28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1337 (తలఁ దొలఁగించిన శుభమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తలఁ దొలఁగించిన శుభమ్ము తప్పక కలుగున్.

పద్య రచన – 521

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

27, ఫిబ్రవరి 2014, గురువారం

"నమశ్శివాయ"
రచన
నేమాని రామజోగి సన్యాసి రావు

నమశ్శివాయ యంచు బల్కినన్ మనమ్ము శోభిలున్
నమశ్శివాయ యంచు బల్కినన్ జెలంగు వాక్కులున్
నమశ్శివాయ యంచు బల్కినన్ ఫలించు కార్యముల్
నమశ్శివాయ మంత్రమున్ మనమ్మునన్ జపించెదన్

నమశ్శివాయ యంచు బల్కినన్ దొలంగు కష్టముల్
నమశ్శివాయ యంచు బల్కినన్ నశించు పాపముల్
నమశ్శివాయ యంచు బల్కినన్ ఫలించు భాగ్యముల్
నమశ్శివాయ మంత్రమున్ మనమ్మునన్ జపించెదన్

నమశ్శివాయ యంచు బల్కినన్ వరించు యోగముల్
నమశ్శివాయ యంచు బల్కినన్ లభించు సద్గతుల్
నమశ్శివాయ యంచు బల్కినన్ హరించు జన్మముల్
    నమశ్శివాయ మంత్రమున్ మనమ్మునన్ జపించెదన్     

శివ స్తుతి

శివ స్తుతి
రచన
నాగరాజు రవీందర్
: భుజంగ ప్రయాతం :
చిదానంద రూపం త్రినేత్రాభిరామం
సదా లోకరక్షం పరం వేదసారం
సదాకారమేకం సదానందరూపం
సదా భక్తపాలం హృదా భావయామి

మహేశం గిరీశం సచంద్రావతంసం
మహాశైల వాసం భవానందసారం
మహాదేవ దేవం శివం నాగభూషం
మహా విశ్వనాథం సదా భావయామి

భజే పంచవక్త్రం జటాజూటశీర్షం
భజే వామదేవం పురా ఆదిభిక్షుం
భజే భూతనాథం ధృతం నీలకంఠం
భజే పాపనాశం సదా త్వాం స్మరామి

మనుష్యాది జీవాత్మకం ప్రాణభూతం
మునీంద్రాదిభి: పూజితం త్వాం నటేశం
అనంతం భవంతం భజేహం భజేహం
ధనేశాప్తమిత్రం ధరాధీశవాసం

మదీయాత్మవేద్యం రమాకాంతవంద్యం
సదా సాధురక్షం మహా శూలపాణిం
హృదంతస్థ రూపం మహా వ్యోమకేశం
ఇదానీ మ్యహం శంకరం ప్రార్థయామి

శివస్తోత్రము

శివస్తోత్రము
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు


వందనమ్ము సుధాంశుశేఖర! వందనమ్ము కృపాకరా!
వందనమ్ము హిమాద్రిమందిర! వందనమ్ము శుభంకరా!
వందనమ్ము భుజంగభూషణ! వందనమ్ము సనాతనా!
వందనమ్ము జగత్త్రయీశ్వర! పార్వతీ హృదయేశ్వరా!

వందనమ్ము సురేంద్రవందిత! వందనమ్ము జగత్పితా!
వందనమ్ము శ్రితార్తినాశక! వందనమ్ము పరాత్పరా!
వందనమ్ము భవామయాపహ! వందనమ్ము త్రిలోచనా!
వందనమ్ము జగత్త్రయీశ్వర! పార్వతీ హృదయేశ్వరా!

వందనమ్ము సరోజబాంధవ వార్ధిజానల లోచనా!
వందనమ్ము మహాఫలప్రద! వందనమ్ము శ్రితావనా!
వందనమ్ము సురాగపాధర! వందనమ్ము సదాశివా
వందనమ్ము జగత్త్రయీశ్వర! పార్వతీ హృదయేశ్వరా!

సమస్యాపూరణం - 1336 (హరికి భార్య)

కవిమిత్రులారా,
మహాశివరాత్రి శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరికి భార్య పర్వతాత్మజ యుమ.

పద్య రచన – 520

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, ఫిబ్రవరి 2014, బుధవారం

దేవీస్తోత్రము

దేవీస్తోత్రము

శ్లో:
యా మామనంతి మునయః ప్రకృతిం పురాణీం
విద్యేతి యాం శ్రుతిరహస్య విదో వదంతి
తామర్థ పల్లవిత శంకర రూప ముద్రాం
దేవీ మనన్య శరణ శ్శరణం ప్రపద్యే.

స్వేఛ్ఛానువాదము
నేమాని రామజోగి సన్యాసి రావు

ఏ తల్లి గూర్చి మునీశ్వరు లందురో
    ప్రకృతి మాతయని పురాణి యనుచు
నే దేవినిన్ గూర్చి వేదసార విదులు
    తెలతురో విద్యాధిదేవి యనుచు
నే జగన్మాత విశ్వేశ్వరు దేహాన
    వామార్థ భాగమై పరగుచుండు
నే పరాదేవత యితరు లీయగలేని
    భద్రత గూర్చును భక్త తతికి
నా మహాదేవి నాది మధ్యాంతరహిత
ప్రణవమూర్తి పరంజ్యోతి పరమఫలద
నఖిల భువనాధిదేవత నాదరమున
దలచి శరణంబు వేడుదు తత్పదముల.

సమస్యాపూరణం - 1335 (ఆఁడుకోఁతియై యింటింట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఆఁడుకోఁతియై యింటింట నాడె వాణి.
(‘వానరీ మివ వాగ్దేవీం నర్తయంతి గృహే గృహే’ కు ఆంధ్రీకరణము)

పద్య రచన – 519

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1334 (పుణ్యకర్ముఁడు నరకమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పుణ్యకర్ముఁడు నరకమ్ముఁ బొంది వగచె.

పద్య రచన – 518

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1333 (వృద్ధురాలిని వధియించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వృద్ధురాలిని వధియించె బుద్ధుఁ డలిగి.

పద్య రచన – 517 (కుక్కతోక)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
కుక్కతోక.

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

శివ అష్టోత్తర శత నామావళి

శివ అష్టోత్తర శత నామావళి
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు
సీసమాలిక:
శ్రీమన్మహేశాయ, శ్రీమహాదేవాయ,
    శ్రీకంథరాయ, గౌరీప్రియాయ,
ఆదిదేవాయ, దేవాధిదేవాయ, లో
    కాధినాయక నిచయార్చితాయ,
ప్రణవ స్వరూపాయ, పరమార్థ ఫలదాయ,
    సచ్చిదానందాయ, శాశ్వతాయ,
కైలాసవాసాయ, కరిచర్మ వసనాయ,
    భూతనాథాయ, సనాతనాయ,
చంద్రరేఖావిభూషాయ, గిరీశాయ,
    పంచ వక్త్రాయ, శుభంకరాయ,
నందీశ వాహాయ, నాగేంద్ర హారాయ,
    అభ్రకేశాయ, దిగంబరాయ,
ఆద్యాయ, వేదాంత వేద్యాయ, హృద్యాయ,
    జ్ఞాన నిధానాయ, శంకరాయ,
రుద్రాయ, జగదేక భద్రాయ, కరుణా స
    ముద్రాయ, బంధ విమోచనాయ,
అక్షర రూపాయ, రక్షాయ, సాంబాయ,
    కాలకాలాయ, జగద్ధితాయ,
ఆనంద సాంద్రాయ, మౌనిసంభావ్యాయ,
    వేదస్వరూపాయ, విధినుతాయ,
మృత్యుంజయాయ, సంశ్రితపారిజాతాయ,
    వైద్యనాథాయ, శుభంకరాయ,
నాద ప్రమోదాయ, నటరాజ రూపాయ,
    సకల కళాద్భుత సంచయాయ,
త్రిభువన నాథాయ, త్రిపురాసురహరాయ,
    లయకారకాయ, పరాత్పరాయ,
సర్వాంతరాత్మనే, సర్వ స్వరూపాయ,
    శర్వాయ, యక్షేశ సంస్తుతాయ,
దక్షాత్మజేశాయ, దక్షాధ్వరఘ్నాయ,
    దీక్షితాయ, హరాయ, త్రిణయనాయ,
కామవినాశాయ, కామిత వరదాయ,
    కామేశ్వరాయ, గంగాధరాయ,
అష్టరూప ధరాయ, శిష్టలోక హితాయ,
    సింధురాస్య షడాస్య సేవితాయ,
తాండవలోలాయ, తాపత్రయఘ్నాయ,
    ప్రమథార్చితాయ, సంపత్ప్రదాయ,
దివిజేంద్ర వినుతాయ, తేజోనిధానాయ,
    పూర్ణాయ, భువనేశ పూజితాయ,
సారంగ హస్తాయ, శరభేంద్ర వేషాయ,
    పరమేశ్వరాయ, సద్గురువరాయ,
దీనార్తి నాశాయ, దివ్యస్వరూపాయ,
    వాగీశవినుతాయ, భవహరాయ,
శాంతస్వరూపాయ, సాధులోక హితాయ,
    భక్తప్రియాయ, సౌభాగ్యదాయ,
విశ్వాధినాథాయ, విద్యాస్వరూపాయ,
    విబుధార్చితాయ, సంవిత్ప్రదాయ,
సత్యాయ, నిత్యాయ, సర్వ శరణ్యాయ,
    శూలాయుధధరాయ, సురహితాయ
సోమాయ, భీమాయ, శుద్ధాయ, బుద్ధాయ,
    భర్గాయ, పార్వతీ వల్లభాయ,
తే.గీ.
మంజునాదప్రియాయ, నమశ్శివాయ
మారదర్ప హరాయ, నమశ్శివాయ
మంగళ ఫలప్రదాయ, నమశ్శివాయ
మన్మనోమందిరాయ నమశ్శివాయ

సమస్యాపూరణం - 1332 (హారతి గైకొనిన లక్ష్మి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హారతి గైకొనిన లక్ష్మి యమపురి కేగెన్.  
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవదాలు.

పద్య రచన – 516 (వేరుపడిన సోదరులు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
వేరుపడిన సోదరులు. 

22, ఫిబ్రవరి 2014, శనివారం

శ్రీమాతృ స్తుతి

శ్రీమాతృ స్తుతి
రచన
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు 


భుజంగప్రయాతము:
మహావారిజాతాటవీ మధ్య సంస్థాం
మహానంద సాంద్రాం మహావిశ్వనేత్రీం
మహాయోగదాత్రీం స్ఫురద్దివ్య గాత్రీం
మహర్షి వ్రజారాధితాం భావయామి    

సహస్రాక్ష ముఖ్యామర స్తూయమానాం
సహస్రాంశు శీతాంశు వహ్ని త్రినేత్రాం
సహస్రాంశు కోటి ప్రభాపూర్ణ గాత్రీం
సహస్రార పద్మాసనస్థాం నమామి

శివాం శ్రీకరీం సింహరాజాధిరూఢాం
భవానీం భవాంబోధి పోతాం శరణ్యాం
వివేకప్రదాం వేద వేదాంతవేద్యాం
నవీనేందు భూషాం త్రినేత్రాం నమామి

చిదగ్నిప్రభూతాం సరోజాత హస్తాం
చిదానంద రూపాం మనోరూప చాపాం
సదా లోక రక్షైక దక్షాం భవానీం
హృదంభోరుహస్థాం మహేశీం నమామి

అకారాది సర్వాక్షరాకార యుక్తాం
త్రికూటాత్మికాం శుద్ధవిద్యా స్వరూపాం
త్రికాలాంచిత జ్ఞాన సంపత్సమృద్ధాం
త్రికోణాంతరస్థాం త్రివర్ణాం నమామి

సమస్యాపూరణం - 1331 (ముట్లుడిగిన రాధకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా!
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవదాలు.

పద్య రచన – 515

కవిమిత్రులారా,

పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1330 (కాననివాని నూఁత గొని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాననివాని నూఁత గొని కాననివారలు పొంది రున్నతిన్.

పద్య రచన – 514

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20, ఫిబ్రవరి 2014, గురువారం

శ్రీ లలితా స్తుతి



శ్రీ లలితా స్తుతి
రచన

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

 ఇంద్రవజ్ర

శ్రీమాతృ మూర్తిం లలితాం నమామి

శ్రీమన్మహేశీం లలితాం నమామి

శ్రీం బీజ వాచ్యాం లలితాం నమామి

శ్రీచక్ర సంస్థాం లలితాం నమామి



వేదస్వరూపాం లలితాం నమామి

వేదాంతవేద్యాం లలితాం నమామి

నాదప్రియాం శ్రీ లలితాం నమామి

మోదప్రదాం శ్రీ లలితాం నమామి



లోకాధినేత్రీం లలితాం నమామి

నాకేశవంద్యాం లలితాం నమామి

రాకేందువక్త్రాం లలితాం నమామి

శ్రీకల్ప వల్లీం లలితాం నమామి



కామేశపత్నీం లలితాం నమామి

సోమార్క నేత్రాం లలితాం నమామి

ప్రేమస్వరూపాం లలితాం నమామి

కామప్రదాత్రీం లలితాం నమామి



ఉపేంద్రవజ్ర

పరాం పరేశీం లలితాం నమామి

సరోజనేత్రాం లలితాం నమామి

పురత్రయేశీం లలితాం నమామి

స్మరప్రపూజ్యాం లలితాం నమామి



సదాశివేశీం లలితాం నమామి

హృదంబుజస్థాం లలితాం నమామి

సదా ప్రసన్నాం లలితాం నమామి

చిదగ్నిజాతాం లలితాం నమామి



ఇంద్రవజ్ర

స్మేరాననాం శ్రీ లలితాం నమామి

కారుణ్య మూర్తిం లలితాం నమామి

నీరేజనేత్రాం లలితాం నమామి

గౌరీం భవానీం లలితాం నమామి



దేవీం మదంబాం లలితాం నమామి

భావాభిరామాం లలితాం నమామి

సౌవర్ణ గాత్రీం లలితాం నమామి

దేవేంద్ర వంద్యాం లలితాం నమామి



శ్రీమాతృ మూర్తిం లలితాం నమామి

శ్రీమాతృ మూర్తిం మనసా స్మరామి

శ్రీమాతృ మూర్తిం సతతం భజామి

శ్రీమాతృ పాదౌ శరణం వ్రజామి

సమస్యాపూరణం - 1329 (రాముని పాదముల వ్రాలె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముని పాదముల వ్రాలె రాముఁడు భక్తిన్.

పద్య రచన – 513

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1328 (అమృతమ్మో ప్రాణఘాతము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అమృతమ్మో ప్రాణఘాత మగు గరళమ్మో?

పద్య రచన – 512

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

జన్మదిన శుభాకాంక్షలు!



సహజకవి, సౌమ్యులు, గురుతుల్యులు
శ్రీమాన్ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి
జన్మదిన శుభాకాంక్షలు!
నిజసత్కవితాంచితబు

ద్ధిజీవునకు నేఁడు జన్మదిన శుభకాంక్షల్

సుజనస్తుత పండిత రా

మజోగి సన్యాసి రావు మహితాత్మునకున్.

మిత్రులకు గమనిక
ఆంగ్లకాలమానం ప్రకారం ఈరోజు మాన్యశ్రీ నేమాని వారి పుట్టిన రోజు.
కాని వారు హిందూకాలమానం ప్రకారం
మాఘ బహుళ నవమి (23-2-2014) ఆదివారం నాడు
అమెరికాలోని న్యూజెర్సీలో బంధుమిత్రుల సమక్షంలో
తమ (సప్తతి) జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

సమస్యాపూరణం - 1327 (చంద్రబింబమ్ములోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చంద్రబింబమ్ములోన భాస్కరుఁడు వెలిగె.

పద్య రచన – 511

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1326 (వార మన రెండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వార మన రెండు దినములు వారిజాక్ష.

పద్య రచన – 510

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1325 (తల్లినిఁ గూడి చిత్రముగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తల్లినిఁ గూడి చిత్రముగఁ దామరసాక్షులఁ గాంచె మువ్వురన్.

పద్య రచన – 509

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15, ఫిబ్రవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1324 (దుష్టాచారములె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దుష్టాచారములె ముక్తి దొరకొనఁ జేయున్.

పద్య రచన – 508

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

దత్తపది - 37 (సభ-బిల్లు-ప్రతినిధి-తగవు)

కవిమిత్రులారా!
సభ - బిల్లు - ప్రతినిధి - తగవు
పై పదాలను ఉపయోగిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో
కౌరవసభలో శ్రీకృష్ణుని హితబోధపై పద్యం వ్రాయండి.

పద్య రచన – 507

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13, ఫిబ్రవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1323 (భగవద్గీతయె విషమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్.

పద్య రచన – 506 (మేడారం జాతర)

కవిమిత్రులారా,

పై చిత్రములను పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12, ఫిబ్రవరి 2014, బుధవారం

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ
రచన
నేమాని రామజోగి సన్యాసి రావు

ఇంద్రవజ్ర:
ఓంకార వాచ్యాయ నమశ్శివాయ
సత్య స్వరూపాయ నమశ్శివాయ
చైతన్య భావాయ నమశ్శివాయ
ఆనంద సాంద్రాయ నమశ్శివాయ


శైలేంద్రజేశాయ నమశ్శివాయ
శైలాధివాసాయ నమశ్శివాయ
బాలేందుచూడాయ నమశ్శివాయ
త్రైలోక్య నాథాయ నమశ్శివాయ

యోగేశ్వరేశాయ నమశ్శివాయ
నాగేంద్ర హారాయ నమశ్శివాయ
యోగాగ్ని నేత్రాయ నమశ్శివాయ
వాగీశ వంద్యాయ నమశ్శివాయ

శ్రీవిశ్వనాథాయ నమశ్శివాయ
దేవాధిదేవాయ నమశ్శివాయ
భావోద్భవఘ్నాయ నమశ్శివాయ
శ్రీవల్లభాప్తాయ నమశ్శివాయ

ఆద్యాయ నిత్యాయ నమశ్శివాయ
హృద్యాయ దివ్యాయ నమశ్శివాయ
వైద్యాధినాథాయ నమశ్శివాయ 
విద్యాస్వరూపాయ నమశ్శివాయ 

త్ర్యక్షాయ రక్షాయ నమశ్శివాయ
ఉక్షేశ వాహాయ నమశ్శివాయ
దక్షాధ్వరఘ్నాయ నమశ్శివాయ
యక్షేశ్వరాప్తాయ నమశ్శివాయ

రుద్రాయ దేవాయ నమశ్శివాయ

భద్రాయ విశ్వాయ నమశ్శివాయ
అద్రీంద్ర వాసాయ నమశ్శివాయ
అద్రీంద్ర చాపాయ నమశ్శివాయ 

వేదస్వరూపాయ నమశ్శివాయ
వేదాంత వేద్యాయ నమశ్శివాయ
నాద ప్రమోదాయ నమశ్శివాయ

వేదండ హంత్రేచ  నమశ్శివాయ

చేతోబ్జ వాసాయ నమశ్శివాయ
ఖ్యాత ప్రభావాయ నమశ్శివాయ
శీతాంశు భూషాయ నమశ్శివాయ
జ్యోతిస్వరూపాయ నమశ్శివాయ

ఉపేంద్రవజ్ర:

శివాయ సాంబాయ నమశ్శివాయ 
భవాయ శర్వాయ నమశ్శివాయ
గవీశ వాహాయ నమశ్శివాయ
భవప్రణాశాయ నమశ్శివాయ

హరాయ దేవాయ నమశ్శివాయ
పురాసురఘ్నాయ నమశ్శివాయ
కురంగ హస్తాయ నమశ్శివాయ

స్మర ప్రణాశాయ నమశ్శివాయ 

సమస్యాపూరణం - 1322 (మన మన మన మనమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మన మన మన మనమె మనమె మన మన మనమే.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 505

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెవికీ ఆహ్వానం


తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2013న పది వసంతాలు పూర్తి చేసుకున్నదని అందరికీ విదితమే. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వికీపీడియనులను ఒక వేదిక మీదకు తెచ్చి సత్కరించాలనే సంకల్పంతో తెలుగు వికీపీడియా క్రియాశీల సభ్యులు, వికీమీడియా భారతదేశ చాప్టర్, తెలుగు వికీపీడియా విశేష అభివృద్ధి జట్టు మరియు సీఐఎస్-ఏ2కే సంయుక్తంగా దశాబ్ది వేడుకలను విజయవాడలో నిర్వహించనున్నారు. 
ఈ వేడుకలు 2014 ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలలో విజయవాడలోని కేబీయన్ కళాశాల ప్రాంగణంలో జరుగనున్నాయి. 
అందరికీ ఇదే మా ఆ
హ్వానం. 
దయచేసి మీకు తెలిసిన తెలుగు మిత్రులకు , తెలుగు భాషా ప్రేమికులకు లను తెవికీ దశాబ్ది ఉత్సవాల గురించి తెలియ చేయడి. 
ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఉపయోగించుకోవడం, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియాలోని విశేష వ్యాసాలతో కూడిన సీడీని కూడా ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నాం. తెలుగులో అపూర్వ విజ్ఞాన సంపదను సేకరించే ఈ మహా ప్రయత్నంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు, ఆదరించి, ప్రోత్సహించిన సమాజంలోని వ్యక్తులు, సంస్థలందరికి వికీపీడియా దశాబ్ది సందర్భంగా ధన్యవాదాలు. తెవికీ విజ్ఞానగనిలా విలసిల్లి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందాలని కోరిక. 

పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశం లోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ దశాబ్ది మహోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

అందరం ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాము
అందరికీ ఆహ్వానం

ఇట్లు
తెవికీ దశాబ్ది కార్యవర్గం 

సమస్యాపూరణం - 1321 (మగని జడలోన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మగని జడలోన మందార మాల ముడిచె.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 504

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1320 (పులి గడ్డిని మేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పులి గడ్డిని మేయు మాంసమును దిను జింకల్.

పద్య రచన – 503

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1319 (నరసింహునిఁ బిలువ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నరసింహునిఁ బిలువఁ బలుకు నరకాసురుఁడే.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

పద్య రచన – 502

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, ఫిబ్రవరి 2014, శనివారం

పద్య రచన – 501

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(లక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు)

సమస్యాపూరణం - 1318 (అక్కకు సాటి యొక్కొ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అక్కకు సాటి యొక్కొ యెవరైనను రూప విలాస సంపదన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సమస్యాపూరణం - 1317 (మేక మెడచన్నుపాలతో)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మేక మెడచన్నుపాలతో మేలు గలుగు.
ఈ సమస్యను పంపిన కొదుమగొండ్ల వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు.

6, ఫిబ్రవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1316 (ద్రుపదరాట్పుత్రి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ద్రుపదరాట్పుత్రి కర్ణుని తోడఁబుట్టు.

5, ఫిబ్రవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1315 (మానవతీలలామ కభిమానమె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మానవతీలలామ కభిమానమె చాలును చీర యేటికిన్.
(ఇది ప్రసిద్ధమైన సమస్య. ఎన్నో అవధానాలలో ఇవ్వబడినదే. ఇప్పటికే మన బ్లాగులో ఇవ్వలేదు కదా!)

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

సమస్యాపూరణం - 1314 (కాలొక్కటె కలదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాలొక్కటె కలదు మూడుకన్నులదొరకున్.

3, ఫిబ్రవరి 2014, సోమవారం

సమస్యాపూరణం - 1313 (రాత్రి యర్ఘ్య మిడెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుఁడు.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1312 (పరశురాముఁడు నిర్జించె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పరశురాముఁడు నిర్జించెఁ బాండవులను.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

1, ఫిబ్రవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1311 (రామ యనెడి నోరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామ యనెడి నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.