25, జులై 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 35

రామాయణము-
చం.    అదరెను భూమియున్ (మలయు చబ్ధులు ఘూర్ణిలె క్ష్మాధరాళి)యుం
బెదరెను దారకల్ (కదలె జిష్ణుఁడు రాముఁడు కమ్రభీము) వి
ల్లుఁ దనదు భీష్మమౌ (బలిమి లోపడఁ జేయఁగ, వాలు కర్ణ)భీ
ప్రదరవమూపరాణ్(ముఖుల, రాల్పగ దివ్యులు పుష్పరాజి)నిన్. (౫౦)

భారతము-
గీ.       మలయు చబ్ధులు ఘూర్ణిలె క్ష్మాధరాళి
కదలె జిష్ణుఁడు రాముఁడు కమ్రభీము
బలిమి లోపడఁ జేయఁగ, వాలు కర్ణ
ముఖుల, రాల్పగ దివ్యులు పుష్పరాజి. (౫౦)

టీక- జిష్ణుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; భీము = (రా) శివుని, (భా) భీముని; వాలు = విజృంభించు; కర్ణభీప్రదరవము = చెవులకు భయమునిచ్చు ధ్వని; రాణ్ముఖులు = రాజశ్రేష్ఠులు; (భా) కర్ణముఖులు = కర్ణుఁడు మొదలగువారు.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి