6, ఫిబ్రవరి 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1592 (చీరఁ గట్టుకొనుము శ్రీనివాస)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చీరఁ గట్టుకొనుము శ్రీనివాస.

28 కామెంట్‌లు:

  1. సీతపాత్రవేయ సిగ్గేలనో 'శ్రీను'
    నటులు సిగ్గు పడిన నెటులనోయి
    స్త్రీల పాత్రకొప్పు సిగ్గుపడెడిమోము
    చీరఁ గట్టుకొనుము శ్రీనివాస.

    రిప్లయితొలగించండి
  2. తలచిన చినదాని తావలచినదాని
    శుభకర కరము గొను శుభసమయము
    వచ్చె నంచు నంత వకుళ పలికె “పట్టు
    చీర కట్టు కొనుము శ్రీనివాస!”

    రిప్లయితొలగించండి
  3. శివుని గుడికి బోవ సీత మ్మ ! మఱి పట్టు
    చీర కట్టు కొనుము, శ్రీనివాస !
    నీదు సేవ జేతు నియమ నిష్ట లతోడ
    కరుణ జూడు మమ్ము కాంతి పుంజ !

    రిప్లయితొలగించండి
  4. "సాంప్రదాయ వస్త్రములతో జనవలెనిటు
    చీరఁ గట్టుకొనుము, శ్రీనివాస
    దర్శనమునకొరకు" బల్కె దల్లి, తరుణి
    హవణ మతిశయిల్లు వలువ నిడుచు

    రిప్లయితొలగించండి
  5. సురలకు యసు రులకు సోద్దెమర యురీతి
    అమృ తమును పంచ నాది దేవ
    వాలు జడను వేసి వయ్యార మొలికించ
    చీర గట్టు కొనుము శ్రీని వాస

    రిప్లయితొలగించండి


  6. జీన్సు టీ షర్టు పార్టీ కేగ ఓకె
    చీర కట్టుకొనుము, "శ్రీ నివాస "
    మేగుదము, కొలువుదము
    కొండలలో నెలకొన్న రాయుని జిలేబి !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. జిలేబీ గారి వచనకవితకు పద్యరూపం....
    పార్టి కేగ జీన్సుపాంటు షర్టు తగును;
    చీరఁ గట్టుకొనుము ‘శ్రీనివాస’
    మేగి కొలువవలయు నేడుకొండలను కో
    నేటిరాయు భక్తినిన్ జిలేబి!

    రిప్లయితొలగించండి
  8. సిరులు విరులు గల్గి సీతమ్మ మెచ్చేటి
    నిత్య పెళ్లి కొడుకు నిగ్గు నీది
    జాణ లంత మెచ్చు జలతారు నెర తల
    చీర కట్టు కొనుము శ్రీనివాస !!

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టి.బి.యస్. శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మాజేటి సుమలత గారూ,
    మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.
    సమస్య పాదం ఆటవెలది కదా.. మీ పద్యంలో ‘చేరి చీరఁ గట్టుకొనుము శ్రీనివాస’ అంటే సరి!
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    చక్కని భావాన్ని అందించారు. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. క్రొత్త నగలు పెట్టుకొనుమిక సరిగంచు
    చీర కట్టు కొనుము శ్రీనివాస
    వైభవమును చూసి వత్తము చెల్లెలా
    దివ్యమైన పర్వ దినము నేడు

    రిప్లయితొలగించండి

  11. కంది శంకరయ్య వారు 'చందన' వారి జరీ చీర కట్టించేరు !!

    నెనర్లు !!

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. శ్రీవల్లి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    జిలేబీ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. ఎరకసాని వేషమెత్తి, పద్మావతి
    తల్లిదండ్రుల మది తనియజేయ -
    ఆడుదాని రూపమం దరుగుట కిక
    చీర గట్టుకొనుము శ్రీనివాస!

    రిప్లయితొలగించండి
  14. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    ‘శ్రీనివాస’ శబ్దాన్ని సాభిప్రాయంగా, సందర్భశుద్ధితో వినియోగించుకున్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. కట్టు దుస్తు లందు గడుమేలు మనపట్టు
    చీరగట్టు, కొనుము శ్రీనివాస
    శీఘ్రముగను బోయి సిరి మహాలక్ష్మికి
    కంచి పట్టు చీర మంచి గాను !!!

    రిప్లయితొలగించండి
  16. కొలనులోనికేగి జలకముల ముగించి
    చీరఁ గట్టు కొనుము శ్రీనివాస
    యూర్థ్వ పుండ్రకముల నునిచెద నుదురున
    వేగ మంటపమున కేగ వలయు

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. పరమ శివుడు సతియు బరవశించు నటుల
    నాట్య మాడవలెను నయము గాను
    పట్టు పంచె గట్టి పాదములకిక మం
    జీర గట్టు కొనుము శ్రీనివాస !!!

    రిప్లయితొలగించండి
  19. శైలజ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. మంచి దన్న దేది వంచన మించగ
    నర్హు లైన వారి కంద దాయె!
    మునుపు సుధను బంచు మోహిని వలెనీవు
    చీరఁ గట్టు కొనుము శ్రీనివాస!

    రిప్లయితొలగించండి
  21. కూచిపూడినాట్యకుసుమాలుబాలురు
    చీరకట్టుకొనుము-శ్రీనివాస
    నాట్యకనువుగాను-నాటిసంస్కృతిలాగ
    పట్టుదలలరీతిగట్టిగాను.
    2ఆడవేషమందునందెవేసినపాత్ర
    చీరకట్టుకొనుముశ్రీనివాస
    సుబ్రమన్యశాస్రి|సూచనమేరకు
    సత్యభామనీవె-సాకుపాత్ర

    రిప్లయితొలగించండి

  22. భక్తవత్సలుడవు బ్రహ్మోత్సవము లన
    నీకు మాకు వేడ్క నీరజాక్ష!
    శివుడ వీవు హరివి శ్రీమాత వీవెగా
    చీరఁ గట్టుకొనుము శ్రీనివాస.

    రిప్లయితొలగించండి
  23. ఆడసంప్రదాయంబయ్యెనడవిపాలు
    జీన్సు,లెగ్గినువేసిరిశ్రీనివాస|
    ముసలిదానవునీకెల-మోజుడ్రస్సు
    ఫైనచీరకట్టుకొనుము-శ్రీనివాస|
    శ్రీకె*యస్.గురుమూర్తిగారిపూరణం

    రిప్లయితొలగించండి
  24. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ******
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ తేటగీతి పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఆపదలవి తొలగ నలిమేలు మంగమ్మ
    మగడ!నిన్నె కావు మంచు కొలుతు.
    నేడు కొండ లందు నేర్పడ ఘోషింప
    చీర-గట్టు కొనుము శ్రీనివాస!!

    మణులు స్వర్ణములును,మాన్యంపు పట్టుదౌ
    చీర గట్టు కొనుము శ్రీనివాస,
    నీదు రూపు గనిన నిండారు జన్మంబు
    ననుచు చేర జూతు నాత్మనేను

    రిప్లయితొలగించండి
  26. సిరియె నిన్ను జేరి మురిపించు వేళను
    మరల తాను వదలి మరలి పోక
    ముందె నడుమునకును మోదమ్ముతో తనదు
    చీర గట్టు కొనుము శ్రీనివాస.

    రిప్లయితొలగించండి
  27. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. అవును గురువు గారు. గమనించలేదు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి