10, అక్టోబర్ 2014, శుక్రవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 107


రావిపాటి లక్ష్మినారాయణ

కం.       శర్మదముల నీకథల వి
నిర్మలమతిఁ బాడినన్ వినినఁ జదివిన స
ద్ధర్మమయుఁడు సర్వేశ్వరుఁ
డర్మిలితోడుత నొసఁగు మనోభీష్టంబుల్. (౧౨౨)

కం.       శ్రీరావిపాటి లక్ష్మీ
నారాయణ యొనరిచె రచనన్ గర్భమునన్
భారత మిడి నిర్వచనము
గా రామాయాణముఁ జంద్రకమలాప్తముగన్. (౧౨౩)

చక్రబంధము
(మొదటి మూడుపాదములందలి మొదటినుండి మూడవ చివరినుండి మూడవ యక్షరములు కవిపేరును, మొదటినుండి యాఱవ చివరినుండి యాఱవ యక్షరములు గ్రంధముపేరును తెలుపును.)
శా.        రక్షోరాతి పరాత్పరా వరద ధీరా రమ్యశూరాన్వితా
దక్షా లక్షణ మత్తసంహర కృతీ దాతక్రమా యచ్యుతా
రక్షా నాకులభాగ్యమా వరగభీరా ముక్త బాణవ్రతా
తాక్షోణీరమణా దయాశరధి భూతాళిస్తుతా కామితా. (౧౨౪)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి