20, జనవరి 2015, మంగళవారం

నిషిద్ధాక్షరి - 29

కవిమిత్రులారా,
అంశం- హిమాలయములు.
నిషిద్ధాక్షరము - మ
ఛందస్సు - కందము.

37 కామెంట్‌లు:

  1. భారత దేశపు టె ల్లగ
    నారయ తుహినా చలంబు నట గల దా ర్యా!
    పేరొందిన వడ యే యది
    పార్వతి నిన్గనిన తండ్రి పర్వత రాజే .

    రిప్లయితొలగించండి
  2. కైలాస శిఖరంబు పైశూలి
    పైలా పచ్చీసుగ నుండి పార్వతి తోడన్
    శైలపు చల్ల దనంబున
    నీలోకపు జనులయందు నిరసన దెలుపన్

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. సరిహద్దుగదేశానికి
    హరిహరులకునిలయశక్తి-నందించినదై|
    పరుగిడుగంగానదినే
    వరలగదేశానికంపె|పర్వతశిఖలై|

    రిప్లయితొలగించండి
  5. హిందూ బౌద్ధుల కొలువై

    సింధూ గంగా జలలకు శీతల కొండై

    సంధిక యౌషద నిలువై

    పొందికతో వెలయు శివుని పూజకు సరియై

    రిప్లయితొలగించండి
  6. తెల్లని కొండలు దిక్కై
    చల్లగ కాపాడుచుండు జాతిని, నతులా
    చల్లని కొండకు పల్కుట
    చెల్లును భారత ప్రజలకు చెప్పగవలెనే?

    రిప్లయితొలగించండి
  7. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి రెండు పాదాల్లో గణదోషం. ‘పైలా పచ్చీసు’ అన్యదేశ్యం. నా సవరణ.....
    కైలాసముపైన శివుఁడు
    బాలేందుడు తలను మెఱయఁ బార్వతితోడన్
    శైలపుఁ జల్లదనంబున
    నీలోకము లెల్లఁ గాఁచు నిటలాక్షుండై.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదాన్ని ‘సింధూగంగాంబువులకు శీతలనగమై’ అనండి.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. నిషిద్ధాక్షరము - మ అయినప్పుడు మీరు సూచించిన "నగమై" యొప్పునా?

    రిప్లయితొలగించండి
  9. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    నిషేధం మరిచిపోయాను. మన్నించండి.
    మీరన్నట్టు ‘శృంగి + ఐ’ అన్నచోట సంధిలేదు. యడాగమం వస్తుంది. కనుక ‘శీతలగిరియై’ అనండి.

    రిప్లయితొలగించండి
  10. భువినుంచి నిట్టనిలువుగ
    దివియంచుల తాకినట్లు దీపించుచు నీ
    యవనికి శీతాద్రియె యొక
    హవణికయై దేశపు సరిహద్దులు గాచెన్

    రిప్లయితొలగించండి
  11. గట్టిగ నుత్తరదిక్కున
    గట్టుగ నున్న గిరిపైన కరమగు తుష్టిన్
    గట్టుల రేని ప్రియ తనయ
    పట్టపు రాణిగ, వసించు భర్గు తలచెదన్

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. ఎల్లగ నుత్తర దిక్కున
    చల్లని వలిగుబ్బలుండె జగతికి రక్షై
    యెల్లరు నుతించు సొగసులు
    కొల్లలుగానుండి సురలు కొలువుందురటన్ !!!

    రిప్లయితొలగించండి
  14. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రక్ష + ఐ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘జగతికి కాపై’ అందామా?

    రిప్లయితొలగించండి
  15. కవిమిత్రులకు మనవి...
    నే నిప్పుడు మా అక్కయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాను. రేపు ఉదయం తిరిగి వస్తాను. అక్కడ నెట్ సౌకర్యం ఉండదు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    రేపటి సమస్యను షెఢ్యూల్ చేశాను.

    రిప్లయితొలగించండి
  16. చలువల గట్టును జూచిన
    నిల వంకను కరుణఁ జూచు నీశ్వరు తలపై
    వెలిగెడు రజత కిరీటపు
    జిలుగులు నా యెదకు దోచి శివుని నుతింతున్.

    రిప్లయితొలగించండి
  17. పెట్టని గోడలవలె కని
    పెట్టుచు తుహినాద్రి శత్రు బృందాలను తా
    కట్టడ చేయుచు దేశము
    నట్టే కాపాడుచుండె ననునిత్యంబున్.

    రిప్లయితొలగించండి
  18. పెట్టని గోడలవలె కని
    పెట్టుచు తుహినాద్రి శత్రు బృందాలను తా
    కట్టడ చేయుచు దేశము
    నట్టే కాపాడుచుండె ననునిత్యంబున్.

    రిప్లయితొలగించండి
  19. భారతజననికి సిగలో
    చేరిన ధవళపు తుషార శిఖరపు పూలై
    సీరాయుధు పార్వతియా
    గార౦బై వెలసిన చలి గట్టు నుతింతున్

    రిప్లయితొలగించండి
  20. మల్లెల వారిపూరణలు
    శీతనగ౦ బా పార్వతి
    జాతనగ౦బును ఋషులకు చల్లని నెలవై
    పూత౦బౌ గంగ వెలుగ
    వే తలపంగ నది కుడ్య వీధియె కనగన్
    2.తలయగు భారతి కి౦పై
    పలు ఋషులకు నెలవగు నది భారతి వేలై
    చెలగును యుత్తరదిశ నటు
    తలపగ గంగయె పరువిడు ధర్మ పథ౦బై

    రిప్లయితొలగించండి
  21. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    శీత నగ౦బున కన్నను
    శీత౦బగు వస్తు వొకటి క్షితి పైకలదే
    చేతనల నేల గలిగెడు
    శీత౦బగు భారతాంబ చేతంబె కదా

    రిప్లయితొలగించండి
  22. శీతాద్రి శిఖర వర్ణన
    ఆతత c యగుపడును గదర అచ్చెరువొందన్,
    ప్రీతిన్ cబ్రవరుడు జేరిన
    శీతాద్రి c బొదలగుపించె సెకవెలుగలరన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. ఉత్తర దిక్కున కొలువై
    యెత్తగు కోటరమువలెను యెల్లగ నిలువన్
    చిత్తగు శత్రుల దాడులు
    మొత్తపు తుహినంపు గిరులు మోదము గూర్చున్

    రిప్లయితొలగించండి
  24. దేశపుసిగలోపువ్వుగ
    వాశితవన్నెలనుబంచి|వాత్సల్యతనే
    రాశిగ|నిలచియు,గంగా
    ఆశయసాధనగ| ప్రతభనందించుగదా

    రిప్లయితొలగించండి

  25. తెల్లని గోడలు పగతుర
    నల్లన దూరాన నిలుపు, హర వాసంబై.
    చల్లని కొండలు చూడుం
    డెల్లలుగా భరత భువికి " నెత్తును " పెంచెన్

    రిప్లయితొలగించండి
  26. హిమాలయాలంటే గంగోధృతికి pressure dissipatorsఅనే సాంకేతిక భావంతో చేసిన ప్రయోగం గురుదేవులు పరిశీలించ ప్రార్థన.
    శివుని జటాజూటంపు బి
    గువు సడలన్ గంగ జార కుతలఁపు గతులన్
    సవరించ నొత్తిడెల్లన్
    భువిపై జూపక చెదర్చు పురుభోజస్సుల్!

    రిప్లయితొలగించండి
  27. దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీరు తెలుగు టైప్ చేయడానికి ఏ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నారో తెల్పండి. అందులో అర్థానుస్వారం ఎలా టైప్ చేయాలో చెప్తాను.
    ‘ఆతత యగుపడును’ అన్నప్పుడు అరసున్నా అవసరం లేదు. అక్కడ ‘ఆతతముగఁ గానుపించు నచ్చెరువొందన్’ అనండి.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. భారతదేశపు కోటగ
    గౌరికి పుట్టిల్లుగాను గౌరవ సిద్ధిన్
    చేరగ హైందవ శ్రేణులు
    పేరును పొందేను గిరులు పెన్ కొండలుగా

    రిప్లయితొలగించండి
  29. శీతనగాలుగా కన్పడు
    ఆతతసౌందర్య సృష్టి అద్భుతము కదా
    భూతలనాక నివాసుల
    చేతంబుల చిత్తు జేయు చిత్రోన్నతులే

    రిప్లయితొలగించండి
  30. ‘శ్రీపాద’ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘పొందేను’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘పేరును పొందినవి’ అనండి.
    రెండవ పూరణలో ‘శీతనగాలుగ’ అనండి. లేకుంటే గణదోషం అవుతుంది.

    రిప్లయితొలగించండి
  31. శీతాద్రి శిఖర వర్ణన
    ఆతత ముగcగాను పించు నచ్చెరు వొందన్,
    ప్రీతిన్ cబ్రవరుడు జేరిన
    శీతాద్రి c బొదలగుపించె సెకవెలుగలరన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  32. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి