4, ఆగస్టు 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 44

రామాయణము-
ఉ.      తా(సితకీర్తి యానృపుఁ డుదగ్రత వెల్గెను భాసురంబుగా;
వాసిజరా)గమంబునను భార్గవి గేహహితుండు గ్రుంకెఁ బ
ద్మా(సుతు భీముఁ డల్గి యెడఁదన్ హత మత్యధికోగ్రమూర్తియై
చేసె లలిన్) లసన్నటనఁ జేయు నతం డిపు డంచసూయనాన్. (౫౯)

భారతము-
కం.    సితకీర్తి యా నృపుఁ డుద
గ్రత వెల్గెను భాసురంబుగా; వాసిజరా
సుతు భీముఁ డల్గి యెడఁదన్
హత మత్యధికోగ్రమూర్తియై చేసె లలిన్. (౫౯)

టీక- (రా) జరాగమంబునను = ముసలితనము వచ్చుటచే (దినమంతయు వెల్గి వృద్ధుఁ డగుటచే); భార్గవి = లక్ష్మీదేవి యొక్క; గేహ = ఇంటికి (పద్మమునకు); హితుండు = మిత్రుఁడు (సూర్యుఁడు); పద్యాసుతు = లక్ష్మీదేవి కుమారుని (మన్మథుని); భీముఁడు = శివుఁడు; అతండు = ఆ శివుఁడు (లక్ష్మీదేవి యింటికి హితుఁడు గనుకను, లక్ష్మీదేవి కుమారుని శివుఁడు చంపెఁ గావున, శివునిపై సూర్యున కసూయ గలదనియు, సాయంకాలమున శివుఁడు నాట్యము చేయును గనుక చూడలేక క్రుంకెనని భావము); (భా) జరాసుతు = జరాసంధుని; లలి = ఉత్సాహము.

రావిపాటి లక్ష్మీనారాయణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి