11, ఫిబ్రవరి 2014, మంగళవారం

పద్య రచన – 504

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

31 కామెంట్‌లు:

  1. కలదు శివలింగ మొక తటాకంబులోన
    చాల ఎత్తుగ నటకు పూజారి యొక్క
    డర్చనము చేయు వేడ్కతో నరుగు దెంచి
    నమక చమకాలు వల్లించి నతులొనర్చె

    రిప్లయితొలగించండి
  2. జల లింగము నొక బాపడు
    బలిమిగ పూజించ గోరి భక్తిని వెడలెన్
    కలనై ననుతల పింపక
    విలసిల్లెడు భవుని గాంచి విస్మయ మొందెన్

    రిప్లయితొలగించండి
  3. గంగాధరుడా యేమిది
    గంగమ్మను దించినావ కలతను బరువై
    కంగారేమియు పడక ని
    జంగా నీ పూజ జేతు నీమము తోడన్ .

    రిప్లయితొలగించండి

  4. బోడి లింగము బోడి గుండు
    వ్యాప్త లింగము బోడి గుండు
    అవ్యాప్తము అనంతముగ నుండు
    గుండు కి సరి లింగము జోడు !

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. రేయి గంగమ్మ వరదతో రెచ్చిపోవ
    నిండె గుడికూడ నుబికిన నీటి తోడ
    నిత్య పూజలు జేసేటి నిష్టపరుడు
    బడుగు బాపడు పూజించె భక్తి తోడ


    రిప్లయితొలగించండి
  6. కాపాడంగను లోకముల్, కదలుమా గంగాధరా! సర్వదా
    మా పాలంబడు కష్టముల్ తొలుగగా మమ్మేలరా!శంకరా!
    కాపాలీశ్వర!కంటి నిన్ పృథివి,నాకాశమ్మునన్నిండగా!
    నీ పూజాకుసుమంబునైనను నదే నే భాగ్యమందున్ శివా!

    రిప్లయితొలగించండి
  7. గంగను తలనిడు దేవా!
    గంగను మునిగితివదేమి కారణ మేమో
    నింగిని తాకెడు రూపున
    జంగమ దేవర నినుగని జన్మ తరించెన్

    రిప్లయితొలగించండి
  8. జలముగ గరళము ద్రాగెను
    జలజల పరుగిడు సురనది జడలో ముడిచెన్
    జలజారినిసిగనుదొడిగె
    జలలింగాకృతినికనగ చాలవె కనులున్

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నిజంగా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘పడకను/ జంగమ దేవర నుతింతు సద్భక్తుడనై’ అందామా?
    *
    జిలేబీ గారూ,
    భావం బాగానే ఉంది. దీనిని మిత్రులెవరైనా పద్యంగా మారుస్తారో చూడాలి.
    *
    అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘జేసేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నిష్ఠాపరుడు’ అనవలసింది. అక్కడ ‘జేసెడి నియమశీలి’ అందాం.
    *
    లక్ష్మీదేవి గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. నడుము వరకున్న నీటిలో నడుచుకుంటు
    వృద్ధ బ్రాహ్మను డొక్కడు శుద్ధ భక్తి
    భావ నాత్ముడై జేయును పరమ శివుని
    లింగ పూజను నిత్యము లొంగ డెపుడు.

    రిప్లయితొలగించండి
  11. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘నడుచుకుంటు’ అన్నదానిని ‘నడచి వచ్చి’ అనండి. బ్రాహ్మనుడు టైపాటు... ‘లొంగి యెపుడు’కు ‘లొంగి డెపుడు’ టైపాటా? లేక ప్రత్యేకార్థం ఉందా?

    రిప్లయితొలగించండి
  12. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు
    సూచనలకు ధన్యవాదములు. తొసగులు సవరించాను . ''లొంగ డెపుడు'' వెనుదీయడు
    అను అర్థముతో వ్రాశాను.


    నడుము వరకున్న నీటిలో నడచి వచ్చి
    వృద్ధ బ్రాహ్మణు డొక్కడు శుద్ధ భక్తి
    భావ నాత్ముడై జేయును పరమ శివుని
    లింగ పూజను నిత్యము లొంగ డెపుడు.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారు,
    ధన్యవాదాలు.

    మిత్రులు జలలింగమనడం చూసినాక ఐదురోజులు వరుసగా ఐదు రూపాలలో ఇస్తే బాగుంటుందనిపిస్తుంది.
    మాఘమాసం విశేషం. :)
    శైలజ గారు, రెండవ పద్యం అందంగా ఉంది. మొదటి పద్యమూ బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్సులు. తమరిచ్చిన సూచనలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. సురగంగ తలను దాల్చెడి
    ధరవారల బ్రోచునట్టి దైవము తానా
    కరుణామయు డిచ్చోటను
    సరసుండై నిలిచియుండె జలమధ్యమునన్. 1.

    జలమించుక శిరమందున
    చిలికిన పరితుష్టుడౌచు సిరులొసగెడి యా
    నెలవంక దాల్చు దేవర
    జలమధ్యమునందు నిలిచె సర్వార్థదుడై. 2.

    సర్వోన్నతుడై వెలిగెడు
    సర్వేశుడు లింగమూర్తి జలసంస్థితుడై
    యుర్వీతలమున హర్షము
    పర్వంగా నిలిచియుండె పరమప్రీతిన్. 3.

    జలమే ప్రాణాధారము,
    జలమయ మీ కువలయంబు, జలమంతటికిన్
    బల మొసగు ననుటకేమో
    జలమధ్యమునందు నిలిచె శంకరు డిచటన్. 4.

    లింగాకారా! శర్వా!
    మంగళములు కూర్చుకొరకు మనుజుల కిలలో
    నంగీకరించి యుంటివి
    సంగంబుల ద్రుంచి యిమ్ము సత్పదము శివా! 5.

    శివ! శంకర! యభయంకర!
    భవబంధము తొలగద్రోచి భక్తజనాలన్
    భువిపై కావంగా దగు
    నవతేజ మొసంగుచుండి నానాగతులన్. 6.

    వందన మార్యాసన్నుత!
    వందనమో జగదధీశ! వందనము హరా!
    వందనము చంద్రశేఖర!
    వందనములు స్వీకరించు ప్రమథాధిపతీ! 7.

    నీవే సర్వేశ్వరుడవు,
    నీవే మము బ్రోవగలవు నిర్మలమూర్తీ!
    కైవల్యద! మృత్యుంజయ!
    రావా మముగావ బూని రయమున నేడున్. 8.

    క్రమముగా నినుగొల్తు నమకమంత్రాలతో
    ..........కామితంబులు దీర్చు వామదేవ!
    సద్భక్తి గీర్తింతు చమకపాఠముతోడ
    ..........సంతోష మందించు సర్వగతుల
    పురుషసూక్తంబుతో నిరతాభిషేకంబు
    ..........జరుపుచుండెద నీకు వరములిమ్ము
    వేయినామాలతో వినుతింతు నిన్నెంతొ
    ..........అభయ మందగజేసి విభవమిమ్ము
    ఎల్లవేళల నీనామ మెందు దలతు,
    నిన్నె భావింతు, సేవింతు,సన్నుతింతు
    సత్త్వ మందించి సర్వథా సాకుమయ్య
    ప్రణతులనుగొని కైలాసవాస! శూలి! 9.

    మహితలింగమ వౌచు మానవాళిని బ్రోవ
    ..........యుర్విపై స్థిరుడవై యున్న నిన్ను
    ఆడంబరములేని యల్పసంతోషిగా
    ..........ఘనమైన సత్కీర్తి గన్న నిన్ను
    బిల్వపత్రములూని పిలుచుచుండెద నయ్య!
    ..........పలికి కావుము దేవ! నిలిచి నన్ను
    ఆకాశగంగతో నభిషేక మొనరింతు
    .........నభయమిచ్చుచు ద్రుంచు మఘములన్ని
    హర! మహాదేవ! సర్వావయవములందు
    నిష్ఠబూనుచు భావింతు నిన్ను సతము
    హృదయ నైర్మల్యమును గూర్చి సదమలమగు
    భావసంపత్తి చేకూర్చి కావుమయ్య!

    రిప్లయితొలగించండి
  16. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    ఏ పద్యాని కాపద్యం ప్రత్యేకతను సంతరించుకున్న అద్భుతమైన ఖండికను వ్రాశారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
    2వ పాదములో దూరము నుండే అను ప్రయోగము బాగుగ లేదు. దానికి బదులుగా "స్తుతి జేయుచు దా" అందామా?
    స్వస్తి.

    రిప్లయితొలగించండి

  18. స్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు: శుభాశీస్సులు.
    భక్తిపూర్వకమైన చక్కని ఖండికను శివునిపై వ్రాసేరు. అభినందనలు. చాల బాగుగ నున్నవి పద్యములు. "ఎల్ల వేళల నీ నామ మెందు దలతు" అనుచోట అన్వయమునకు ఇబ్బంది కనిపించుచున్నది. ఆ ఇబ్బందిని తొలగించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    నేమాని వారి సూచనను గమనించండి.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    నేమాని వారు పేర్కొన్న పాదాన్ని ‘ఎల్లవేళల నీ నామమే తలంతు’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  20. ఓం నమశ్శివాయ

    ఇంద్రవజ్ర:
    ఓంకార వాచ్యాయ నమశ్శివాయ
    సత్య స్వరూపాయ నమశ్శివాయ
    చైతన్య భావాయ నమశ్శివాయ
    ఆనంద సాంద్రాయ నమశ్శివాయ

    శైలేంద్రజేశాయ నమశ్శివాయ
    శైలాధివాసాయ నమశ్శివాయ
    బాలేందుచూడాయ నమశ్శివాయ
    త్రైలోక్య నాథాయ నమశ్శివాయ

    యోగేశ్వరేశాయ నమశ్శివాయ
    నాగేంద్ర హారాయ నమశ్శివాయ
    యోగాగ్ని నేత్రాయ నమశ్శివాయ
    వాగీశ వంద్యాయ నమశ్శివాయ

    శ్రీవిశ్వనాథాయ నమశ్శివాయ
    దేవాధిదేవాయ నమశ్శివాయ
    భావోద్భవఘ్నాయ నమశ్శివాయ
    శ్రీవల్లభాప్తాయ నమశ్శివాయ

    ఆద్యాయ నిత్యాయ నమశ్శివాయ
    హృద్యాయ దివ్యాయ నమశ్శివాయ
    వైద్యాధినాథాయ నమశ్శివాయ
    విద్యాస్వరూపాయ నమశ్శివాయ

    రిప్లయితొలగించండి
  21. ఆర్యా!
    ప్రశంసకు ధన్యవాదములు,
    సూచనకు, సవరణకు కృతజ్ఞతాభివాదములు.

    రిప్లయితొలగించండి
  22. ఆర్యా!
    పండితులవారి "ఓం నమశ్శివాయ"-ఇంద్రవజ్ర - అద్భుతముగా నున్నది.
    అభివాదములు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
    పరమశివునిపై మంచి పద్యమును ఆవిష్కరించేరు. అభినందనలు.
    2వ పాదములో "తొలగగా" అని ఉండాలి కదా -- తొలుగుగా అనుట టైపు పొరపాటు అనుకొంటాను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. కవివర్యులకు వందనములు.
    తొలుగు గా అని వ్రాయలేదు. తొలుగగా అని వ్రాసినాను.
    తొలుగగా తొలగగా రెండు ఒకటే అనుకుంటున్నాను.
    కాదనిన సవరించుకోగలను.

    రిప్లయితొలగించండి
  25. శిరమున బిగిసిన గంగ యె
    బురబుర మని పొంగి శివుని ముంచగ జూడన్
    బిరబిర పెరుగగ లింగము
    మరిమరి శిరమెత్తి కొలిచె మ్రాన్పడి ద్విజుడే!

    రిప్లయితొలగించండి
  26. మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
    మీరు చూపిన సవరణ తో..


    గంగాధరుడా యేమిది
    గంగమ్మను దించినావ కలతను బరువై
    కంగారేమియు పడకను
    జంగమ దేవర నుతింతు సద్భక్తుడనై

    రిప్లయితొలగించండి
  27. శ్రీమతి లక్ష్మీ దేవి గారు: శుభాశీస్సులు.
    మీ పద్యములో తొలుగు అను పదము తొలగు అను పదమును సమానార్థకములు. కాని ఎక్కువగా తొలగు అను పదమే వాడుకలో నుండుటచేత నేను తొందరపడి చెప్పితిని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. శివలింగము వద్ద నిలచి
    భవుని కృపను బొంద గోరి బ్రాహ్మణుడొకడున్
    కవనములల్లుచు గానము
    నవలీలగ జేయుచుండి యర్చన జేసెన్

    రిప్లయితొలగించండి
  29. పండిత నేమాని వారూ,
    మనోహరమైన స్తుతిని అందించారు. ధన్యవాదాలు. ఇది రేపు ఉదయం (IST. 12-10 గం.లకు) బ్లాగులో కనిపిస్తుంది.
    *
    సహదేవుడు గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మంచి పద్యాన్ని చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి