16, ఆగస్టు 2014, శనివారం

పద్యరచన - 649

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

  1. కొంత వ్యావహారిక భాషలో, ఆ.వె.
    డబ్బు డబ్బు డబ్బు అబ్బ వద్దండిక
    పిచ్చి దొచ్చి యిచ్చు పచ్చిజబ్బు
    తిక్కలెక్క లందు బక్కచిక్కి సుఖము
    మరచి పోవునటుల మార్చి వేయు!

    రిప్లయితొలగించండి
  2. కట్టలుదెగు నుత్సాహము
    కట్టలుగా డబ్బుజూడ కరముల బట్టన్
    పట్టుము దానిని ధర్మపు
    కట్టును నువు దాటకుండ కామిత మీయన్.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. అట్టల లోపల డబ్బులు
    కట్టలుగా నుండె నచట కళ్లుం జెదర
    న్నిట్టటు జూసియు కొందరు
    బిట్టున గొనిపో దురే మొ ? పిల్లా ! గనుమా .

    రిప్లయితొలగించండి

  5. కట్టలుగాడబ్బు లచట
    పెట్టిరి మరి నలుపొ !తెలుపొ! పెరుమాళ్ళెరుగున్
    మట్టిన కలిసే వరకూ
    పట్టుకు వ్రేళ్ళాడు జనము వదలక దీనిన్


    పచ్చనోటును జూడగ పాప కూడ
    పరుగు తీయుచు వచ్చునే పరవశించి
    తెలుపు నలుపుల తేడాలు దేముడెరుగు
    కట్టలుగ నోట్టు జూడగ కనులు దిరుగు

    రిప్లయితొలగించండి
  6. ధనమను మానవ సృష్టి య
    వనిని తను వశపరచుకొని పాలన చేసెన్
    ధనమది దైవము కాకు
    న్నను తక్కువయు భగవంతునకసలు కాదోయ్

    ధనమనునదియొక వ్యసనము
    మనుజుల తలపులననుదినమాశలు రేపున్
    మనమున మమతల చెరుపుచు
    మనుషుల యనుబంధములను పాతరవేసెన్

    డబ్బులు దాయుట మంచిది
    యిబ్బందులు, జబ్బులందునిచ్చు సహారా
    పబ్బులు, రేసులయందును
    క్లబ్బుల పేకాటలోన కాలిడ బోకోయ్

    ధనము కలిగినపుడు దరిచేరు నందరు
    ధనము లేక నెవరు దరికి రారు
    ధనము తెలివిగలిగి దాచిపెట్టుకొనిన
    అవసరార్ధమందునాదుకొనును

    రిప్లయితొలగించండి
  7. ఈనాటి శీర్శికకు చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
    చంద్రశేఖర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    శైలజ గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి