8, జూన్ 2016, బుధవారం

సమస్య - 2058 (భీష్మాచార్యుఁడు పాండవుల్...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“భీష్మాచార్యుఁడు పాండవుల్ వొగడఁగాఁ బెండ్లాడె పాంచాలినిన్”
లేదా...
“భీష్ముఁడు ద్రుపదనందనన్ బెండ్లియాడె”

70 కామెంట్‌లు:

  1. ప్రతిన బూనెను తండ్రికి హితము నిడగ
    భీష్ముఁడు,ద్రుపద నందనన్ బెండ్లి యాడె
    పంచ పాండవు లొక్కటై పరమ ప్రీతి
    తల్లి ఆజ్ఞను మన్నించు తనయు లనగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పాండవులు బహువచనం, పెండ్లియాడె ఏకవచనం. కొంత అన్వయలోపం...

      తొలగించండి
    2. ప్రతిన బూనెను తండ్రికి హితము నిడగ
      భీష్ముడు,ద్రుపద నందనన్ బెండ్లి యాడె
      మస్చ్య యంత్రము చేధించి నిస్చ లుండు
      గెలుపు కానుక పార్ధుని వలపు పంట

      తొలగించండి
  2. పాండుతనయుడు పార్థుడు,ఫల్గునుండు
    సవ్యసాచి, భీభత్సుడు, సంగరమున
    భీష్ముడు, ద్రుపదనందనన్ బెండ్లియాడె
    మత్స్యయత్రము ఛేదించి మంగళముగ!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్స్యయంత్రమ్ము ఛేదించఁ బటిమగల్గ
      ఇంద్ర సూనుని పార్థుని చంద్ర వదను
      సవ్యసాచిఁ బొగడుచు ప్రశంసలిడఁగ
      భీష్ముఁడు!, ద్రుపద నందనన్ బెండ్లియాడె!

      తొలగించండి
    2. శైలజ గారూ,
      మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
      *****
      సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువుగారు...

      తొలగించండి
  3. బండికాడి అంజయ్య గౌడ్ గారి (వాట్సప్) పూరణ.....

    అద్భుతంబైన నామత్స్యయంత్ర మపుడు
    కూల్చి వేసెను శరమున కుంతిసుతుడు
    సభికులందరు చూడ సుసాధ్య మపర
    భీష్ముడు ద్రుపదనందనన్ బెండ్లియాడె.

    రిప్లయితొలగించండి
  4. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఒకే సమస్యను అదే భావంతో వృత్తంలోను, జాత్యుపజాతుల్లోను ఇస్తున్న ప్రయోగం సత్ఫలితాన్ని ఇస్తున్నది. మిత్రులు ఉత్సాహంతో రెండు విధాలుగాను పూరిస్తున్నాను. దీనివల్ల ఔత్సాహికులకు వృత్తరచనను అభ్యసించే సౌలభ్యం లభిస్తున్నది.
    నిన్నటి సమస్యను...
    నేదునూరి రాజేశ్వరి (అక్కయ్య) గారు, శిష్ట్లా శర్మ గారు, పోచిరాజు కామేశ్వర రావు గారు, కెంబాయి తిమ్మాజీ రావు గారు, అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, కె. ఈశ్వరప్ప గారు, విరించి గారు వృత్తంలోను, కందంలోను పూరించారు.
    భాగవతుల కృష్ణారావు గారు, గండూరి లక్ష్మినారాయణ గారు కేవలం వృత్తంలోనే పూరించారు.
    డా. బల్లూరి ఉమాదేవి గారు, జిలేబీ గారు, బండికాడి అంజయ్య గౌడ్ గారు, శ్రీధర రావు గారు, ఎ.వి.రావు గారు, శైలజ గారు, పోచిరాజు సుబ్బారావు గారు, గురుమూర్తి ఆచారి గారు, గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు కేవలం కందంలో పూరించారు. (వీళ్ళు వృత్తరచనలు కూడా చేయగల సమర్థులే!)
    అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    ఈ పద్ధతిని కొనసాగించమంటారా? లేక ఎలాగూ దాదాపుగా అందరూ వృత్తరచనలో చేయితిరిగిన వాళ్ళయ్యారు కనుక కేవల వృత్తపాద సమస్యనో లేదా కేవల జాత్యుపజాతి పద్యపాద సమస్యనో ఇస్తే సరిపోతుందా? మీ సలహాలను కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువర్యులకు నమస్సులు. దత్తపది, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, సమస్యాపూరణలను వరుసగా మరల కొనసాగించ ప్రార్థన. క్రొత్తవారుకూడా నేర్చుకొనే అవకాశం కలుగుతుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ప్రణామములు. ప్రస్తుత పద్ధతివల్ల సమయం కొరవడిన (నాలాంటి)వారు జాత్యుపజాతులలో మాత్రమే పూరించి వృత్తరచనకు దూరమౌతారు. ఏదో ఒకటే ఇవ్వటంవల్ల పూరించటం తప్పనిసరి దినచర్యగా పెట్టుకున్న వాల్లు రెంటినీ వృద్ధి చేసుకుంటారని నా భావన.

      తొలగించండి
    3. అన్నపరెడ్డి గారూ,
      కొంతకాలం ఆ పద్ధతిని కొనసాగించాను. అయితే వాటివల్ల నాకు మానసికమైన ఒత్తిడి కలుగుతున్నది. దత్తపదికి నాలుగు పదాలను ఎన్నుకోవాలి. విషయాన్ని ఎంచుకోవాలి. ఆ పదాలను ఆ విషయంలో ఒదుగుతాయో లేదో అని ముందు ఆలోచించాలి. నేను చేయగలను అని నమ్మకం కలిగినప్పుడే ఇవ్వడం జరుగుతుంది. ఏవో తోచిన పదాలను, తోచిన అంశాన్ని సాధ్యాసాధ్యాలు విచారించకుండా ఇస్తే మిత్రులను మానసిక వేదనకు గురి చేయడమే అవుతుంది. అలాగే న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి మొదలైనవి. ఏదైనా ఇచ్చేముందు అది యుక్తమైనదేనా? నేను చెయ్యగలనా? అని ఆలోచించిన తరువాతే ఇస్తూ వస్తున్నాను. ఈమధ్య శారీరకంగాను, మానసికంగాను బాగా లేక ‘పద్యరచన’ శీర్షికను కూడా ఇవ్వడం లేదు.
      చూద్దాం.. అన్నీ కాస్త కుదుటపడ్డాక వాటిని కూడా ప్రారంభిస్తాను.

      తొలగించండి
    4. సహదేవుడు గారూ,
      మిత్రులలో ఎక్కువమంది సమస్యను రెండు విధాల ఇవ్వడమే బాగుందని అంటున్నారు. మీరు కేవలం వృత్తపాదాన్నే స్వీకరించి పూరణ చేయవచ్చు కదా!

      తొలగించండి
    5. అన్నప రెడ్డి గారి సలహా బాగుంది !

      కంది వారు యుక్తమైన దా కాదా అన్న దాన్ని , మీరు చెయ్యగలరా లేదా అన్న దాన్ని పక్క బెట్టి యిచ్చేయండి (తాంబూలాచ్చేసాం అన్న రీతిలో !)

      ఆ తరువాత ఉంటుందనుకుంటా ప్రతి ఒక్కరి ప్రతిభా పాటవాలు వెల్లి విరియడం ! ఎవరూ పూరించ లేక పోతే వదిలేద్దాం ! (ప్రస్తుతం శంకరాభరణం లో ఉన్న వారి మీద నమ్మకం - తప్పక పూరణ అవుతుందని నాకైతే అనిపిస్తుందండీ ! )

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    6. గురువుగారూ- మీ ఆరోగ్యం ముఖ్యం. మీకు వీలైన పద్ధతిలోనే కొనసాగించండి.

      తొలగించండి
    7. ప్రణామములు గురువుగారు...మీరు అధికశ్రమకు గురికాకుండా ఏవిధంగా ఇచ్చినా మాకు ఆనందదాయకమే..మీకు వీలయినప్పుడు యడాగమం,నుగాగామంలగురించి మరొక్క క్లాసు చెప్పమని ప్రార్ధన..

      తొలగించండి
  5. మత్స్య యంత్రము గెలుచుక మచ్చెకంటి
    ద్రౌపదిని మెచ్చి పెండ్లాడ నోప నరుడు;
    బాగు బాగంచు ముదమున బాగె మనగ
    భీష్ముడు; ద్రుపద నందనన్ బెండ్లి యాడె!

    బాగెము=సుకృతము

    రిప్లయితొలగించండి
  6. గురువు గారికి నమస్సులు...మీ సౌకర్యాన్నిబట్టి యెలా యిచ్చినా పరవాలేదని నా యభిప్రాయము..కవులు వారి వారి సౌకర్యాన్నిబట్టి పూరణలు చేస్తారు.

    రిప్లయితొలగించండి
  7. బ్రహ్మచర్యవ్రతమ్మును బట్టె నెవరు?
    పంచ పాండవుల్ తాము చే పట్టెనెవతె?
    సోమగర్భుడు రుక్మిణి నేమిచేసె?
    భీష్ముడు, ద్రుపద నందనన్, బెండ్లియాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవపాదాన్ని ‘పంచపాండవు లెవరిఁ జేపట్టినారు?’ అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  8. నా రెండవ పూరణము

    భీష్మంబైన ప్రతిజ్ఞనొంది జనుచునన్
    బేరొందె దా నెవ్వడ
    ర్చిష్మంతుండగుచున్ బరంగె నెపుడా
    రీతిం గ్రమంబొందగన్
    భీష్మంబై నటియించు మత్స్యమును దా
    భేదించగా నేమయెన్
    భీష్మాచార్యుడు; పాండవుల్ వొగడగా;
    బెండ్లాడె పాంచాలినిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘జనుచున్’... ‘జనుచునన్’ అని టైపయింది.

      తొలగించండి
    2. ధన్యవాదములు.... అవునండి టైపాటు... సవరించుకొందును

      తొలగించండి
    3. ధన్యవాదములు.... అవునండి టైపాటు... సవరించుకొందును

      తొలగించండి
  9. కూర్మి తోడను తాతయ్యె కౌరవులకు
    మరియు పాడవులకెవరు?మత్స్య యంత్ర
    మేసి పార్థుడు తానేమి చేసె చెపుమ?
    భీష్ముడు ద్రుపదనందనన్ బెండ్లి యాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      మొదటిపాదంలో యతి తప్పింది. ‘ఘనచరిత్రుఁడు తాతయ్య కౌరవులకు...’ అందామా?

      తొలగించండి
  10. నరుండున్ (అర్జునుడు కూడా) భీష్ముడు, మిగిలిన పాండవులు పొగడగా పాంచాలిని పెండ్లాడె నన్న భావముతో:

    శుష్మం బొప్పు ధనంజయోగ్రపు ధనుస్సుం జూచి విభ్రాంతులై
    శ్లేష్మంబందునఁ బడ్డ యీగలన నిశ్చేష్టాంతరంగంబునన్
    గ్రీష్మంబంది ధరేశులుంజనిన సత్కీర్తిన్ నరుండుం దనన్
    భీష్మాచార్యుఁడు, పాండవుల్ వొగడఁగాఁ, బెండ్లాడె పాంచాలినిన్
    [శుష్మము = తేజస్సు]

    మత్స్య యంత్రము భేదించ మహిమ నరుడు
    తల్లి పంపు వమ్ముఁ జనక వల్లె యనుచు
    పాండవు లొకని పిదప నొకండు, పొగడ
    భీష్ముఁడు, ద్రుపదనందనన్ బెండ్లియాడె

    రిప్లయితొలగించండి
  11. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { సుయోధనుడు ద్రౌపది తో }

    గ్రీష్మార్కున్ బలె యుధ్ధర౦గమున

    దా గ్రీడి౦చె నీవేళ నా

    భీష్మాచార్యుడు పా౦డవుల్ పొగడగా |

    పా౦చాలి ! నిన్

    గ్రీష్మీ మాల గళాన వైచి , సతి గా నే గొ౦దు ;

    రావే యికన్ |

    యుష్మద్వల్లభు లెల్ల దుర్బలులు ;

    నిర్యుక్తిన్ నిను౦ గాతురే !

    { గ్రీష్మార్కుడు = వేసవి సూర్యుడు .
    గ్రీష్మి= విరజాజి పూవు .
    నిర్యుక్తిన్ = అనర్హత తో }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ- బెండ్లాడె అనేపదం సమస్యలో మరచిపోయారు. గమనించండి.

      తొలగించండి
    2. ఆచారి గారూ,
      బాగుంది మీ పూరణ... కాని ‘పెండ్లాడె’ శబ్దం చేరితే అన్వయం కుదరదనుకుంటాను.
      *****
      అన్నపరెడ్డి వారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  12. స మ స్య
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    గు రు వు గా రి కి వ౦దనములు

    ఒ కే స మ స్య ను వృ త్త ౦ లోనూ మరియు
    ……………………………………………………
    జాత్యుప జాతుల లోను ఇ వ్వడము
    …………………………………………………
    హర్ష దాయకము . ...........................

    మత్తకోకిల , ధ్రువకోకిల ,
    సుగ౦ధి , ఉత్సాహ౦ , అ౦బురుహము మొదలయినవి కూ డా అపుడపుడు ఇస్తూ
    మా బుర్రలకు వా ద ర పెట్టవలసినదని
    నా మ న వి .

    న మ స్తే

    రిప్లయితొలగించండి
  13. శుష్మమ్మున్ కదనమ్మునందునను తాఁ జూపించు నుగ్రమ్ముగా
    భీష్మాచార్యుడు పాండవుల్ వొగడగా, బెండ్లాడె, పాంచాలి ని
    న్నస్మత్ శత్రువులేవురేకముగ, నే నాకొంటి నీకోసమై
    భస్మమ్మౌదురు నాదు శత్రువులటన్ పౌషమ్ములోఁ దప్పకన్
    (స-ష లకు – ఉభయ ప్రాస గలదు – అందుచేత ష్మ కు స్మ కు ప్రాస వేశాను).

    రిప్లయితొలగించండి
  14. బాళి తోడను తాతయ్యె పాండవులకు
    మరియు కౌరవు లకెవరు? మత్స్య యంత్ర
    మేసి పార్థుడు తానేమి చేసె చెపుమ?
    భీష్ముడు,ద్రుపద నందనన్ బెండ్లియాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ‘తాతయ్య+ఎ’ అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘తాతయ్య’ అంటే సరిపోతుంది కదా!

      తొలగించండి
  15. బాళి తోడను తాతయ్యె పాండవులకు
    మరియు కౌరవు లకెవరు? మత్స్య యంత్ర
    మేసి పార్థుడు తానేమి చేసె చెపుమ?
    భీష్ముడు,ద్రుపద నందనన్ బెండ్లియాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గ్రీష్మార్కుండగు యా పితామహుడు గాంగేయార్యునేమందురో
      శుష్మంబౌ దన యస్త్రముల్ విడువ భీష్ముండేల యొప్పెన్ యనిన్
      భీష్మయత్నము జేసి యర్జునుడు తా బెండ్లాడె నెవ్వారినో
      భీష్మా చార్యులు, పాండవుల్ వొగడగా, పెండ్లాడె పాంచాలినిన్

      మత్స్య యంత్రమ్ము నేగొట్టి మగటిమ గల
      పార్థుడు ధనుంజయుడు క్రీడి ఫల్గుణుండు
      సవ్యసాచి కిరీటి విజయుడు సమర
      భీష్ముడు ద్రుపద నందనన్ బెండ్లి యాడె

      తండ్రి కోరిక తీర్చగన్ తాను భువిన
      బ్రహ్మచారిగ మనుటకై ప్రతిన పూనె
      భీష్ముడు, ద్రుపద నందనన్ బెండ్లియాడె
      క్రీడి మత్స్య యంత్రము గొట్టి కృష్ణ నతడు

      తొలగించండి
    2. విరించి గారూ,
      మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో ‘అర్కుండగు నా పితామహుడు’ అనాలి. ‘ఒప్పెన్+అనిన్’ అన్నపుడు యడాగమం రాదు. ‘భీష్మయత్నము’ అన్నచోట గణదోషం.
      మూడవపూరణలో ‘భువిని’ అనండి.

      తొలగించండి
  16. ఆపగాతనయు డెవ్వరీ యవనియందు?
    ద్రుపద రాజ్యము నందున దోర్బలమును
    జూపి నేమి జేసె నా కుంతి సుతుడు తెలుపు?
    భీష్ముడు ద్రుపదనందనన్ బెండ్లి యాడె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది.
      మూడవపాదంలో గణదోషం. ‘...జూపి+ఏమి’ అన్నపుడు యడాగమం వస్తుంది. ‘...జూపి యేమి జేసెను కుంతి సుతుడు చెపుమ’ అనండి.

      తొలగించండి
  17. తండ్రికి నెవరు తన పెండ్లి ధార వోసె?
    మత్స్య యంత్రాన్ని ఛేదించి మదము మంది
    పార్ధు డేమి చేసె నొడలు పరవశింప ?
    భీష్ముడు! ద్రుపద నందనన్ బెండ్లి యాడె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ముదము నంది.... ముదము మంది అన్నారు.

      తొలగించండి
  18. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { సుయోధనుడు ద్రౌపది తో }

    గ్రీష్మార్కున్ బలె యుధ్ధ మ౦దున జయశ్రీ

    కా౦త నీవేళ నా

    భీష్మాచార్యుడు పా౦డవుల్ పొగడగా

    పె౦డ్లాడె | పా౦చాలి ! నిన్

    గ్రీష్మీ మాల గళాన వైచి , సతి గా నే గొ౦దు ;
    రావే యికన్ |

    యుష్మద్వల్లభు లెల్ల దుర్బలులు ;

    నిర్యుక్తిన్ నిను౦ గాతురే !

    { గ్రీష్మార్కుడు = వేసవి సూర్యుడు .
    గ్రీష్మి= విరజాజి పూవు .
    నిర్యుక్తిన్ = అనర్హత తో }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి గారు నమస్కారములు. మీరు ప్రయోగించిన “గ్రీష్మి” పదము సందేహాస్పదముగా నున్నది. గ్రీష్మీమాల యని దీర్ఘము రావడము కూడా సందేహమే. వివరించ గోర్తాను. వేసవి లో పెరిగెడివి యని యర్థములో “గ్రైష్మికా” యను స్త్రీలింగ పదము కలదు. ఇది సాహిత్య చర్చయే గాని విమర్శ కాదని భావించ గోర్తాను.
      ఈ పాదములో యతి కూడ తప్పినది. “గ్రీష్మార్కున్ వలె” ; “యికన్నుష్మద్వల్లభు” యన్న బాగుండును.

      తొలగించండి
    2. మత్చ్య యంత్రంబుగొట్టియుమగతనాన
      భీష్ముడు|దృపదనందనన్పెండ్లి యాడె|
      సాటిరాజులలో మేటిపోటియందు
      గెలిచె నర్జునుడెంతయోవిలువలందు|

      తొలగించండి
    3. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగుంది.
      ‘మత్స్యయంత్రంబు గొట్టి విమత నరపాల| భీష్ముడు...’ అంటే అన్వయం కుదురుతుందేమో?

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. "విమత నరపాల" అంటే గణము తప్పుతోందండి.

      తొలగించండి
    5. ‘నృపాల’ అనబోయి ‘నరపాల’ అన్నాను. ధన్యవాదాలు.

      తొలగించండి
  19. భీష్మంబైన ప్రతిజ్ఞచేసి భువిపైభీష్ముండు గామారెనా
    యుష్మంతుడు యశోవిభూషనుడునైయోగ్యుండుగానెంచుచున్
    భీష్మాచార్యుడు పాండవుల్
    వొగడగా,బెండ్లాడెపాంచాలనన్
    భీష్మద్రోణమనోవిజేతలుగనే
    భేధంబు లేకుండగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగుంది. అభినందనలు.
      ‘...నాయుష్మంతుండు’లో చివరి సున్న తప్పింది. ‘...మనోవిజేత నరుడే భేదంబు లేకుండగా...’ అంటే అన్వయం బాగుంటుందని నా సలహా.

      తొలగించండి
  20. భీష్మంబైన ప్రతిజ్ఞతో నెవడు తా బెంద్లాడ బోనంచనెన్
    భీష్మంబొప్ప సుయోధనునిన్ జఘనముల్ భీముందు భేదింప నా
    యుష్మ౦తుండగు పార్ధుడేయ ఝషము న్నుత్సాహ ముప్పొంగగన్
    భీష్మాచార్యుడు. పా౦డవుల్ పొగడగా.

    పె౦డ్లాడె | పా౦చాలి ! నిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది, కాని అన్వయలోపం ఉంది.
      ‘పాంచాలి! నిన్ పెండ్లాడె’ అన్నదానికి అన్వయం?

      తొలగించండి
  21. వేల్పు లెల్లరు మెచ్చంగ భీషణముగ
    పరిణయ మ్మాడనంచును ప్రతినజేసె
    భీష్ముడు. ద్రుపదనందనన్ పెండ్లి యాడె
    వరుసగా పాండునందన పంచమమ్ము

    రిప్లయితొలగించండి
  22. గ్రీష్మాదిత్య విశిష్ట తేజమున తా గీర్వాణుడేయంచనన్
    శుష్మమ్మున్చవిజూపి సోదరునకున్ జోడించెనర్ధాంగులన్
    భీష్మాచార్యుఁడు; పాండవుల్ వొగడఁగాఁ బెండ్లాడె పాంచాలినిన్
    కూష్మాండమ్మును గోట్టురీతి నరుడే గొట్టంగ మత్స్యమ్మునున్

    బ్రహ్మచర్యము పాటించె ప్రతిన జేసి
    భీష్ముఁడు; ద్రుపదనందనన్ బెండ్లియాడె
    పంచ పాండవులందరు పలుక కుంతి
    "పంచుకొనుడు సమముగా ఫలమునెపుడు"

    నిన్నటి సమస్యలకు నా పూరణలుగా వృత్తము తో పాటు కందమును కూడా
    పంపితిని. నా పూరణలు బాగున్నవి అని కూడా మీరు అభినందించిరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      నిన్న మీరు వ్రాసిన కందాన్ని లెక్కించడంలో పొరబడ్డాను. మన్నించండి.

      తొలగించండి
  23. భీష్ముండాజి ప్రతిజ్ఞవీడగనె సంప్రీతిన్ దయాళుండుగా
    భీష్మా చార్యుడుపాండవుల్ వొగడగా|”పెండ్లాడె పాంచాలినిన్
    నిష్మున్ డందు సహాయమున్ నొసగ సాన్నిధ్యాననర్ధాంగిగా
    భీష్మున్ డూహలు బంచి పెంచెగద సర్వేశుండుశీస్సుల్నిడన్”.| {నిష్ముడు=మన్మధుడు;భీష్ముడు=ఈశ్వరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ప్రయత్నం మెచ్చదగినదే. కాని టైపు దోషాలు, అన్వయదోషాలున్నవి.

      తొలగించండి
  24. గ్రీష్మార్కుండగు నా పితామహుడు గాంగేయార్యునేమందురో
    శుష్మంబౌ దన యస్త్రముల్ విడువ భీష్ముండేల యొప్పెన్న నిన్ 
    భీష్మమ్మౌ కృషి జేసి యర్జునుడు తా బెండ్లాడె నెవ్వారినో
    భీష్మా చార్యులు, పాండవుల్ వొగడగా, పెండ్లాడె పాంచాలినిన్ 

    మత్స్య యంత్రమ్ము నేగొట్టి మగటిమ గల
    పార్థుడు ధనుంజయుడు క్రీడి ఫల్గుణుండు
    సవ్యసాచి కిరీటి విజయుడు సమర
    భీష్ముడు ద్రుపద నందనన్ బెండ్లి యాడె

    తండ్రి కోరిక తీర్చగన్ తాను భువిని
    బ్రహ్మచారిగ మనుటకై ప్రతిన పూనె 
    భీష్ముడు, ద్రుపద నందనన్ బెండ్లియాడె
    క్రీడి మత్స్య యంత్రము గొట్టి కృష్ణ నతడు

    రిప్లయితొలగించండి
  25. గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ గారి పూరణ....

    గంగ సుతుడెవరు? నరుడు ఘనత మత్స్య
    యంత్రమును గొట్టి యెవరి బెండ్లాడె ? దెలుపు
    సీత ముదమంద రాముడు జేసె నేమి?
    భీష్ముడు, ద్రుపద నందనన్, బెండ్లి యాడె.

    రిప్లయితొలగించండి
  26. గురువర్యులకు నమస్సులు. ఇటువంటి కష్టమైన ప్రాస యిచ్చి నప్పుడు చివరలో తమరి పూరణ కూడా యిస్తే మాకు ఉపయోగంగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. గురుదేవులు మన్నించాలి పద్యములోని విరామచిహ్నాలు తొలగించి సవరించినాను పరిశీలించ ప్రార్ధన
    భీష్మంబైన ప్రతిజ్ఞతో నెవడు తా బెంద్లాడ బోనంచనెన్
    భీష్మంబొప్ప సుయోధనునిన్ జఘనముల్ భీముందు భేదింప నా
    యుష్మ౦తుండగు పార్ధుడేయ ఝషము న్నుత్సాహ ముప్పొంగగన్
    భీష్మాచార్యుడు. పా౦డవుల్ పొగడగా.పెండ్లాడె పాంచాలినిన్

    రిప్లయితొలగించండి