29, జూన్ 2014, ఆదివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 14

రామాయణము-
చ.      అతులితవీరులై (పెరిగి రా ప్రభుపుత్రులు వీఁకగూడ;) బ
ర్వతధృతిఁ దండ్రి తా (నధికవైరిచమూదధిహారికుంభ)జుం
డతిధృతిఁ జూడ, రా(జదయనందును నేర్చిరి క్షాత్రవిద్య)లం
దతమగు నేర్పుతో; (నవనిఁ దామతతంపర లైరి చాల)గన్. (౨౯)

భారతము-
తే.      పెరిగి రాప్రభుపుత్రులు వీఁక గూడ,
నధికవైరిచమూదధిహారి కుంభ
జ దయ నందుచు నేర్చిరి క్షాత్రవిద్య;
నవనిఁ దామరతంపరలైరి చాల. (౨౯)

టీక- (రా) అధికవైరిచమూదధిహారికుంభజుండు = గొప్ప శత్రుసేనాసముద్రమునకు మనోజ్ఞుఁ డగు నగస్త్యుని బోలువాఁడు. (భా) అధికవైరిచమూదధిహారి = గొప్ప శత్రుసేనాసముద్రమును వారించువాఁడగు, కుంభజదయ = ద్రోణుని దయ; వీఁక = పరాక్రమము; తతము = విరివియైన; తామరతంపర లగుట = వృద్ధిజెందుట.

రావిపాటి లక్ష్మీనారాయణ

1 కామెంట్‌:

  1. నారి కేళ పా కంబున నానుకతన
    కష్ట మనిపించె నర్ధము కాని యందు
    పద్య మొక్కటి చదివిన విందు గూర్చు
    సార మట్లుగ నుండుట జవుల తోడ

    రిప్లయితొలగించండి