29, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఖండకావ్యము - 12

ముక్తి
రచన : లక్ష్మీదేవి

మనసు మూగదనుచు జాలి మానగవలెనోయి! మూగ
తనమేమొ, మనుజుని తనదు దారినిఁ గొనిపోవుచుండు,
కనుమయ్య! కట్టివేయగల కాఠిన్యమొకయింత లేక
మునుగుచునుందురు జగతి, మోహపు సాగరమందు.

ఎల్ల మరచి యాటపాటలేను గొప్పవటంచు నుంద్రు
కల్ల కపటములు లేని కలకల నగవుల బాల్య
మెల్ల, పిదప లోకములను మిగుల బాగుపరచ కాల
మెల్ల గడుపుచుందు,రేమి మేళులు చేయగ జాలు?

నిజమునెరుగునంతలోన నేల విడుచుకాలమౌను,
సజలనయనములతోడ శంకరుని పదము చేరి,
భజన చేయుచు వేడుకొంద్రు పాహి పాహియనుచు, నిట్టి
ప్రజలకు బుద్ధినిఁ గలిగి బ్రదుక, వరములియ్యవయ్య!

తొలగించగా యీతి బాధ తుదకైన కరుణించవేమి?
శిలవోలె నిలిచితి జాలి చిలుకంగ రావే యదేమి?
కలనైనఁ గనిపించి దారి కానగఁ జేయుమో స్వామి!
యిలపైన వేసట గలిగె యెప్పుడు పిలిపింతువేమి?

పశువునుఁ గాటన కట్టుపగిదిని నేర్పరాదొక్కొ!
నిశియందునహమందు నెపుడు నీమ్రోల నుంచరాదొక్కొ!
వశుడవీవంద్రు భక్తులకు భాగ్యమదియెగదమాకు,
పశుపతీ! దయజూడవయ్య! పరితపించెడు వారిపైన.

*  *  *  *  *  *  *  *  *  *  *

16 కామెంట్‌లు:


  1. అమ్మ!లక్ష్మమ్మ!రచనగానలరునట్టి ముక్తికావ్యముజదివినమోక్షమబ్బు సందియంబునునిసుమంతపొందకుండ జదువవేడుదుమిమ్ములసఖులులార!

    రిప్లయితొలగించండి
  2. భక్తి మార్గము ముక్తిప్రదము. బాగున్నాయండి మీ పద్యాలు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పశువును రాటకు కట్టినట్లు పశుపతి పాదాలకు కట్టుకొనమని ప్రార్థించడం హృద్యంగా ఉంది లక్ష్మీదేవి గారూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆది శంకరుల వారు చూపిన మార్గమేనండి. మీ పద్యాలను మీ అనుమతి లేకుండా ఛందస్సు గ్రూప్ లో పోస్ట్ చేసానండి.

      తొలగించండి
    2. అవునా! మీఅభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ

      తొలగించండి
    3. అవునా! మీఅభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూ

      తొలగించండి
  4. లక్ష్మి దేవిరచన లక్ష ణంబుగ నుండె|
    ముక్తికున్న శక్తి యుక్తి దెలిపి
    మంచిగూర్చ నెంచి మధ్యాక్కరందున
    దెలుప చదువ?ముక్తి విలువలబ్బు|

    రిప్లయితొలగించండి
  5. సమర్థవంతమైన సాహచర్యముండగన్ సదా
    సమున్నతాశయంబుతోడ సాగ మీ ప్రయాణమున్
    సమంజసమ్మటంచు గూర్చు సత్వసద్ధి సంపదల్
    విముక్తినిచ్చు జన్మలేక విష్ణుమూర్తి తప్పకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సగభాగం మీరన్నట్టు ఒనగూడింది. మిగిలిన సగమూ మీ ఆశీర్వాదబలం వల్ల నెరవేరుతుందని ఆశిస్తాను.

      తొలగించండి