5, జులై 2014, శనివారం

పద్యరచన - 611

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. సకల శుభములు గలిగించు శంకరుండు
    ఆయు రారోగ్య ములనిచ్చి యాదు కొనుచు
    కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
    దయను నేమాని వారిని దప్ప కుండ .

    రిప్లయితొలగించండి
  2. వీరపరాక్రమోద్ధతిని భీకర రాక్షసులన్ వధించి దు
    ర్వార మాహాహవంబున విలాసిని వోలె చరించు దుష్ట సం
    హారిణి సింహయాన యచలాత్మజ హైందవరక్షణార్థమై
    భారతమాతగా వెలసె వందన పుష్పములందజేసెదెన్.

    రిప్లయితొలగించండి
  3. సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. అమ్మ !దుర్గమ్మ!వందన మమ్మ !నీకు
    చేతు లారంగ బూజింతు జెలువ మీర
    మమ్ము గాపాడు నిరతము నెమ్మనమున
    కరుణ యుంచుము మాయందు కనక దుర్గ !

    రిప్లయితొలగించండి
  5. సుబ్బారావు గారూ,
    బాగున్నది మీ పద్యం. అభినందనలు.
    ‘చెలువు మీఱ’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. వందనాలమ్మ 'భారతి' వందనాలు
    బయటి, లోపలి వేర్పాటు వాదులు
    దేశ యైక్యతఁ ద్రుంచగఁ దీరి నారు
    సింహ వాహన మెక్కుచు జిల్చ రావె!

    నిన్నటి పద్య రచన:

    పావన మసీదు నందునందున
    దేవుని గుణములు పికములు దెల్పగ వినుమా!
    భూవని నాల్గు మినార్లట
    దీవెనలంది యట నిల్చి తేజము నొందన్!

    రిప్లయితొలగించండి
  7. తప్పు దొర్లె నేని తగదు తగదటంచు
    నొప్పు నేర్పి కవుల నుద్ధరించ
    నిన్న నేడు రేపు నేమని గురువుల
    శారదాంబ గాచి స్వాస్థ్యత నిడు

    రిప్లయితొలగించండి
  8. సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు (నిన్నిటి శీర్షికతో సహా) బాగున్నవి. అభినందనలు.
    ఈనాటి పద్యంలో రెండవ పాదంలో గణదోషం. వేర్పాటు వాదు లెల్ల... అంటే సరి! ‘దేశ + ఐక్యత’ అన్నప్పుడు యడాగమం రాదు... ఆ పాదాన్ని ‘దేశపు సమైక్యతను ద్రుంచ దీరినారు’ అందాం.
    నిన్నటి పద్యానికి మొదటిపాదంలో ‘మసీదు నందున’ అనడానికి ‘మసీదు నందు నందున’ అని టైపాటు.
    నేమాని వారి స్వాస్థ్యాన్ని ఆకాంక్షిస్తూ చక్కని పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.
    ధన్యవాదాలు.
    నేమాని టైపాటు వల్ల నేమని అయింది.

    రిప్లయితొలగించండి
  9. సింహవాహిని! భారత సీమ చండి!
    హస్తమున దేశ జెండాయె యమ్మ నీకు
    శూల మాయెను దుష్టుల గూల ద్రోయ
    తల్లి నీ యండయే రక్ష ధరణి మాకు.

    రిప్లయితొలగించండి
  10. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమానీ వా
    రుండిరి యాస్పత్రి యందు రుగ్మత మీరన్
    మెండుగ ఆరోగ్య మొసగి
    దండిగ భరతాంబ గురియు దయనా శీసుల్

    రిప్లయితొలగించండి
  12. గురువుగారికి ధన్యవాదములు.
    వందనాలమ్మ 'భారతి' వందనాలు
    బయటి, లోపలి వేర్పాటు వాదు లెల్ల
    దేశపు సమైక్యతను ద్రుంచ దీరినారు
    సింహ వాహన మెక్కుచు జీల్చ రావె!



    పావన మసీదు నందున
    దేవుని గుణములు పికములు దెల్పగ వినుమా!
    భూవని నాల్గు మినార్లట
    దీవెనలంది యిల నిల్చి తేజము నొందన్!




    తప్పు దొర్లె నేని తగదు తగదటంచు
    నొప్పు నేర్పి కవుల నుద్ధరించ
    నిన్న నేడు రేపు నేమాని గురువుల
    శారదాంబ గాచి స్వాస్థ్యత నిడు

    రిప్లయితొలగించండి