మూడవ పాదంలో ‘విదూషకు’ అని గణదోషం. ‘వికటకవిని బోలు నొక విదూషకు డేడి’ అంటే సరి!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి