19, ఆగస్టు 2014, మంగళవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 58
రావిపాటి లక్ష్మీనారాయణ

రామాయణము-
చం.    అరుదగుమౌనియై (చెలఁగి హాళిని, లోఁతున సింధురాజు)నై
         కౌలుచు, జానకీ(వనిత కృష్ణమృగేక్షణ పర్ణశాల)యం
         దురుపరివేదనం (బరఁగ నొంటరి నుండఁగ బల్మి గొంచుఁ) దా   
         సరగను నాపెతోఁ (జనియె సంతస మందుచు స్వాంతమందు)నన్. (౭౩)

భారతము-
గీ.     చెలఁగి హాళిని లోఁతున, సింధురాజు
        వనిత కృష్ణ మృగేక్షణ పర్ణశాలఁ
        బరగ నొంటరినుండఁగ బల్మిఁ గొంచు
        జనియె సంతస మందుచు స్వాంతమందు. (౭౩)

టీక- సింధురాజు = (భా) సైంధవుఁడు; లోఁతుల సింధురాజునై = (రా) లోతున సముద్రమునుఁ బోలినవాఁడై; (భా) కృష్ణ = ద్రౌపది, మృగేక్షణ = లేడివంటి కన్నులుగలది; (రా) కృష్ణమృగేక్షణ = కృష్ణమృగమువంటి కన్నులుగలది; హాళి = ఆనందము; కెరలుచు = అతిశయించుచు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి