5, జులై 2016, మంగళవారం

సమస్య - 2079 (లావే యీశ్వల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
“లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా”
లేదా...
“లావే యీశ్వల ములాలి లక్షించు హలీ”

59 వ్యాఖ్యలు:

 1. గజేంద్ర మోక్ష ప్రార్ధనని , పరీక్షిత్ ప్రార్ధనగా చిత్రిస్తూ ... తల్లికడుపులో చేసే 'చిన్ని ' ప్రార్ధన కాబట్టి


  బావా యంచు మదీయ ధాత జనకున్ భావించు నీ చిత్తమీ
  దావాగ్నిన్ గని యూలకుందునె శలోత్పాతంబుహెచ్చంగ నే
  డీ వేడిన్ తనువోపలేదు శలణంబీశా జగత్లక్షకా
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   ‘జగద్లక్షకా’ అనండి. నిజానికి ‘జగత్+లక్షకా=జగల్లక్షకా’ కావాలి. కానీ ఈ నియమం ఇక్కడ పనికిరాదు.

   తొలగించు
 2. దేవా! "లా" పలకంగ లాదు పలువున్ తీయంగ మాటాడగన్
  లావా మ్మని పిల్చి చేలి యువకుల్ లాసంబు లాడున్ కదా
  నీవే దిక్కిక లామ!శౌలి !హలి !మన్నింపంగ శ్లీనాధుడా!
  లావే యీశ్వ కావవే వద సంక్షింపు భద్లాత్మకా!!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సత్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 3. లావొక్కింతయు లేదుర !
  కావుము మముకరు ణతోడ; కాననపు చలిన్
  ఠావులు దప్పె "ర" పలుకన్
  లావే యీశ్వల ములాలి లక్షించు హలీ !

  సావేజిత
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 4. నీవేది క్కనిన మ్మియుంటి నిగదా నీప్లేమ కాలుణ్య మున్
  భావోద్వేగము నందునన్ మునిగినే భాసిల్ల జాలన్ ప్రభూ
  దేవానాదు మొరన్ వినంగ కనియీ దీనున్ పలీక్షింప కున్
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ రెండవ పూరణ బాగుంది. కాని ప్రభూ, మొరన్ అని రకార ప్రయోగం చేశారు.

   తొలగించు
 5. లావొకింతయు లేదు ధైల్య మిలలో లంబొయ్యె ప్లానంబులున్
  ఠావుల్ దప్పెను మూల్చవచ్చె తనువున్ డస్సె శ్లమంబయ్యెడిన్
  నీవే తప్ప నితప్పలంబె లుగ మన్నించన్ దగున్ దీనునిన్
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా”

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. లక్ష్మినారాయణ గారూ,
   ‘ధైర్య(ల్య)ము విలోలంబయ్యె’ దగ్గర టైపాటు...

   తొలగించు
 6. ఏవే దంబుప ఠించిన
  భావము తెలియంగ లాదు భాషయు నసలే
  బ్లోవుము మోదము నొందగ
  లావే యీశ్వల ములాలీ లక్షించు హలీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అక్కయ్యా,
   మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 7. రా పలుకని వాని ప్రార్థన.....

  లావేమీ లామాయన!
  లావేమీ క్లుష్ణమూల్తి! లమమాలమణా!
  లావే "లా"నిమ్ము దొలా!
  లావే యీశ్వల! ములాలి! లక్షించు హలీ!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గోలి వారూ,
   బాగుంది మీ పూరణ. అభినందనలు.
   ‘రమారణా(లమాలమణా)’ అనికదా ఉండాలి. ‘లక్ష్మీలమణా’ అందామా?

   తొలగించు
  2. మాస్టరుగారూ! ధన్యవాదములు....రమమా రమణా ...అని నాఉద్దేశ్యము...అలా వ్రాయవచ్చంటారా?

   తొలగించు
 8. లావే నను బ్లోవగ నిటు
  లావే ఈశ్వల ములాలి లక్షించు హలీ!
  కావాలా నాకిపుదే
  "యూవీదబ్ల్యూ" చదువులు యూదల గొత్తన్?

  (అక్షలాలే సలిగా పలక లాని ఒక చిన్నాలి మనోగతం)
  "యూవీదబ్ల్యూ" చదువులు = ఆంగ్ల చదువులు అనే అల్దంలో వ్లాయదం జలిగింది)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీధర రావు గారూ,
   పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘కావలయును నా కిపుడే’ అనండి. ‘యూదల గొత్తన్’...?

   తొలగించు
  2. ఓహో.. ఊదరగొట్టన్.. అనియా? ‘చదువులు+ఊదర=చదువు లూదర’ అవుతుంది కదా! ‘చదువులె యూదలగొత్తన్’ అనండి.

   తొలగించు
  3. గురువు గారికి నమస్కారములు. మీ సూచన మేరకు సవరించాను చూడండి,
   లావే నను బ్లోవగ నిటు
   లావే ఈశ్వల ములాలి లక్షించు హలీ!
   కావాలా నాకిపుదే
   "యూవీదబ్ల్యూ" చదువులె యూదల గొత్తన్?

   ఈ విధంగా కూడా చేయవచ్చునా? తెలుప గలరు. ధన్యవాదములు. శ్రీధర రావు.
   లావే నను బ్లోవగ నిటు
   లావే ఈశ్వల ములాలి లక్షించు హలీ!
   కావలెనా నాకిపుడే
   "యూవీదబ్ల్యూ" ల చదువు లూదల గొత్తన్?

   తొలగించు

 9. జావళి జిలేబి రేఫా
  రావపు విషయము లరయక రమ్మని ఈశున్
  లావుగ లగణముల బిలిచె
  లావే ఈశ్వల ములాలి లక్షించు హలీ !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘లగణములు’...?

   తొలగించు
 10. నీవేదిక్కు పలాత్పల
  కావుము దయతోడ శౌలి, కాన నితలులన్
  భావించితి లక్షకునిగ
  లావే యీశ్వల ములాలి లక్షించు హలీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 11. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. పాపము ర పలుకలేని విధ్యార్థి యొకడు తెలుగు తరగతిలోన యప్పజెప్పిన పద్యము:

   లావొక్కింతయు లేదు ధైల్యము విలోలంబయ్యె ప్లాణంబులా
   ఠావుల్ దప్పెను మూల్ఛ వచ్చె తనువున్ డస్సెన్ శ్లమం బయ్యెడిన్
   నీవే తప్ప నితః పలం బెలుగ మన్నింపన్ దగున్ దీనునిన్
   లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

   ఆతని యవస్థ జూచి గురువు గారు వాని కొరకు "రాక్షర రహిత" పద్యము నిచ్చి (పాప మాఖరి పాదము నందా సంగతి మర్చిపోయారు) కంఠస్థము సేయమన్నారు. అది:

   పావన జన పాలక! తుల
   సీవన గోప లలనా విశేష విలోలా!
   భావజ సమధిక కాయా!
   లావే యీశ్వల ములాలి లక్షించు హలీ

   తొలగించు
  2. తోటి విధ్యార్థి బహు ర కార యుత పద్యము నిచ్చిన సందర్భం:

   సేవా రత రమణీ రమ
   ణావర! ధరణిసుర రంజనా!సుకుమారా!
   ప్రావృట్ఘనప్రభాంగా
   లావే యీశ్వల ములాలి లక్షించు హలీ

   తొలగించు
  3. కామేశ్వర రావు గారూ,
   1972లో నేనొక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు అనురాధ అనే అమ్మాయితో ‘ర’ పలికించడానికి శతవిధాల పయత్నించాను. ఎంత చేసినా రకారాన్ని లకారంగా పలికేది. నాకు ప్రభుత్వోద్యోగం వచ్చి ఆ స్కూలు వదిలిపెట్టాను. తర్వాత ఆ అమ్మాయికి ర పలకడం వచ్చిందో రాలేదో తెలియదు. నిన్న భర్తతో కారులో వెళ్తూ కనిపించింది. అప్పటి నా శ్రమ గుర్తుకు వచ్చి ఈ సమస్య సిద్ధమయింది.
   మొదటి పద్యాన్ని పూరణగా స్వీకరించలేము. ఇక రెండవ పూరణ బాగున్నది. కాని పద్యంలో మూడు పాదాలను రకారంతో పలికి చివరి పాదాన్ని లకారంతో పలకడం ఎలా?

   తొలగించు
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నా యూహ మీ యనుభవమును పోలియున్నది. సంతోషము కలిగినది.
   మొదటి పద్యము సమస్య పాద సమర్థన కొరకై యొక కథానిక గా నా పూరణ కు పీఠికగా వ్రాసాను. అది నాపూరణ కాదు. సహజ పాండిత్య విభూషితుని పద్యము శిరోధార్యమే గాని అన్యాథా భావించ లేము గదా! ఈ సారి నేను వృత్త సమస్య ను పూరించ లేదు.
   నా మొదటి పూరణ “ర” పలుకలేని విద్యార్థి చదివినట్లు భావింప దగినది. అందుకే ఆపూరణ లో “ర” అక్షరము లేకుండ (సమస్య పాదములో తప్ప) చేసిన పూరణ.

   రెండవది తోటి విద్యార్థి ఎక్కువ “ర” లతో నేడిపించుటకై యిచ్చినది. కానీ సమస్య పాదాన్ని మార్చకూడదు గనుక నా పాదమును యథాతథముగా వ్రాసితిని. అంతే.

   తొలగించు
 12. రా'వర్ణమ్మును 'లా'యటంచు పలుకన్ 'రా'ముందు,'లా'ముండయెన్
  'రావా'లావయె','రాధ','లాధయె'నికన్'రాగమ్ము' 'లా'గమ్మయెన్
  'రావే యీశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మ'నన్
  'లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మ'కాv

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   మీ పూరణ బాగుంది. అభినందనలు.
   రాముండు... రాముందు అయింది.

   తొలగించు
 13. నావేదన వినుమా హలి !
  నేవేగా నాకు దిక్కు నిన్నే కొలుతున్
  నావేదన గ్రహి యించుచు
  లావే యీశ్వల ములాలి లక్షించు హలీ!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   బాగుంది మీ పూరణ.
   గ్రహియించుము... గ్లహియించుము కావాలి కదా! నీవేగా.. టైపాటు వల్ల ‘నేవేగా’ అయింది.

   తొలగించు
 14. 'రా'వర్ణమ్మును 'లా'యన
  'రావే యీశ్వర మురారి న్రక్షించు హరీ'
  నీవిధముగ భాషించును
  లావే యీశ్వల ములాలి లక్షించు హలీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. తిమ్మాజీ రావు గారూ,
   బాగుంది మీ పురణ.
   రక్షించు... న్రక్షించు అని టైపయింది. ‘హరీ| యీ విధముగ...’ అనండి.

   తొలగించు
 15. గులువు గాలికి నమస్కాలములు

  ఓ వాత్సల్య గుణోత్తమా పులహలా భూతేశు గంగాధలా
  నీవే దిక్కని నమ్మినాను గద నన్నేలంగ లావేమిలా
  బ్లోవన్ , భక్తజనాళి పిల్చెనిను శంభో శంకలాయంచు నే
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

  మా వేదనలే వినుమా
  పావన చలితా పులహల భవభయ హాలీ
  నీవే దిక్కని నమ్మితి
  లావాయీశ్వల ములాలి లక్షించు హలీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విలించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో ‘భూతేశ’ అనండి.
   రెండవ పూరణలో పురహరుడు మురాతి ఎలా అవుతాడు?

   తొలగించు
 16. నీవే నాకిక దిక్కు శౌలి!దయతో నీప్లేమఁజూపించుమా!
  లావున్ దగ్గెను, నీపదాంబుజములన్, లామా! విడన్ జాల న
  య్యా! విశ్వాత్మ! వలాహమూల్తి !కనుమా! యజ్ఞేశ్వలా! పాహి వే
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా!

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 17. దేవా లా పలుకంగలేను వినుమా తీక్ష్ణంగ భావింపక
  న్నా వాగ్దేవికి చెప్పుమా కలుణతో నాశీస్సు లిప్పింపగన్
  నీవే దిక్కని నమ్మితిన్ గదల జ్ఞానేశా దయన్ జూపగన్
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా”

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ‘తీక్ష్ణం’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘తీక్ష్ణమ్ముగా నెంచకన్’ అనండి.

   తొలగించు
 18. లావూలావని పిల్తులే జనులు పిల్లల్లావు నా పేలులే
  లావొక్కింతయు లేదు లూపమున రెల్లల్లేను సన్నంబులే
  “లావోయీ”యని పాడలేను! “ల”లు పల్కంగాను లాదేలనే
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా॥

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. రఘురామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 19. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  లావై క్లొవ్వును పట్టితిన్ | నడువ జాలన్

  దాలిలో | కూల్చొనన్ ,

  లేవన్ జాలను | బీ . పి . హెచ్చినది |

  నిల్వీల్యు౦డ నైతిన్ సుగల్

  చే | వెచ్చి౦చితి డబ్బు డాక్టలులకే |

  శ్లీలామ చ౦ద్లా ! యికన్ ,

  లావే యీశ్వల ! కావవే వలద !

  స౦లక్షి౦పు భద్లాత్మకా !

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 20. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. రాఅక్షరమునుపలుకలేనివాడాఅన్నందుకుగురువు శిష్యని మనోవేదన
  1.దేవా|నాలుకనిచ్చి పల్కుటకు సందేహాలుగల్పించుటా?
  భావంబున్ వికలంబు జేయదగునా? వాత్సల్య సంధాయకా|
  నీవే దిక్కని వేడుచుంటిగద నిన్నెంచంగ మాటివ్వవా?
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా.
  2.దీవెన లుంచగ సాధ్యమె
  లావే యీశ్వల ములాలి లక్షించు హలీ|
  భూవలయంబునుగాచెడి
  జీవాత్మా మాటలిమ్ము జీవించుట కై

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించు
 22. ఈవేళ న్నుదయాన నే జదివితి న్నీశా ! సునామంబులన్
  వేవేగ న్గరుణించు మమ్ములను నీవీసారి కోదేవ !నా
  యీవిన్నాణము నాలకించి మలి నీ విప్పుo డు లాగోరెదన్
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని ర-ల గందరగోళంలో పడ్డారు.

   తొలగించు
 23. ప్రత్యుత్తరాలు
  1. నీవిటులనమన కూనను
   "రావే యీశ్వర మురారి రక్షించు హరీ!"
   'లా'వర్ణము రాదనెనిటు
   "లావే యీశ్వల ములాలి లక్షించు హలీ!"

   తొలగించు
  2. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 24. మావాణి చిన్న తనమున
  మావారొనరించు నుతుల మరిమరి వినుచున్
  ఈవేళనిట్లు పాడెను
  “లావే యీశ్వల ములాలి లక్షించు హలీ”

  అరాశ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అమరవాది రాజశేఖర శర్మ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 25. ఓ విప్రున్డు సమస్త వేదములు, సాంగో పాంగము న్నేర్చి , తా
  నో విద్యాలయ మందు బాలకులకు న్నో గాధ వర్ణించుచు
  న్నో విద్యార్థికి నేర్పబూన , పదముల్ నోరాడక న్నిట్లనెన్
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా

  గోవిందుఁడు కరితోననె
  లావొక్కింతయును లేదు లాదు మాటల ననగ
  న్నీవున్బలుకుమ చూసెద !
  లావే యీశ్వల ములాలి లక్షించు హలీ

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కృష్ణారావు గారూ,
   మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటిపూరణలో నాలుగుసార్లు ఒకను ఓ అన్నారు. అది దోషమే.
   రెండవపూరణ రెండవపాదంలో గణదోషం.

   తొలగించు
 26. నీవే దిక్కిక నాకును
  నావల మకరము విడువక ననుపీడించెన్
  కావగ జాగేలనయ్యా
  లావేయీశ్వర ములాలి లక్షించు హలీ

  ప్రత్యుత్తరంతొలగించు
 27. రావా, బాబూ కన్నా
  నా వేదన వినమటంచు నుడివిన మాతన్
  వెవ్వెవ్వనుచు బుడతడనె
  లావేయీశ్వలములాలి లక్షించుహలీ

  ప్రత్యుత్తరంతొలగించు
 28. జీవించన్ బహు బాధలొందితినయా జీవేశ్వలా వెసన్
  భావావేశము నొంది నత్తినయి లా పల్కంగ లేనయ్యహో
  నీ వాసమ్మును వీడి నన్నిక సదా నేస్తమ్ముగా నెంచుచున్
  లావే యీశ్వల కావవే వలద సంలక్షింపు భద్లాత్మకా!

  ప్రత్యుత్తరంతొలగించు