24, అక్టోబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 716

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. గుక్కెడు నీటిని పట్టగ
    నక్కడ గుమిగూడి గ్రామ మంతయు వేచెన్
    బక్కెటుల బైకి లాగిన
    చుక్కైనను నీరు రాదు చోడుమ మిగిలెన్

    రిప్లయితొలగించండి
  2. ఊరి జనములు నందరు నూరి బయటి
    బావి యొద్దన గుమిగూడి బాల్చి తోడ
    నొక్క రొకరుగ నీటిని నొడిసి పట్టి
    లాగు చుండిరి బయటకు వేగముగను

    రిప్లయితొలగించండి
  3. మొన్నటి వరకే వాడన
    నున్నది నేడెచటబోయెనో యని ప్రజలే
    కన్నుల నీరిడి వెదకుచు
    నున్నారిట నీటి కొరకు నూతిని గనుడీ !

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఊరుమ్మడి బావి :

    01)
    _________________________

    నీరే జీవాధారము
    నీరే మరి లేని నాడు - నిర్జీవంబే !
    నీరే కోరెడు స్త్రీలకు
    నీ రోజున దొరకు ననుట - నిజమో కలయో ????
    _________________________

    రిప్లయితొలగించండి
  5. కటకట లాడుచునుండ న
    కట, జనులకు బాధఁ దీర్చు కరుణయె లేదీ
    ఘటికులమని చెప్పుకొనెడు
    నటనల నాయకులకెపుడు, నైజము తెలియున్.

    రిప్లయితొలగించండి
  6. యిండ్ల భావుల మంచినీ రింకిపోవ
    చుక్క నీరము దొరకక స్రుక్క బడుచు
    నూరభావికిఁ బోయిరా యూరిజనులు
    నీటి మూటలే నేతల మాట లన్ని
    కాచు వారలిప్పుడెవరుఁ గాన రారు

    స్రుక్కబడుః దుఃఖించు

    రిప్లయితొలగించండి
  7. లోటా చుట్టూ మూగుచుఁ
    బాటులఁ బడు చీమల వలె పౌరుల్ బావిన్
    నీటికిఁ జేరన్ దయతో
    కాఠిన్యము వీడుమయ్య గంగాధరుడా!

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    చేదుచు నుండిరా జనులు చేతులు నొప్పులు బుట్టునట్లుగా
    చేదలు సాగుచుండినవి చేరగ దాటి మహాతలమ్మునే
    లేదు జలంబు లూరినను రేగిన దాహము దీర్చ జాలదే
    పేదల బాధలున్ దొలగ వేడెద పెన్నిధి వీవు దైవమా

    చేదు (మధ్యలో అరసున్న) = నీటిని కూపము నుండీ పైకి లాగటము.
    చేద ( " ) = త్రాడు.

    రిప్లయితొలగించండి
  9. భూతలస్వర్గమీ భరతభూమని జెప్పుచు నుంద్రు గాదె యా
    భూతల గర్భమందున ప్రపూరితమైన జడమ్ము లేదె? చే
    జేతుల చేసుకొన్నజనజీవన శైలియె మార్పుదెచ్చెనో!
    చేతను చేదబట్టుకొని చేరిరి లోకులు బావిచెంతకున్

    రిప్లయితొలగించండి
  10. ఈనాటి శీర్షికకు మంచి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి