23, ఏప్రిల్ 2014, బుధవారం

సమస్యాపూరణం - 1391 (కలియుగంబునందు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలియుగంబునందు కఱవు లేదు.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

  1. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యలో కరువు అను పదమునకు సరియైన అర్థమును గ్రహించండి - కఱవు అనలేదు.
    కరగు, గర్భస్థ పిండము మొదలగు కొన్ని అర్థము లున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. నేమాని వారికి,
    ప్రణామములు. కరువు శబ్దార్థం విషయంలో స్పష్టత నిచ్చినందుకు ధన్యవాదాలు. అక్కడ ‘కఱవు’ శబ్దం ఉంటేనే పూరణలకు విస్తృతావకాశాలుంటాయి. అందువలన సరిదిద్దాను.

    రిప్లయితొలగించండి
  3. దుష్టవర్తనులకు దుర్మార్గచరితుల
    కనృతవాక్యపాలకాళికనయ
    మార్షధర్మమందునామర్షభావముల్
    కలియుగంబునందు కఱవులేదు.

    ఆమర్షము = కోపము

    రిప్లయితొలగించండి
  4. చచ్చు రాజ కీ య మెచ్చట జూచిన
    కలియుగంబు నందు, కఱవు లేదు
    రామ రాజ్య మందు రవ్వంత యైనను
    హాయి గుండ్రి జనము లంద రపుడు

    రిప్లయితొలగించండి
  5. ప్రేమను గనలేము వెతికి చూచిన గాని
    కలియుగంబునందు, కరువు లేదు
    గద దివిన వసించు కన్యారత్నములకు
    నిత్య యవ్వనమున నిలిచి యుంద్రు

    రిప్లయితొలగించండి
  6. ధనము జూచి జనులు తనియుచు నుందురు
    కలియుగంబు నందు, కఱవు లేదు
    వనరులన్ని యున్న భరత దేశమునందు
    చిన్న మనసు వారి సృష్టి దప్ప


    రిప్లయితొలగించండి
  7. ధర్మ మర్మములను దర్శించు ధన్యులు
    సత్యము వచి యించు శాంతిప్రియులు
    శుభముకలుగ జేయు సుజనుల కేనాడు
    కలియుగంబునందు కఱవులేదు!!!

    రిప్లయితొలగించండి
  8. అంతు లేని యాశ లాస్థిపై గలవారు
    నీచ పథము విడువ నేర్చరెపుడు
    కనబడు బలు చోట్ల కనుమ వినీతికి
    కలియుగంబునందు కఱవులేదు.

    రిప్లయితొలగించండి
  9. ఉగ్రవాద భావమున్మాదమై రేగ
    శాంతి భద్రతలవి భ్రాంతులైన
    దొమ్మి, దోపిడీలు ధూర్త కార్యములకు
    కలియుగంబునందు కఱవు లేదు

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    స్విచ్చి నొక్కినంత చీకటి తొలగును,
    చింతలన్ని తీరు సేద్యమమరు
    హాయిగూర్చుయాన మాకసమందున
    కలియుగంబు నందు కఱవు లేదు

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులుగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    మరియొక పూరణ
    గోవు మాన్యులకును ఘోరావమానమ్ము, దేవమాన్యమ్ములన తెక్కలిగొను
    ప్రజల ధనము మ్రింగు వంచనాగ్రణులకు,
    కలియుగంబు నందు కఱవు లేదు

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు,
    ఈనాటి పూరణలు అన్నియును అలరించు చున్నవి. అందరికీ అభినందనలు.
    కొన్ని సూచనలు:

    శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది.
    హాయి గనిరి జనము లందరపుడు అని పాదమును సవరించుదాము.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    3వ పాదములో గణ భంగము కలదు. యౌవనము అనుట సాధు ప్రయోగము. కరువు అనే పదమును ఏ అర్థములో వాడేరో?

    శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    నేర్వరెపుడు అందాము. కను మవినీతికి అని విడదీస్తే ఇంకా బాగుగ నుండును.

    శ్రీ తిమ్మాజీ రావు గారు:
    మీ పద్యము బాగుగ నున్నది.
    అన్వయము ఇంకా స్పష్టముగా నుండాలి.

    రిప్లయితొలగించండి
  13. కపట నటన, బలిమి కాంతల చెఱచుట,
    హత్య, హింస, మోస, మనృత వాక్కు
    వాడ వాడల కొక వ్యభిచార గృహమును
    కలియుగంబునందు కఱవు లేదు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు
    నీ శిష్య పరమాణువు వినమ్రవందనములతో...
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో...
    =============*==================
    గనులను, నిసుకను,గడ్డిని,బొగ్గును
    కోటను,జెత్తను,కుళ్ళును దిని
    దేశము నందు,విదేశము నందున
    గల బ్యాంకులను నింపు ఘనులకును,త
    రంగముతో చదరంగము నాడెడి
    విజ్ఞాన ఘనులకు,పేదవారి
    రక్త మాంసములను లాఘవమ్మున దిను
    రాక్షస తతులకు,రాజ మార్గ
    మందు త్రోవ వెదకు నధికారు లకు,పసి
    వారిని గన లేని పాడు జనుల
    పాప కర్మములకు, పరమ మూర్ఖు లకును
    కలియుగంబునందు కఱవులేదు.

    రిప్లయితొలగించండి
  15. ఉగ్రవాద భావమున్మాదమై రేగ
    శాంతి భద్రతలవి భ్రాంతులైన
    దొమ్మి, దోపిడీలు ధూర్త కార్యములకు
    కలియుగంబునందు కఱవు లేదు

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు పండిత నేమాని గారికి నమస్సులు. కరువు:గర్భము అనే అర్థములో వాడాను.
    "గద దివిన వసించు కమనీయ స్రీలకు" అని మూడవ పాదము సవరించ వచ్చా.

    రిప్లయితొలగించండి
  17. ప్రేమను కనలేము వెతికి చూచిన గాని
    కలియుగంబునందు, కరువు లేదు
    గద దివిన వసించు కమనీయ స్త్రీలకు
    నిత్య యౌవనమున నిలిచి యుంద్రు

    రిప్లయితొలగించండి
  18. శ్రీ నాగరాజు రవీందర్ గారు: శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది.
    కుటిల నడతలు అను సమాసము సాధువు కాదు.

    శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు:
    మీరు సవరించిన పద్యము బాగుగ నున్నది.
    గద దివి నివసించు - అందాము.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి